తిరస్కరణ(సండేగీత )
Published Saturday, 23 February 2019
మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లి, ఆ ఉద్యోగానికి మనం ఎంపిక అవకపోతే బాధ కలిగిస్తుంది.
తిరస్కరణ అనేది చాలా బాధ కలిగించే అంశమే!
మనం ఎవరినో ప్రేమిస్తాం.
వ్యక్తీకరిస్తాం.
వాళ్లు తిరస్కరిస్తారు.
మనం బాధపడుతాం.
మన జీవితంలో ఎన్నో తిరస్కరణలని ఎదుర్కొని వుంటాం. ఇది మన విషయంలోనే కాదు. అందరి విషయంలోనూ జరుగుతాయి. లక్ష మెజారిటీతో గెలిచిన నాయకుడు, ఆ మరుసటి ఎన్నికలో డిపాజిట్ కూడా రాకపోవచ్చు.
ఇవన్నీ సహజం.
తిరస్కరణలో అత్యంత దారుణమైనది మనల్ని మనం తిరస్కరించుకోవడం.
మనం ఓ పనిని చేయలేమని ప్రయత్నించక ముందే నిర్ణయానికి రావడం - అత్యంత దారుణమైనది.
ప్రయత్నం చేయక ముందే మనం తిరస్కరణకి గురి అవుతామని అనుకోవడం.
మన విజయాల గురించి ఆలోచించకుండా వైఫల్యాల గురించి ఎక్కువగా ఆలోచించడం.
పని మొదలుపెట్టక ముందే అపజయం గురించి ఆలోచించడం.
అందరికీ అన్నీ సాధ్యంకావు.
కానీ
కొన్ని పనులు కొంతమంది మాత్రమే చేయగలరు.
మనం చేయాలనుకున్న పని మీద నిరంతరం దృష్టి కేంద్రీకరించాలి.
మనలని మనమే తిరస్కరించుకోవడం మానెయ్యాలి.