వారం వారం గోచారం (20-1-2019 నుంచి 26-1-2019 వరకు)
Published Saturday, 19 January 2019మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం అనుకోని ఇబ్బందులు. సంతృప్తి లోపం. గౌరవం తగ్గే సూచనలు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు అధికం. సంప్రదింపుల్లో ఒత్తిడులు. సహకార లోపాలుంటాయి. సోమవారం సౌకర్య లోపాలుంటాయి. ప్రయాణాదుల్లో ఒత్తిడులు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. పనులు వాయిదా. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. గుర్తింపు. సామాజిక గౌరవాదులకు అవకాశం. సంప్రదింపులకు అనుకూలం. బుధవారం అధికారిక వ్యవహారాల్లో లోపాలు. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతాన వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. గురువారం భాగస్వామ్య ఒత్తిడులు. కుటుంబంలో సమస్యలు. ప్రవర్తనలో మార్పు. సృజనాత్మకత వల్ల సమస్యలు. శుక్రవారం పదోన్నతి. అధికారిక వ్యవహారాలుంటాయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. పెద్దల ఆశీస్సులుంటాయి. అభీష్టాలు శ్రమతో నెరవేరుతాయి. మాతృవర్గంతో సంతృప్తి. సోమవారం ఆలోచనల్లో ఒత్తిడులు. నిర్ణయాదుల్లో ఆలస్యం. ఖర్చులు పెట్టుబడుల్లో క్రమశిక్షణ అవసరం. పరామర్శలకు అవకాశం. మంగళవారం పోటీలు ఒత్తిడులు చికాకులున్నా విజయ సాధన. గుర్తింపు లభిస్తుంది. విశ్రాంతి లోపాలుంటాయి. బుధవారం అనవసరమైన వ్యతిరేకతలు. నిర్ణయాదుల్లో ఒత్తిడులు. ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. చికాకులకు అవకాశం. గురువారం ఆహార విహారాలకు అనుకూలం. సంప్రదింపుల్లో సంతోషం. అభీష్టాలు నెరవేరుతాయి. నిర్ణయానుకూలత. శుక్రవారం పోటీల్లో విజయం. శ్రమకు తగిన గుర్తింపు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం గౌరవం కోసం వెచ్చిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అనుకూలం. నిర్ణయాదుల్లో అనుకూలత. విశ్రాంతి లభిస్తుంది. సోమవారం ఆలస్య నిర్ణయాలు. అన్ని పనుల్లో లోపాలు. ఊహించని ఇబ్బందులు. పనుల నిర్వహణలో అలసత్వం. మంగళవారం మాటల్లో చమత్కారం. కొన్ని సమస్యలున్నా నేర్పుతో అధిగమిస్తారు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. బుధవారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. మాటల్లో కొంత నైరాశ్య ధోరణి. గురువారం విశ్రాంతిగా గడుపుతారు. ఖర్చులు, ప్రయాణాలుంటాయి. వినోదాలు, విహారాలు సంభవం. శుక్రవారం మాటల్లో అధికారిక ధోరణి. నిల్వ ధనం విఃయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యుల ఒత్తిడులు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం పరిచయాలు విస్తరిస్తాయి. లాభాలు పెంచుకుంటారు. అనుకోని సమస్యలకు అవకాశం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యానుకూలత. సోమవారం అన్ని పనుల్లో జాగ్రత్త. ఊహించని సంఘటనలు. సంప్రదింపుల్లో ఇబ్బందులు. సహకార లోపాలు. మంగళవారం దూర ప్రయాణాలపై దృష్టి. సంతాన, ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. మాటల్లో చమత్కారం. బుధవారం ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలు పెంచుకునే యత్నం. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. గురువారం పరిచయాలు పెంచుకుంటారు. గృహ వాహనాదులపై దృష్టి. నిర్ణయాదుల్లో అనుకూలత. పోటీలుంటాయి. శుక్రవారం నూతన కార్యక్రమాల ప్రణాళికలు. తృప్తి తక్కువగా ఉన్నా ఉన్నత కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమాధిక్యం.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం పెద్దలతో సంప్రదింపులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. మంచి వార్తలుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సహకారం లభిస్తుంది. ప్రయాణాలు. సోమవారం ఆహార విహారాల్లో సమస్యలు. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. లాభాలున్నా సంతృప్తి ఉండదు. పనులు వాయిదా. మంగళవారం అభీష్ట సిద్ధి. అధికారిక వ్యవహారాలు. వ్యాపార వృద్ధి. నిర్ణయానుకూలత. అన్ని పనుల్లోనూ లాభాలు. బుధవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. సంతానంతో సమస్యలు. ఆలస్యంగా నిర్ణయాలు. నిరాశాభావం. సౌఖ్య లోపం. గురువారం స్ర్తి వర్గంతో సంప్రదింపులు. సహకారం లభిస్తుంది. ఉన్నత వ్యవహారాలు. హాయిగా విశ్రాంతిగా గడుపుతారు. శుక్రవారం ఆలోచనల్లో ఒత్తిడులు. వ్యర్థమైన ఖర్చులుంటాయి. సంతాన వర్గంతో సమస్యలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలు ఉన్నా విజయ సాధన. గుర్తింపు పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల ఆశీస్సులు. అనుకూలత. సోమవారం వ్యర్థమైన ఖర్చులు. ప్రయాణాలు. దానధర్మాలు. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపార వర్గ సహకారాలుంటాయి. గుర్తింపు. బుధవారం నైరాశ్యంగా గడుపుతారు. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. పనుల వాయిదా అన్ని విధాల మంచిది. గురువారం కొన్ని లాభాలుంటాయి. ఊహించని సంఘటనలకు అవకాశం. అయినా అప్రమత్తంగానే మెలగాలి. శుక్రవారం శారీరకమైన ఒత్తిడులు. శ్రమతో కార్యాలు. కార్యనిర్వహణలో తొందరపాటు కూడదు. బాధ్యతలధికం.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. చాంచల్యం కూడా ఉంటుంది. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. భాగస్వామ్యాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. సోమవారం భాగస్వామితో జాగ్రత్త. అనవసర విషయాలను వదిలేయాలి. అసంతృప్తి. దాచుకున్న ధనం కోల్పోవచ్చు. జాగ్రత్త. మంగళవారం వ్యాపారాదుల్లో సమస్యలు. నిర్ణయ లోపాలు. ఆహార విహారాల్లో అప్రమత్తం. మాట విలువ తగ్గవచ్చు. బుధవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. వార్తల్లో ఇబ్బంది. సమాచారం వల్ల కొత్త చికాకులుంటాయి. గురువారం పోటీ రంగంలో గుర్తింపు. విజయం లభించినా సంతోషం ఉండదు. కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. శుక్రవారం అధికారులతో జాగ్రత్త. పితృవర్గంతో సమస్యలు. ఆరోగ్య లోపాలకు అవకాశం. సంప్రదింపుల్లో జాగ్రత్త.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. విద్య, ఉద్యోగాదులు, కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే అవకాశం. మాట విలువ పెంచుకుంటారు. సోమవారం సేవక వర్గ సహకార లాభాలు. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు చర్చకు వస్తాయి. సంప్రదింపుల్లో లోపాలు. మంగళవారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. దూర ప్రయాణాలు. అధికారుల పరిచయాలు. బుధవారం లాభాలున్నా జాగ్రత్త అవసరం. సంతోషం కోల్పోతారు. ఆహార విహారాల్లో సమస్యలుంటాయి. గురువారం మాటల్లో చమత్కారం. ఆకట్టుకునే విధానం. ప్రయోజనాలుంటాయి. నిర్ణయాదుల్లో అనుకూలత. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. సౌఖ్య లోపం.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం అభీష్టసిద్ధి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా విజయ సాధన. గుర్తింపు గౌరవాదులు పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త నిర్ణయాలుంటాయి. సోమవారం లాభాలున్నా సంతోషం ఉండదు. వ్యతిరేక ప్రభావాలుంటాయి. ఆశించిన విజయం అందదు. పెద్దలతో జాగ్రత్త. మంగళవారం వ్యాపార వ్యవహారాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. కొన్ని అనుకోని ఒత్తిడులు. ప్రయాణావకాశాలు. బుధవారం కాలం శ్రమ వ్యర్థం కావచ్చు. పరిచయాలు, భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. నిరాశ తప్పకపోవచ్చు. గురువారం గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. శుక్రవారం భాగస్వామి కోసం వెచ్చిస్తారు. అనవసర ఖర్చులు. కాలం కోల్పోవచ్చు. అనుకోని ఇబ్బందులుంటాయి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. క్రియేటివిటీతో పనులు పూర్తి. వ్యతిరేకతలున్నా విజయం వరిస్తుంది. సుదూర ప్రయాణాలపై దృష్టి. సోమవారం భాగస్వామితో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు. గుర్తింపు ఉన్నా సంతోషం ఉండదు. నిర్ణయంలో ఆలస్యం. మంగళవారం వ్యాపార అనుబంధాలు పెరుగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. బుధవారం భాగస్వామితో వత్తిడి. మాటల్లో నిరాశ. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులకు అవకాశం. గురువారం సంతోషంగా, సౌఖ్యంగా గడుస్తుంది. లాభాలుంటాయి. ఆహార విహారాలుంటాయి. కుటుంబంలో అనుకూలత. శుక్రవారం భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. అధికారుల ఒత్తిడులుంటాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలుంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. తొందరపాటు కూడదు. ఆలోచనలకు శ్రమతో రూపకల్పన. సోమవారం మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడులు. నిల్వధనం ఖర్చవుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు. మంగళవారం కమ్యూనికేషన్స్ బాగా విస్తరించవచ్చు. లాభాలుంటాయి. వార్తలు సంతోషాన్నిస్తాయి. సహకార లాభం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో కొంత శ్రమ. వార్తల్లో ఇబ్బందులు. ప్రయాణ లోపాలు. అధికారులతో జాగ్రత్త. గురువారం సంతోషంగా గడుపుతారు. పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం అధికారిక సంప్రదింపులుంటాయి. ప్రయోజనాలు అధికం. పెద్దల ఆశీస్సులు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అత్యంత అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. శుభ పరిణామాలు. సోమవారం ఉద్యోగ స్థానంలో జాగ్రత్తగా మెలగాలి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. సంతాన వర్గంతో ఒత్తిడులు. మంగళవారం భాగస్వామ్య ప్రయోజనాలు. వ్యాపారాల్లో అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన. పెద్దల ఆశీస్సులు. బుధవారం వ్యతిరేకతలుంటాయి. లాభాలకై ఆశించడం మంచిది కాదు. పెద్దల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. గురువారం అన్ని పనుల్లోనూ అనుకూలత. పోటీల్లో విజయ సాధన. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. గుర్తింపు. శుక్రవారం ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు. వృత్తిలో గుర్తింపు.