నేను.. అతీత మానస సంచారిని
Published Saturday, 2 February 2019నేను
అలిఖిత ప్రతిని
సంకల్ప సంహితను.
అదృశ్య అక్షరాకృతిని
అతీత మానస సంచారిని
ఆత్మ జాగృత సత్యాన్ని.
నాది -
స్వప్నం కాని సత్యలోక ప్రస్థానం
ఇహం కాని పరకాయ ప్రవేశం.
* * *
అతీత మానసం అంటేనే దేహాన్నీ, మనస్సునూ దాటిన ‘పర’ స్థితి.. థర్డ్ డైమన్షనల్ వేగా అభివ్యక్తమయ్యే ‘పర’కాయం. ఫోర్త్ డైమన్షన్‌లోకి పరకాయ ప్రవేశం. లోయర్ మైండ్‌ది ‘ఇహ’కాయమైతే, హయ్యర్ మైండ్‌ది ‘పర’కాయం. పరకాయ ప్రవేశంతో మన ఆలోచనలు స్వ-ఇచ్ఛా పూరితమై హయ్యర్ విస్‌డమ్‌గా పరిమళిస్తాయి. అందుకే, హయ్యర్ మైండ్‌ను ‘ఇన్‌ట్యూషనల్ మైండ్’ అనీ అంటుంటాం. లోయర్ మైండ్‌వి ఆబ్‌స్ట్రాక్ట్ ఐడియాస్ అవుతుండగా హయ్యర్ మైండ్‌వి ఇన్‌ట్యూషనల్ ఇంప్రెషన్స్‌గా విరాజమానం అవుతున్నాయి.
పరకాయ ప్రస్థానం సత్యం వాకిట నిలుపుతుంది. ఇంతకీ ఈ పరకాయం ఆత్మకాయమే!
గిక ప్రతిభతో రాణించేది ఇన్‌ట్యాషనల్ మైండ్. ఆత్మ ఆవిష్కరించుకునేవన్నీ అంతరంగ అవగాహనలే! సత్య ప్రభంజనాలే! అందుకే, గికంగా వనలది త్రిదళ వ్యక్తిమత్వ మవుతోంది. ఈ వ్యక్తిమత్వం ప్రకాశించేది మానవ దేహంలోనే కాబట్టి మన దేహమూ, మన మనస్సూ రథమూ, రథాశ్వాలూ అవుతుంటే మనమే అంటే ఆత్మనే రథసారథి అవుతోంది.
హయ్యర్ మైండ్‌ది సంపూర్ణ చైతన్య ప్రవాహమైతే లోయర్ మైండ్ ఉపచేతనా తటాకం. లోయర్ మైండ్ ఆలోచనా తీరు వేరు.. కోరికలూ వేరు. అవసరాలు వేరు. ఇష్టాలు వేరు. అసలు, స్వభావమే వేరు. కొంత లోయర్ మైండ్‌ను గాడిదతో పోలుస్తుంటారు. శిక్షణతో అది మన బరువులను మోస్తుంటుంది. శిక్షణా రాహిత్యంలో అదే బరువవుతుంటుంది. మన మనసు కూడా ఇంతే! ఇష్టాలు అందినపుడు మనసు తేలిక అవుతుంటుంది. అనుకున్నవి జరగనపుడు మనసు బరువవుతుంది.
గిక సాధనతో వన ధ్యాన సంకల్పాలే ఇన్‌ట్యూషనల్ మైండ్ ప్రతీకలవుతుంటాయి. అందుకే దాన్ని సూపర్ కాన్షియస్‌నెస్ మైండ్ అనీ అంటుంటాం. సూపర్ కాన్షియస్ మైండ్ అంటేనే ఆత్మల సమావేశ మందిరం.. అది ఖగోళ విశ్వవేదిక.
కార్యకారణాలతో అంటే హేతువును వెతుక్కునేది లోయర్ మైండ్. విశ్వసనీయతతో అడుగులు వేసేది హయ్యర్ మైండ్. అందుకే, లోయర్ మైండ్ థింకింగ్ మైండ్.. హయ్యర్ మైండ్ ఇన్‌ట్యూషనల్ మైండ్. లోయర్ మైండ్‌కు ఆలోచనే ప్రాతిపదిక. హయ్యర్ మైండ్‌కు సంకల్పమే హృదయ పీఠిక.
* * *
హేతువులు వాస్తవాలే! ఆధారాలే!! అయినప్పటికీ అవే సత్యాలని కాదు. వాస్తవం సత్యానికి ఒక ముఖం అయితే రెండో ముఖం అనుభవం. ఆధారంగా అనుభవం వివ్వాస పాత్రమైతేనే అది వ్యక్తి ధర్మానికి బీజం వేయగలిగేది.
అన్నట్టు, దైహిక మానసానికి పౌరుషం ఎక్కువ... పురుష తత్వం అధికం.. అందుకే, లోయర్ మైండ్ ఎల్లప్పుడూ తన మాటే నెగ్గాలనుకుంటుంటుంది. అతీత మానసానికి సున్నితత్వం ఎక్కువ.. స్ర్తి స్వభావ భూయిష్ఠం. అనుభవంగాను, అనుభూతిగాను స్పందిస్తుంటుంది.. వ్యక్తీకరణ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటుంది.
లోయర్ మైండ్‌ది ఓపెన్డ్ సరెండర్‌నెస్. అయితే హయ్యర్ మైండ్‌ది సరెండర్డ్ ఓపెన్‌నెస్. లోయర్ మైండ్ ‘్ఫలితం’ తనకు అనుకూలంగా, తాను ఆశించింది అయి ఉండాలనుకుంటుంది. హయ్యర్ మైండ్ లోయర్ మైండ్‌లా ఫలితాన్ని తన పరిధులకే పరిమితం చేసుకోదు. ఒక విధంగా లోయర్ మైండ్‌తో ‘నేను’ అడిక్టివ్, కండిషన్డ్, డిస్టార్టర్డ్ అవుతుంటే హయ్యర్ మైండ్ ఆపర్చునిటీ టు ఎక్స్‌ప్రెస్ అండ్ అన్‌ఫోల్డ్ అవుతుంది. అంటే, హయ్యర్ మైండ్‌ది మడత పేచీ కాదు.. అంతా పారదర్శకతే!
భయం, సందేహం, అపనమ్మకం - అనేది దైహిక మనస్సుకు కంచె వేస్తుంటాయి. అయితే, అతీత మానస రిలాక్స్‌డ్, ఓపెన్డ్, ఎక్స్‌పానె్డడ్‌ల సమాహారం. అంటే, హయ్యర్ మైండ్‌కి కంచె ఉండదు. కాబట్టి, కంచె చేనును మేసే అవసరం రాదు. ఎటువంటి భయాలు, సందేహాలు, అపనమ్మకాలు లేకుండా వర్తమానంలోకి పాజిటివ్‌గా ప్రవహించటమే హయ్యర్ మైండ్ చేసే పని. ముఖ్యంగా, హయ్యర్ మైండ్ ‘బీయింగ్ ఓపెన్ టు రైట్ యాక్షన్’ సదా సిద్ధమై ఉంటుంది.
లోయర్ మైండ్, హయ్యర్ మైండ్‌ల పనితీరు గురించి ఒక చిరు అనుభవం - నా విద్యార్థి దశ నాటిది -
ఎస్‌ఎస్‌ఎల్‌సి - పదకొండో తరగతి - పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ -న్యూస్‌పేపర్‌లో నా నెంబర్ లేదు - అంటే, తప్పినట్లేగా! అప్పటికి నాకు పదిహేనేళ్లు. నాపై నా నమ్మకం అపారం. పాస్ అయ్యామని చుట్టుపక్కల ఫ్రెండ్స్ స్వీట్స్ పంచుతుంటే నేనూ మా అమ్మను స్వీట్ చేయమని సతాయించాను. కొడుకు ఉత్తీర్ణుడు అయినట్లు ధృవీకరణ లేకుండా పాస్ అయ్యానని మిఠాయిలు పంచి పెడ్తానంటే ఏ తల్లి మనస్సు తల్లడిల్లకుండా ఉంటుంది. నేను తప్పినట్లే అని అమ్మ నిర్ణయం. పాపం, లోయర్ మైండ్ భయపెట్టింది. నేను పాస్ అయినట్లే అని నా నిశ్చితాభిప్రాయం. ఇది ధీమానా? హయ్యర్ మైండ్ సంకేతమా!
మూడో రోజు ఉదయాన మా పక్కింటాయన పేపర్ తీసుకొచ్చి ఎస్‌ఎస్‌ఎల్‌సిలో పాసైన నెంబర్లు కొన్ని వచ్చాయని అనటంతో - చూస్తే - ఆ ఇరవై ముప్పై నెంబర్ల మధ్య నా నెంబర్ ఉంది.
అమ్మది ఆనందం - లోయర్ మైండ్ హర్షించింది.
నాన్న మొహంలో నా విశ్వాసానికి, నాకు మార్కులు వేసిన చిరునవ్వు - హయ్యర్ మైండ్ పులకించింది.
అది నా తొలి విజయం-
అమ్మ నాన్నల దగ్గర నా విజయ పతాక-
సమాజంలో నేను కాదు.. ‘నా సమాజానికి’ శ్రీకారం.
నా ‘ఇన్డిపెనె్డన్సీ’ అదృశ్యంగా నా భుజం తట్టింది.
అప్పటి నుండి, నా జీవన ప్రయాణంలో నేను అడిగిన వాటికి నాన్న వేసినవన్నీ టిక్ మార్కులే. ఏనాడూ నా ‘అడుగుకు’ నాన్న ఇన్‌టు మార్క్ పెట్టింది లేదు.. నా ‘అడుగు’ను ఆపింది లేదు.
ఇంతకీ - ఈ సంఘటనతో - ఈ సందర్భంలో - ‘నేను’ చెప్పొచ్చేదేమిటంటే - చుట్టుపక్కల సమాజం తమ ‘లోయర్ మైండ్’తో నన్ను ఫెయిలయిన విద్యార్థిని చేసింది. కాని నా ‘హయ్యర్ మైండ్’ నన్ను పాజిటివ్‌గా పాస్ చేయించి, ‘నా అస్తిత్వానికి’ ‘ఇన్డిపెనె్డన్సీ’ని కలిగించింది. ‘ఇన్-డిపెనె్డన్సీ’ నా భవిష్య మార్గమైంది. ఇది జరిగింది మా ఇల్లు ధ్యాన నిలయంగా మారిన తొలి వత్సరంలో.
నాటి నుండీ మా ఇంటిల్లపాదికీ నా ఈ ఉదంతమే వండర్‌ఫుల్. మాజికల్ లెసన్ అయింది. రైట్ యాక్షన్ వైపు ఓపెన్‌గా ఉంటే ఫలితం ఎంత పాజిటివ్‌గా ఉంటుందో చూపించింది. మరో ముందడుగు వేయటానికి కావలసిన నిబ్బరాన్ని ఇచ్చింది. సందేహం, భయం, అపనమ్మకాలకు ఎలా దూరంగా ఉండాలో నేర్పింది. హయ్యర్ మైండ్ ఆవిష్కరించిన సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు ఒక మచ్చుతునక - ఇది.
నా అక్షరాలు నన్ను ఇలా ఆవిష్కరిస్తుండగా ఎప్పుడో చదివిన కొన్ని వాక్యాలు ఇలా శబ్దిస్తున్నాయి.
య ౄళ ఆ్దజఒ జఒ త్ద్ఘీఆ హజదళూ ౄజశజూ తీజ దళఔ ఖఒ జశ ఘ ౄకూజ్ఘజూ యఛి త్ఘీకఒ చ్యిౄ జ్యూజశ ఆ్దళ ఒష్ద్య్య ఖశ, ఒఔళ్ఘరీజశ ‘్యఖూ ఆఖఆ్ద’ ఆ్య ఆ్దళ ఱ్యఒఒ, ఆ్య ష్యశఛ్యిశఆజశ ఘ ఔ్ఘఆశళూ యూ ఛిజళశజూ ఇ్యఖఆ హజఒ/ హళూ చఖజూళౄళశఆ యఛి ఖఒ, ఆఖఒఆజశ ఘ ఆ్దళ త్దీజళ ఆ్ద్ఘఆ ఘ శళతీ ఔ్ఘఆ్దత్ఘీక తీజ ఇళ ఒఖఔఔ్యఆళజూ ఇక ఆ్దళ శ్రీశజ్పళూఒళ. య ౄళ, ఆ్దజఒ జఒ ఆ్దళ ళ్ఘ ౄళ్ఘశజశ యఛి ‘ఇఖశజ్ఘూశషళ’ ఘశజూ కళఒ, ౄజ్ఘూషఖ్యఖఒ.
అవును, ‘ప్రస్తుతానికి ఇది ఇంతే’ అని నా దైహిక మనసు చెప్తుంటే ‘రేపటికి ఇదీ నీ ప్రయాణం’ అని నా అతీత మానసం మార్గదర్శి అవుతుంటుంది.
పాఠశాల
నా విశ్వసనీయతకు తొలి పాఠమైంది
కళాశాల
మలి చదువులకు తొలి పీఠమైంది
విశ్వవిద్యాలయం
ఆత్మవిద్యా నిలయమైంది
పరిశోధన
అస్తిత్వ శోధన అయింది
గృహమే
గురుకులమైంది
యోగమే
విశ్వమిత్రను చేసింది.