S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (24-2-2019 నుంచి 2-3-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం. అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. గురు సంబంధీకులకు నమస్కరించడం అవసరం. నూతన పరిచయాలు ఉంటాయి. క్రమంగా అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. అన్ని పనులు, నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. అసంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. ఖర్చులు పెట్టుబడులు అధికం. వారాంతంలో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు, గౌరవం పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. సోదర వర్గంతో సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెట్టుబడులు అధికం. కొంత వ్యర్థమయ్యే సూచనలు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడుస్తుంది. క్రమంగా ఆహార విహారాదులపై దృష్టి. గృహ వాహనాదుల విషయాలు ప్రస్తావించబడతాయి. విద్యాత్మక వ్యవహారాలపై దృష్టి. మానసిక అశాంతి. ఆలస్య నిర్ణయాదుల వల్ల సౌఖ్య లోపం. వ్యాపార వ్యవహారాల్లో కొంత ఒత్తిడి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఊహించని ఇబ్బందులకు అవకాశం. వారాంతంలో అభీష్టసిద్ధి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. వ్యవహార దక్షత. బాధ్యతలు అధికవౌతాయి. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని నష్టాలకు, ప్రయాణాలకు అవకాశం. ధార్మికమైన ఖర్చులు తప్పకపోవచ్చు. దానాదుల వల్ల మేలు కలుగుతుంది. క్రమంగా విశ్రాంతిపై దృష్టి. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాదులకు అవకాశం. నిర్ణయ లోపాలు ఇబ్బంది పెట్టే అవకాశం. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతల నిర్వహణ కొంత శ్రమను పెంచే అవకాశం. దానధర్మాలవల్ల మాత్రమే మేలు కలుగుతుంది. ఆలస్య నిర్ణయాల వల్ల సమస్యలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం వ్యతిరేకతలు అధికం. అన్ని పనుల్లోనూ పోటీలు ఎదురౌతాయి. మానసికమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం. రోగ నిరోధక శక్తి పెంచుకుంటారు. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. క్రమంగా సామాజిక అనుబంధాలు పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి. పెట్టుబడులకు అనుకూలం. పరిచయాలు విస్తరిస్తాయి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. కొత్త పరిచయాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో ప్రయోజనాలు పెంచుకునే ప్రయత్నం. లాభాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో సంతోషం. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి. మాట విలువ పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త నిర్ణయాలుంటాయి. కొన్ని సౌకర్య లోపాలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. పెద్దలతో అనుబంధాలు విస్తరిస్తాయి. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం. అన్ని రకాల సహకారం లభిస్తుంది. సంప్రదింపుల వల్ల సమస్యల నుండి బయటపడే అవకాశం. దగ్గరి ప్రయాణాలు. చిన్న ప్రమాదాలకు, ఒత్తిడులకు అవకాశం. జాగ్రత్త. శారీరకమైన శ్రమ ఉంటుంది. అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం. లాభాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాదులు ప్రభావితం చేస్తాయి. దగ్గరి ప్రయాణాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. అధికారిక వ్యవహారాలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. పదోన్నతిపై దృష్టి. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు ఇబ్బంది పెట్టి కాలం, ధనం వ్యర్థం చేయవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక లాభాలుంటాయి. క్రమంగా ప్రయోజనాదులపై దృష్టి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపం ఉంటుంది. అనారోగ్య భావాలు పెరుగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. వారాంతంలో ప్రయాణాదులకు అవకాశం. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ధార్మికమైన ప్రయాణాలు, ఖర్చులు కూడా ఉండే అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ఆందోళన తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులపై దృష్టి. సృజనాత్మకత. కుటుంబ ఆర్థికాంశాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడదు. మాటల్లో కొంత చాపల్యం కనిపిస్తుంది. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో శుభ సూచనలు. గుర్తింపు, గౌరవాదులుంటాయి. క్రమంగా పోటీలు, ఒత్తిడులు, చికాకులు అధికమయ్యే సూచనలు. విజయం సాధించినా శ్రమ తప్పకపోవచ్చు. శత్రువులపై విజయం సాధించే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో సమస్యలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక, వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులకు రూపకల్పన. ఇతరుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు అధికం. బాధ్యతలు అధికంగా నిర్వహించాలి. మాట విలువ పెంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. క్రమంగా కుటుంబ బాధ్యతలు విస్తరిస్తాయి. నిల్వధనంపై దృష్టి. బ్యాంకు వ్యవహారాల నిర్వహణ. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు, స్నేహానుబంధాలు తొందరపాటు వల్ల ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణాదుల్లో అనుకూలత. పోటీ రంగంలో గుర్తింపు. విజయ సాధన. వారాంతంలో సేవక వర్గంతో సంప్రదింపులు, సహకారం. ఆహార విహారాదులపై దృష్టి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. సంతృప్తిగా గడుపుతారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. దూర ప్రయాణ దృష్టి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. రుణాదులు కొంత ఒత్తిడికి గురి చేయవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవాదులున్నా శ్రమ తప్పదు. ఒత్తిడులను అధిగమించాలి. క్రమంగా అధికారిక వ్యవహారాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో శ్రమతో గుర్తింపు లభిస్తుంది. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. దైవ ధర్మ కార్యక్రమాల వల్ల మేలు కలుగుతుంది. సంప్రదింపుల్లో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు అవకాశం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదుల విషయంలో కొత్త ఆలోచనలుంటాయి. నిర్ణయాదుల్లో కొంత అనిశ్చితిగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. అభీష్టాలు నెరవేరుతాయి. నూతన ప్రణాళికలపై దృష్టి. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత. కొత్త పనుల నిర్వహణ. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో నైపుణ్యం, గుర్తింపు, గౌరవాదులుంటాయి. వారాంతంలో పోటీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. అన్నింటిలోనూ విజయం సాధించే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శత్రువులపై విజయం. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణాదులకు అవకాశం. ఆహార విహారాదులుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాదులపై దృష్టి. కుటుంబ సంబంధాల్లో శుభ పరిణామాలు. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. క్రమంగా బాధ్యతలు పెరుగుతాయి. కొత్త పనుల నిర్వహణ. కార్యనిర్వహణపై దృష్టి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయం సాధిస్తారు. పోటీ రంగంలో కొంత జాగ్రత్తగా మెలగాలి. మాట విలువ తగ్గే సూచనలు. అభీష్టాలు నెరవేరుతాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సంతానవర్గ సంతోషం. వారాంతంలో కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లో జాగ్రత్త. అనారోగ్య భావనలు. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. అనుకోని సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాల వల్ల సమస్యలకు అవకాశం. గౌరవ లోపాలుంటాయి. కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం. క్రమంగా ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. గుళ్లు గోపురాలు దర్శిస్తారు. ధార్మిక వ్యవహారాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. అయినా గౌరవం పెరుగుతుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వ్యవహారాలు లాభిస్తాయి. వారాంతంలో సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. పితృవర్గ కార్యక్రమాలపై దృష్టి. అన్ని పనులకు అనుకూలం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744