S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. మానస సంచారాన్ని

నేను-
బుద్ధి జీవిని.. బుధక్షేత్రాన్ని.
మానసికాన్ని.. మానస సంచారిని.
అతీత మానసాన్ని.. జ్ఞానత్రయాన్ని
నాలో
ఒక మెదడు
ఆ మెదడుకు కుడి ఎడమలు...
ఈ కుడి ఎడమలు ఏకం కావటమే యోగం.
ఈ జీవన యోగమే న్యూరాన్ ఫ్యూచర్.
నేను యాక్టివ్‌గా ఉన్నా, రెస్ట్‌లో ఉన్నా నా మెదడు పని చేస్తున్నట్లే నిద్రలో ఉన్నా అలాగే పని చేస్తుంటుంది. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ మెదడు పని ఆగదు... కానీ పనితీరే వేరు.. ఈ పని తీరంతా ఎలక్ట్రికల్ యాక్టివిటీనే!
అన్నట్టు, నేను మనసును.
నేను మనసును పరిగెత్తించాలి. లేదా మనసు నన్ను పరుగులు పెట్టించాలి. రాత్రయినా, పగలయినా లేచి ఉన్నా, పడుకుని ఉన్నా - ఏదో ఒక స్థితిలో నేను ఉంటూనే ఉంటాను.
మొత్తానికి, నేను అయినా తగ్గాలి.. మనసు అయినా తగ్గాలి.
మనసును పరిగెత్తించటం నేను చేస్తుంటే నేను తగ్గాలి... మనసు నన్ను పరిగెత్తిస్తుంటే మనసు తగ్గాలి. మొత్తానికి, నేను అయినా మనసు అయినా తగ్గక తప్పదు. ఆలోచనలు నా మీద దండయాత్ర చేయకుంటే - అంటే, ఆలోచనల ఉధృతి తగ్గితే ‘నేను’ నెమ్మదించినట్లే! కుదురుకున్నట్లే!
సింపుల్‌గా చెప్పుకోవాలంటే - హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న బ్రెయిన్‌వేల్స్ లోయర్ ఫ్రీక్వెన్సీకి చేరుకోవాలి. అప్పుడు మనసు నెమ్మదిస్తుంది. అంటే, ఆలోచనల మధ్య గాప్ పెరగాలి. దీనే్న ఆలోచనా తరంగ నిడివి తరగటం అంటాం. తరంగ నిడివి తగ్గటం వల్ల ఆలోచనకు ఆలోచనకు మధ్య సమయం ఎక్కువవుతుంది. ఫలితం ఆలోచనను ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. ఇలా ఆలోచనల ఎంపికలో మనసు సమర్థత పెరుగుతుంది. అప్పుడు, మన ధ్యాస ఎంపిక చేసుకున్న ఆలోచన పైనే ఎక్కువ సమయం నిలవగలుగుతుంది. దీనే్న మనం కాన్‌సన్‌ట్రేషన్ అంటుంటాం.
* * *
సర్వసాధారణంగా దైనందిన జీవితం సచేతనాయుతంగా సాగుతుంటుంది. ఆలోచనలు తోసుకు వస్తుంటాయి. ఫలితంగా అవసరమైన, అనవసరమైన సమాచారమంతా పోగవుతుంటుంది. ఈ సమాచార పోగు, రోజువారీ వ్యవహారాల్లో పరుగులు పెట్టిస్తుంది. ఇదే ‘హైపర్ యాక్టివిటీ’గా వ్యక్తమవుతుంటుంది. ఫలితం యాంగ్జయిటీ.. ఆందోళన.
ఇక, దైనందిన జీవితంలో, కాస్త జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మనం ‘ఎలర్ట్’ కాగలుగుతాం. అంటే, పరుగులు పెడుతున్న మనసుకు అప్పుడప్పుడు కళ్లెం వేయగలుగుతున్నామన్నమాట.
అరవై మైళ్ల వేగంలో ఉన్న హైపర్ యాక్టివిటీ నలభై మైళ్ల ‘ఎలర్ట్‌నెస్’ను చేరుకుంటుంది. మనసు ఆలోచనలతో కొట్టుకుపోక ‘వర్కింగ్ స్టేట్’కు చేరుకుంటుంది. అంటే- వివేచన, వర్గీకరణ, ప్రణాళిక, అంచనా అనేవి ఆలోచనను తూకం వేస్తాయి.
నలభై మైళ్ల వేగం సూచికలతో, హెచ్చరికలతో ఇరవై మైళ్ల వేగానికి తగ్గాలి. అలా, మనసును నియంత్రించటం మన చేతల్లోకి వస్తుంది. పరుగు నుండి నడక వైపు మనసు మళ్లుతుంది. ప్రతీ పనీ రిలాక్స్‌గా చేయటానికి మనసు సిద్ధమవుతుంది. అంటే, పరుగు నడకగా మారిందంటే, మనం బాహిరంగాను, ఆంతరికంగాను శాంత పడుతున్నట్లే.
డ్రైవ్ చేస్తున్న వెహికల్ నుండి దిగి మన నడకను నాలుగు మైళ్ల స్పీడ్‌కు పరిమితం చేయాలి. వాకింగ్ అయినా మెడిటేషన్ అయినా ప్రారంభమయ్యేది ఆలోచనల వేగం అత్యల్ప స్పీడ్‌ను చేరుకున్నప్పుడే. థింకింగ్ మైండ్ విజుయల్ మైండ్‌కు చేరుకునేదీ ఈ స్థితిలోనే!
ప్రణాళిక కంటే స్పృహకు తొలి తాంబూలం దక్కుతుంది ఈ స్థితిలో. ఆలోచన కంటే సంకల్పం శక్తివంతమవుతుంది. ఆలోచనా బలంతో కాక సంకల్ప బలంతో సమస్యలు పరిష్కారమవుతుంటాయి. ఈ స్థితి మనలోని ఆజ్ఞను అందలమెక్కిస్తుంది. ఇదే సమాధ్యవస్థ.
ఇక, తురీయ స్థితి సంపూర్ణ శూన్య స్థితి. ఆలోచనలు లేని స్థితి. దేహం జడంలా అనిపిస్తుందే తప్ప మనసు సంపూర్ణ చైతన్యంగా ఉంటుంది. ఆ చైతన్యం అనుభవంగా, అనుభూతిగా నిక్షిప్తమవుతుంటుంది. ఆ నిక్షిప్తత మనసు ఎరుకలో ఉండదు కాబట్టి అది వ్యక్తీకరణకు అందదు. అందుకే దీనిని మానసాతీతం అంటుంటాం.
* * *
నా మెదడులో కోట్ల నాడీ కణాలు.
ప్రవృత్తి, ప్రవర్తన, ఆలోచనలు, ఉద్విగ్నతలు - ఇవన్నీ మెదడులోని నాడీ కణాల మధ్య జరిగే వ్యక్తీకరణలే! కణ సాంద్రత, కణ విద్యుత్తును బట్టి ఆలోచనా తరంగాల తీరు ఉంటుంది. ఈ ఆలోచనా తరంగాల వేగాన్ని కొలవటానికి ఇఇజి సెన్సార్స్ అనే ఆధునిక యంత్రాలు ఉపయుక్తమవుతున్నాయి. మెదడు కపాలంలోది కాబట్టి కపాలంపై ఈ సెన్సార్స్‌ను అమర్చితే ఆలోచనా తరంగాల ప్రవాహ వేగం తెలుస్తుంటుంది. ఇలా బ్రెయిన్ వేవ్స్ ఫోర్స్‌ను గామా, బీటా, అల్ఫా, తేటా, డెల్టాలుగా విభజించుకుంటున్నాం.
ఈ నేల మీద మనుగడకు దేహం అవసరమవుతున్నట్లే, విశ్వంలో మన అస్తిత్వానికి ఆత్మ అవసరమవుతున్నట్లే, మన ఆలోచనలకు ఉద్వేగాలకు ఆలోచనా తరంగ మూలాలైన నాడీ కణాలు ముఖ్యమవుతున్నాయి.
ఇంతకీ, నాడీ కణాలైన న్యూరాన్స్‌ను సామూహికంగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రతీ నాడీ కణం దేనికది ప్రత్యేకమే! ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తిని బట్టి ఈ నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ సాధ్యమవుతుంటుంది. ఆలోచనా తరంగాలను ఎలక్ట్రొ ఎన్‌సిఫలొగ్రమ్ అనే ఇఇజి సెన్సార్ యంత్రం ద్వారా మెదడులోని నాడీ కణ విద్యుత్ మార్పులుగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇంతకీ, నాడీకణ వ్యక్తీకరణలన్నీ చైతన్య వాహికలే! అంతమాత్రాన అన్ని వ్యక్తీకరణలు ఒకే విధమైనవని కాదు.. కొన్ని ఆలోచనల ఫోర్స్ నెమ్మదిగా ఉంటుంటే, ఇంకొన్ని ఆలోచనల వేగం ఉధృతంగా ఉంటుంది. మరి కొన్నింటివి మంద్ర స్థాయి అయి ఉంటుంది.
నిజానికి, ఆలోచనా తరంగాలను సంగీత తరంగాలతో పోల్చుకోవచ్చు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే, ఆలోచనల వేగం నెమ్మదిస్తే మన కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. ఒకలాంటి నిద్రావస్థలో ఉంటాం. ఇక, మనం అత్యుత్సాహంతో పని చేస్తున్నామంటే, మన ఆలోచనా తరంగాల ఫోర్స్ ఉచ్ఛ దశలో ఉన్నట్లు.. అందుకే హైపర్ ఎలర్ట్‌గా రెచ్చిపోతుంటాం. ఆలోచనా తరంగాల వేగం మధ్యస్థంగా ఉంటే మనం మామూలుగా వ్యవహరిస్తుంటాం. ఏది ఏమైనా, ఆలోచనా తరంగాల ఉధృతి అనేది స్థలాన్ని, సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంటుంది.
* * *
మనలో అయిదు రకాల ఆలోచనా తరంగాలు. ఆలోచనలతో కూరుకు పోతున్నంత కాలం మనసు భౌతికానికే కట్టుబడి ఉంటుంది. ఆలోచనా తరంగ నిడివి తరుగుతుంటే అతీత మానసం కాగలుగుతాం. ఆలోచనకు ఆలోచనకు మధ్య గాప్ పెరుగుతుంటే అంతలా ధ్యానానికి దగ్గరవుతుంటాం. ఎంపిక చేసుకున్న ఆలోచన పైనే మనసును మగ్నం చేయగలుగుతుంటే మనం అతీత మనస్కులమే! మహాత్ములమే! మాస్టర్లమే!!
మన ఆలోచనలు అయిదు విధాలనుకున్నాం కదా! మనలో ఆసక్తి పెరిగిపోతున్నంత కాలం, మనలో ఉద్విగ్నత ఇబ్బడి ముబ్బడి అవుతున్నంత కాలం మన మనసుది హైపర్ యాక్టివిటీనే! ప్రపంచంలోనిదంతా మన మనసుల్ని నింపేయాలనుకోవటం జ్ఞానతృష్ణ అని మనం భ్రమపడతాం. నిజానికి, ఈ మానసిక వర్తనమంతా ‘గామా’ స్టేట్ ఆలోచనా తరంగాల వల్లనే.
ఇక, ఆలోచనలు కేవలం ఆసక్తి వెంటే పరుగులు పెట్టక కొంత ప్రణాళికాబద్దంగాను, ఇంకొంత పద్ధతిగాను సాగితే మనలది ఎలర్ట్ మైండ్ అవుతుంది. అంటే, ‘బీటా’ స్టేట్ ఆలోచనా తరంగాలే మన దైనందిన కార్యకలాపాల్ని నిర్దేశిస్తుంటాయి. ఇదంతా లోయర్ మైండ్ యాక్టివిటీ.
బీటా బ్రెయిన్ వేవ్స్ వల్ల ఎంత సమర్థతతో కార్యాచరణ సాగినప్పటికీ అలసటకు, ఒత్తిడికి, భయాందోళనలకు గురికావటం జరుగుతుంటుంది. బీటా తరంగాల తీవ్రత వల్ల డిప్రెషన్, మూడ్‌నెస్‌లు కూడా వేధిస్తుంటాయి. ఈ ఉధృతి మన ఇమ్యూన్ సిస్టమ్‌ను కూడా దెబ్బ తీస్తుంటుంది. మొత్తానికి, బీటా బ్రెయిన్ వేవ్స్ ‘కాన్షియస్’ స్టేట్‌కి చెందినవే.
మనసును కొంత కుదుటపరచి, మానసిక సరళిని మార్చేవి ‘అల్ఫా’ స్టేట్ ఆలోచనా తరంగాలు. ఈ అల్ఫా స్టేట్‌లో కాస్త నెమ్మదిస్తాం, నిలకడ అవుతాం. ప్రశాంతమవటానికి సమాయత్తమవుతాం. శ్వాస మీద ధ్యాస పెట్టినా, పచ్చటి ప్రకృతిలో నడక సాగించినా, మనసుకు నచ్చిన పని ఏది చేసినా మనలో ‘సంయమనం’ నెలకొని మనది ‘అల్ఫా’ స్టేట్ అవుతుంది. అంటే, అల్ఫా స్టేట్ ఆలోచనా తరంగాలు మన మనసును, దేహాన్ని రిలాక్స్ చేస్తాయి.
కాన్షియస్‌గా ఉంటూనే వత్తిడికి గురికావటం బీటా బ్రెయిన్ వేవ్స్ వల్ల జరుగుతుంటే అల్ఫా బ్రెయిన్ వేవ్స్ వల్ల రిలాక్సేషన్ సాధ్యమవుతుంటుంది. పైగా, బీటా స్టేట్‌లో ఉన్నట్లుగానే అల్ఫా స్టేట్‌లోనూ, ఫోకస్డ్‌గా ఉంటాం. సంపూర్ణంగా రిలాక్స్ అవుతాం.
బీటా బ్రెయిన్ వేవ్స్ వల్ల పీక్ పెర్ఫామెన్స్ సాధ్యమవుతుంది... జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఎంతటి క్లిష్టమైన దాన్నయినా సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే, సూపర్ లెర్నింగ్ సాధ్యమవుతుంది. భయభ్రాంతులు, అనవసర అలవాట్లు మనల్ని చేరవు. అందుకే, అల్ఫా వేవ్స్ మెడిటేషన్‌కు, హయ్యర్ ఇంటెలిజెన్స్‌కు తొలి ద్వారాలవుతుంటాయి.
శబ్దం నిశ్శబ్దమై, ఆలోచనల వేగం తగ్గుముఖం పట్టి, ధ్యానమగ్నమైన స్థితి ‘తేటా’ స్టేట్. ఈ స్థితిలో మనం ప్లాన్ ప్రకారం ధ్యానమగ్నం కాము. ప్రారంభంలో కూర్చోవటం వరకే మన ప్రణాళిక సాధ్యమవుతుంది. ఆ తర్వాతిదంతా ‘డీపర్ స్టేట్ ఆఫ్ అవేర్‌నెస్’. అంటే, జాగృత స్థితిలా అనిపించే స్పృహలో మన ధ్యానం సాగుతుంటుంది. ఈ స్పృహతో మన సంకల్పాలు శక్తిమంతాలవుతుంటాయి. సంకల్పాల వల్లనే అదృశ్యాలు సైతం దృశ్యమాన మవుతుంటాయి. ‘స్వ’రూప సాక్షాత్కారమూ సాధ్యమవుతుంది.
‘తేటా’ స్టేట్ అంటే గికంగా సాధ్యవయ్యే ట్రాన్స్ స్టేట్. లోయర్ మైండ్ యాక్టివిటీ దాదాపుగా తొలగి అతీత మానసం అవుతాం. స్వప్న స్థితిలా అనిపించే, జాగృదావస్థనే ఇది. తేటా స్టేట్‌లో ముక్కూమొహం తెలీని వారు సైతం దగ్గిరవుతుంటారు. ఒక విధంగా అది మన ‘ఆరా’ ఆకర్షణ. సమస్యల్ని ఇట్టే పరిష్కరించగలం, పరిష్కరించుకోగలం. అంతర్దృష్టి, అంతరంగ ఆవిష్కరణలు అంది వస్తాయి.
* ధ్యానమగ్నం కావటం వల్ల మన బ్రెయిన్‌లోని గ్రే మాటర్ వాల్యూమ్ అధికమవుతుంటుంది.
* ధ్యానం మన బ్రెయిన్‌లోని డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ యాక్టివిటీని తగ్గిస్తుంటుంది.
* ధ్యానం హిపొ కాంపస్‌లోని కార్టికల్ మందాన్ని పెంచుతుంది.
* ధ్యానం ‘నేను’ను మన ముందు నిలుపుతుంది.

-విశ్వర్షి 93939 33946