S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనస్సే ప్రామాణికం

నేను
దేహాన్ని! మనస్సును!!
వ్యక్తిని! వైయక్తికాన్ని!!
వ్యక్తిత్వాన్ని! వ్యక్తిమత్వాన్ని!!
అడుగులు నావే! అడుగుజాడలు నావే!!
నిర్ణయాలు నావే! ఫలితాలు నావే!!
సుఖమూ నేనే! శోకమూ నేనే!!
వ్యామోహమూ నేనే! వైరాగ్యమూ నేనే!!
మంచీ నాదే! చెడూ నాదే!!
స్పృహ నాదే! స్పందనా నాదే!!
నెగెటివిటీ నేనే! పాజిటివిటీ నేనే!
మారాలనుకునేదీ నేనే! మారకపోయేదీ నేనే!!
నేను-
ఎదగలేని తనంతో వైయక్తికాన్ని!
ఎనలేనితనంతో వ్యక్తిమత్వాన్ని!!
మానసిక వలువల వ్యక్తిత్వాన్ని!
అతీత విలువల విశ్వమతాన్ని!!
* * *
కళ్లు మూసుకుంటాం.. ధ్యానమగ్నం కావటానికి ప్రయత్నిస్తుంటాం.. మనస్సు మారాం చేస్తుంటుంది...
వర్తమాన జీవితానికి సంబంధించిన ఆలోచనలు ఒక దాని వెంట ఒకటి క్యూ కడుతుంటాయి. మనసును కట్టడి చేద్దామనుకుంటే ఆలోచనలు మనల్ని కట్టడి చేస్తుంటాయి. కాయం కుదురుగా ఉన్నా మనసు గాయమవుతుంటుంది. అంటే, ఇంకా మనస్సు ప్రాపంచిక అవసరాల చుట్టూ పరిభ్రమిస్తోంది. భ్రమిస్తోంది. అవును, నేనింకా లోయర్ మైండ్‌నే!
ధ్యానంలో నాకు కావలసింది మనసు కాదు.. హృదయం - అంతరంగం. అప్పుడే నేను అతీత మానసం కాగలను. అన్నట్టు, మనస్సును కాదని హృదయాన్ని చేరటానికి నా ప్రేమ విస్తృతం కావాలి... అవసరాలను మెర్సిలెస్‌గా వదలుకోవాలి.. కాలం నా గుప్పిట్లోకి రావాలి. ఇవన్నీ హయ్యర్ మైండ్‌కి అధిరోహణలే! అందుకే, లోయర్ మైండ్‌ను ఫిజికల్ మైండ్ అనీ, హయ్యర్ మైండ్‌ని సోల్ మైండ్ అనీ, స్పిరిట్యుయల్ మైండ్ అనీ అంటుంటాం.
మనలది సంసార జీవితం.. సాంసారికి తాపత్రయాలు తప్పవు. సన్యాసం స్వీకరించి విరాగి కావటం కాదు.. సంసారాన్ని కాదనకుండా వైరాగ్యాన్ని మనసుకు చేర్చాలి. లోయర్ మైండ్‌కి శిక్షణ ఇస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పుడే మన సాధన హయ్యర్ మైండ్‌కి చేరువ అవుతుంది. మన సాధన మనసు ప్రభావంతో కాక ఆత్మ చైతన్యంతో సాగుతుంది. అంటే, అతీత మానస ప్రభావం అన్నమాట.
అతీత మానసం అంటే మనసును కాదనటం కాదు, ప్రపంచాన్ని కాదనటం కాదు.. దేహ మనసు నిండి అతీత మానసం కావటం. నిచ్చెన లోయర్ మైండ్‌లోనే నేలను తన్నుకుని నిలబడి ఉంటుంది. అయితే తల మాత్రం గగన తలాన ఉంటుంది. గగన తలం హయ్యర్ మైండ్! నిచ్చెన అంటే ఆత్మనే!! మానస, అతీత మానసాల వారధి ఆత్మ. ఇలా, మైండ్‌కే పరిమితమైంది వ్యక్తిత్వం అవుతుంటే సోల్‌ను చేరిన మైండ్‌ది వ్యక్తిమత్వం.
జ్ఞాపకం లోయర్ మైండ్‌ది!
జ్ఞానం హయ్యర్ మైండ్‌ది!!
* * *
లోయర్ మైండ్‌ను మనం కాంక్రీట్ మైండ్, సబ్జెక్టివ్ మైండ్ అనీ అంటుంటాం. దైహిక ఆలోచనల వలయంలోనిది ఇది. మనసును దాటిన అంటే అతీత మానస అనుభూతులు హయ్యర్ మైండ్‌వి. లోయర్ మైండ్ ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే మన ఇంద్రియానుభవాల్ని సైతం తప్పుగా పరిగణించగలదు. ఇలా లోయర్ మైండ్ యాక్టివిటీస్‌తో మనం క్రేజీ అనిపించుకుంటుంటాం. అంటే, మంచిని చెడుగాను, చెడును మంచిగాను నిర్ణయించగల క్రేజీ మనస్తత్వం మనలది. డెసిజన్‌లా అనిపించే కన్‌ఫ్యూజన్ మన ఫిజికల్ మైండ్‌ది.
ఈ కన్‌ఫ్యూజన్ నుండి బయటపడేయగలది హయ్యర్ మైండ్. దీనే్న స్పిరిట్యుయల్ మైండ్, డివైన్ మైండ్, గిక్ వైండ్ అనీ అంటుంటాం. లోయర్ మైండ్ వాస్తవం చుట్టూ భ్రమిస్తుంటే, హయ్యర్ మైండ్ ‘సత్యం’ చుట్టూ బలపడుతుంటుంది. ఇలా, లోయర్ మైండ్‌ది వ్యక్తి దృష్టి అయితే హయ్యర్ మైండ్‌ది విశ్వదృష్టి.
లోయర్ మైండ్‌ను ఎంత వరకో అంతవరకే ఖాతరు చేయాలి. అంతేకానీ, అయిన దానికీ కాని దానికీ దాని మాట వినటం కూడదు. దానిని అందలం ఎక్కించకూడదు. దానిని వినటం మానేస్తే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. ఇలా ఆలోచనలు తగ్గుతాయి. లోయర్ మైండ్ శాంతిస్తోందంటే హయ్యర్ మైండ్‌లో మగ్నం అవుతున్నట్లే. మనమూ ధ్యానంలో మగ్నమవుతున్నట్లే!!
ఇహంలోని మన మనస్సు చిరు రహస్యాలను వాస్తవాలుగా మన స్పృహకు తెస్తోంది. ఇది పదార్థం, ఇది చైతన్యం అని చెప్పగలుగుతున్నప్పుడు అతీత మానసం ధ్యాన మగ్నతతో విశ్వ రహస్యాలను మన అనుభవాలుగా గుదిగుచ్చటంలో ఆశ్చర్యపోవలసిందేముంది. కనిపించే దానికయినా, కనిపించని దానికయినా మన ‘స్పృహే!’ ఆధారం. ‘అంగీకరించాల్సింది’ మన మనస్సు. ‘విశ్వాసం’ దీనికి ఉపబలం.
ఈ గిక ప్రస్థానంలో విశ్వవర్మాలు మానవ ధర్మాలు అవుతుంటాయి. ఈ ధర్మాచరణకు ‘నేను’ కర్తను, కర్మను, క్రియను. కొందరికి మన అతీత మానస ఆవిష్కరణలు అవాస్తవాలనిపించవచ్చు. అయినా ప్రామాణికంగా తలదాల్చేది నా మనస్సు.. అప్రామాణికమని తల విదిల్చేది నీ మనస్సు. తలదాల్చటం అతీత మానస స్పందన. దైహిక మానస స్పందన తల విదల్చటం. హెడ్ వెయిట్ అంటే ‘అహా’నికి విరబూసిన రెండు తత్వాలే రెండూను. ఒకటి హయ్యర్ మైండ్ అనిపించుకుంటుంటే వేరొకటి లోయర్ మైండ్ అవుతుంటుంది.
లోయర్ మైండ్ అంటే మనం ఉంటున్న సమాజం, ప్రపంచం అంగీకరించేది. హయ్యర్ మైండ్ నా సమాజం అంగీకరించేది. నా అస్తిత్వపరంగా నేను ఉంటున్న సమాజం వేరు, నా సమాజం వేరువేరు అవుతుంటాయి. అయినా, అస్తిత్వ ప్రస్థానంలో నేను ఉండేది, నా వెంట ఉండేది నా సమాజమే! నా తెలివితేటలు అనుకోవటం లోయర్‌మైండ్ చేసే పని.
తెలివితేటలకు కల్మషం అంటకుండా పరిశుద్ధ పరచగలది హయ్యర్ మైండ్. అంటే, హయ్యర్ ఇంటెలిజెన్స్ లోయర్ ఇంటెలిజెన్స్‌ను క్షాళనం చేయగలదన్న మాట. అతీత మానస ఆవిష్కరణల మన నిత్య చైతన్యానికి ఆవల పరభూమికలలో జరుగుతుంటాయి. కాబట్టి వాటికి సత్యసాంద్రత అధికం. అందుకే, ఆ సాంద్రత మన వ్యక్తిత్వంలోకి, ఆచరణలోకి దిగి రావటానికి మన ధ్యానం ఉపకరిస్తుండాలి.
* * *
* ‘నేను’ కళ్లు మూసుకుని పద్మాసనంలోనో, సుఖాసనంలోనో కూర్చుంటే మన బాడీ, మైండ్‌లు రిలాక్సింగ్ స్టేట్‌కి వస్తాయి - రెండు మూడు నిమిషాలలో.
* శబ్దాలను వినటం మానేసి, కళ్లు మూసుకుని వేటినీ చూడటం మానేసి తలను, భుజాలను, గుండె, శ్వాసకోశ, ఉదర భాగాలను, వీపు భాగాలను, కాళ్లు చేతులను చూడటం ప్రారంభించాలి. ఇలా అన్నమయ కోశాన్ని కొన్ని క్షణాలు వీక్షించాలి.
*ఒక్కొక్క ఇంద్రియం నుండి దృష్టిని మరల్చుకుంటూ నాసికా రంధ్రాలను చేర్చి ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దృష్టి నిలపాలి. క్రమంగా శ్వాసలు మందగించటంతోపాటు మనలోనికి ‘శక్తి’ చేరటం తెలుస్తుంటుంది. గుండెలోను, శ్వాసకోశాల్లోను, ఉదరంలోను, రక్తప్రసరణలోను ఈ శక్తి ప్రవాహం అనుభూతమవుతుంటుంది. ఈ ప్రాణమయ కోశం మన అంతరవలోకనలో అందుతుంది.
* ఇప్పుడు మన శ్వాసను, స్పృహను మెదడుకు చేర్చాలి. మెల్లగా స్పర్శేంద్రియాల అనుభూతి కలుగుతుంటుంది. అప్పుడప్పుడు చేతులు కదపాలనిపిస్తుంటుంది, కాళ్లు కదపాలనిపిస్తుంటుంది, తల తిప్పాలనిపిస్తుంటుంది - అంటే, ఇవన్నీ మానసిక క్రియలే.. ఇంకా, మనం మనస్సు అధీనంలో ఉన్నట్లే! మనస్సు చెప్పినట్లు వింటున్నట్లే! ఇలా మనకు మనోమయ కోశ వ్యవహారమూ తెలుస్తుంటుంది.
* ఈ స్థితిలో మన ఆలోచనలను మళ్లించాలి. కాళ్లు కదపాలి, చేతులు కదపాలి అనే భావాలను నియంత్రించగలిగితే మన ధ్యాస మనసు నుండి మరలుతుంది. అంటే, మనలో స్వస్పృహ, ఆత్మస్పృహ పెరుగుతున్నట్లు. చలనం లేని నిశ్చల భంగిమలో కూర్చోవాలనిపిస్తుంటుంది. అంటే, నియంత్రణతోపాటు మనలో విచక్షణ, వివేచన, విశే్లషణలు వికసిస్తున్నాయన్న మాట. ఇవన్నీ మన విజ్ఞానమయ కోశ కార్యకలాపాలే.
* మనసు దాటిన తర్వాత, బుద్ధిని దాటిన తర్వాత మనం నిలవాల్సింది హృదయ కుహరంలో. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మందగిస్తే, ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోవటం మానేస్తే మనం హృదయాన్ని అధిష్టించినట్లే. ఇది సమాధి స్థితికి తొలి ఉషోదయం. ఆనంద పీఠం. శాంత జీవన నెలవు. ఏ భావోద్విగ్నతలు లేని పరిపూర్ణ స్థితి. శూన్యతను చేరినట్లనిపించే ఈ స్థితి ఆనందమయకోశ అనుభూతే!
* శూన్యత శుద్ధతలోకి ప్రస్థానించటం, హయ్యర్ ఇంటెలిజెన్స్ ఆత్మజ్ఞానంగా ప్రసరించటం, ఆత్మస్పృహ నిర్వికల్పం కావటం నిర్వాణ, పరనిర్వాణ, మహా పరనిర్వాణ చైతన్యావస్థలను ఆవిష్కరించుకోవటమే. ఇదంతా యోగ ధ్యానశీలతనే.
* మహాపర నిర్వాణ చేతనను సైతం అనుభూతించి విశ్వకుండలినిలోని ప్రాణ కుంభాన్ని ఈథరిక్ స్పైన్‌లోని ప్రాణకుండలినికి చేర్చటం - ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ పంచకోశాల, స్థూల సూక్ష్మ కారణ శరీరాల ప్రస్తావన రాని గిక ప్రస్థానం ఆ పూర్ణత్వం.

-విశ్వర్షి 93939 33946