నేను.. నిర్యాణ నిర్వాణ నిర్మాణాన్ని
Published Saturday, 19 January 2019నేను
ఎమోషనల్...
అయినా గెలవాల్సిందే!
అవును, నేను గెలుపును -
మనసు గెలుపును
గెలుపు అనుభూతిని
దేహ గెలుపును
గెలుపు అనుభవాన్ని.
గెలుపు అంటేనే-
ఇంటెలిజెంట్ పిలుపు.
పాజిటివ్ తలపు.
నేను
ఫిజికల్..
అయినా గెలవాల్సిందే!
అవును, నేను గెలవాల్సిందే!
నిబ్బరంగాను - నిబ్బనంగాను
నిర్యాణంలోను.. నిర్వాణంలోను
భౌతిక నిష్క్రమణలో-
నేను
మూడు దేహాల నిర్యాణాన్ని!
నాలుగు చైతన్యాల నిర్వాణాన్ని!
* * *
ఎమోషనల్ లైఫ్ అంటేనే మానస తటాకం.
తరగని తరంగాలుగా ఆలోచనలు! స్పందనలు, ప్రతిస్పందనలు!!
ఆలోచనా తరంగాలు మెంటల్ బాడీవి.
అవును, మన మనస్సును ఒక కొలనుతో పోల్చుకోవచ్చు. మనస్సులో ఒక ఆలోచన పొటమరించటం అంటే చెరువులో ఒక మట్టిబెడ్డ పడటమే... ఫలితం ఆ మట్టి ముద్ద కేంద్రంగా నలుతెరగుల తరంగాలే! ఆలోచనలు సుడులు తిరగటం అంటుంటామే - దీనికి సామ్యం తటాక తరంగాలే!
మైండ్ బాడీలోని తరంగాలే యాస్ట్రల్, ఈథర్, ఫిజికల్ బాడీస్‌లోని వైబ్రేషన్స్. ఈ మానసిక తరంగాలని గ్రహించగలగటమే టెలిపతీ. అంటే, యాస్ట్రల్ ప్లేన్‌లో మన ఈథరిక్ ఎనర్జీతో ఎదుటి వారి ఈథరిక్ ఎనర్జీతో సంయోగించి వారి ఆలోచనా తరంగాలను అందుకోగలగటం. ఇలా, మనసు ఈథర్‌లు సంయోగిస్తుండటం వల్ల మానస చైతన్యాన్ని, యాస్ట్రల్ చైతన్యాన్ని సైతం అధోచైతన్యంగానే చెప్పుకుంటున్నాం.
యాస్ట్రల్ ప్లేన్ నుండి అందుకుంటున్నప్పటికీ మనసుతో వివేచిస్తుంటాం కాబట్టి - ఫిజికల్ లెవల్‌లో - మెంటల్ బాడీని ఫిజికల్ బాడీ అంతర్లయగానే పరిగణిస్తాం. శరీరాంతర్గతమే అయినా దేహాంగాలపై ప్రభావం చూపిస్తుందే తప్ప మనస్సు అవయవం కాదు కాబట్టి మనస్సును ఆకాశతత్వం అంటున్నాం.
* * *
ఎమోషన్స్‌కు అతీతంగా జనించే ఆలోచనల ఫలితమే యాస్ట్రల్ లైట్! ఇది గిక సాధనా ఫలం. ఈ సాధనా ఫలాల అంటే యాస్ట్రల్ వెలుగులు ‘మెమొరాండం’ను చేరుతుంటాయి. ఈ ‘మెమొరాండం’ హయ్యర్ ఇంటెలిజెన్స్ అవుతుంటే ‘మెమరీ’ లోయర్ మైండ్ అవుతోంది.
మెమరి అనేది జ్ఞాపకాల పుట్ట!
మెమొరాండం ప్రామాణిక స్మృతి పేటి!!
మెమరి ఫిజికల్ బాడీకి తరగని ఖజానా!
మెమొరాండం గికత్వానికి ప్రావాణిక పీఠం!!
‘మెమొరాండం’ అంటేనే హయ్యర్ మెంటల్ బాడీ. ఇది ఇంటలెక్చుయల్ కాదు. ఇంట్యూషనల్.. కార్యాకారణాలకు, కాలానికి అతీతంగా అందే సాధనా సంకల్పాల, గిక ప్రతిస్పందనల పేటిక. క్వాలిటేటివ్ అసెస్‌వెంట్స్ మెమొరాండం స్వంతం. హయ్యర్ ఇంటెలిజెన్స్ దీని సృజననే.
మొత్తానికి - ఇన్నొవేషన్, ఇమాజినేషన్, ఇనె్వన్షన్‌ల త్రిపుటి మెమొరాండం గిక పరిణావానికి, దివ్యత్వ లోగిలికి తొలి ప్రవేశిక ఇది. సామాన్యులు సాధనా గాఢతతో అసమాన ప్రతిభామూర్తులుగా, రుషి పుంగవులుగా, మహాత్మలుగా, మాస్టర్స్‌గా, సద్గురువులుగా పరిణమించేది, ప్రస్తుతింపబడేది ఈ మెమొరాండం చైతన్య ప్రభంజనం వల్లనే.
మెమొరాండం అంటేనే అంతరంగ ప్రవేశానికి బాహిర వాకిలి. అందుకే హజదళూ ౄజశజూ జఒ ఒఔజూజఆఖ్ఘ జశ ఘోఆఖూళ ఘశజూ జశ శ్రీశజ్పళూఒ్ఘ నిశ జఆఒ ఔళూషళఔఆజ్యశ అని అంటుంటాం. వ్యక్తిగతం నుంఢి విశ్వమయం కావటమే గికత్వం - హయ్యర్ ఇంటెలిజెన్స్ ఫలవంతంగా మానవ అవతారంలో స్థిరపడటమే మెమొరాండం.
* * *
ఆలోచన అవగాహన పరిమితమవుంటే విచక్షణ అవలోకనలో విస్తృతమవుతుంటుంది. మనసులో పొటమరించిన వైయక్తిక ప్రేమ బౌద్ధిక విస్తృతిలో విశ్వవ్యాప్తవౌతుంది. అంటే విశ్వప్రేమగా నిలదొక్కుకుంటుంది. ఇలా చూసినపుడు మానస శరీరానికంటే బౌద్ధిక శరీరానికి పైస్థానం, పై మెట్టు. కాబట్టే బౌద్ధిక శరీరం యోగ సాధనకు తొలి ఆవాసమైంది.
వివేకం, విచక్షణ హయ్యర్ మైండ్ తొలి ఆవిష్కరణలు. అవి జ్ఞాన ప్రకాశనంతో హయ్యర్ ఇంటెలిజెన్స్ అనిపించుకుంటాయి. అయితే, హయ్యర్ మైండ్‌కి, హయ్యర్ ఇంటెలిజెన్స్‌కి తావలమైన బౌద్ధిక శరీరంలో ఎమోషన్స్ ఉండవు. భావాతీత అశరీరం దానిది. ఈ నిర్వాణ లోనిది భౌతిక దేహంలోని ఆత్మ గికాత్మ అవుతంది. దీనే్న ‘స్పిరిట్యుయల్ సెల్ఫ్’ అని అంటుంటాం.
* * *
ఆత్మకు మూడు ప్రస్థానాలు-
తొలి ప్రస్థానంలో ‘సెల్ఫ్’గా
మలి ప్రస్థానంలో ‘సోల్’గా
తుది ప్రస్థానంలో ‘స్పిరిట్’గా
‘సెల్ఫ్’గా
ఫిజికల్ సెల్ఫ్‌ది ఫిజికల్ ప్లేన్
మెంటల్ సెల్ఫ్‌ది మెంటల్ ప్లేన్
బుద్ధిక్ సెల్ఫ్‌ది బుద్ధిక్ ప్లేన్
‘సోల్’గా
ఈథరిక్ సోల్‌ది ఈథరిక్ ప్లేన్
యాస్ట్రల్ సోల్‌ది యాస్ట్రల్ ప్లేన్
‘స్పిరిట్’గా
నిర్వాణిక్ స్పిరిట్‌ది నిర్వాణిక్ ప్లేన్
పరనిర్వాణిక్ స్పిరిట్‌ది పరనిర్వాణిక్ ప్లేన్
మహాపర నిర్వాణిక్ స్పిరిట్‌ది మహాపర నిర్వాణిక్ ప్లేన్
ఇలా - తొలి ప్రస్థాన నిర్మాణం నిర్యాణమవుతుంది.
తుది ప్రస్థాన నిర్మాణం నిర్వాణమవుతుంది.
మలి ప్రస్థానం మాత్రం నిర్యాణం నుండి నిర్వాణానికి మార్గదర్శి అవుతుంది.
బుద్ధిక్ సెల్ఫ్ అంటే స్వభావసిద్ధమైంది. ఆలోచనలకు, ఎమోషన్స్‌కు దూరమవుతున్న ప్లేన్ ఇది. అంటే, జీవన ప్రయాణంలో నెలకొన్న అభిప్రాయాలు, ఎమోషన్స్‌ల ప్రభావం లొంగుతూ సహజ సిద్ధత్వానికి చేరువ కావటం, సమాధి స్థితికి ఈ సహజసిద్ధ స్వభావమే మూలం. ఇలా బౌద్ధికం కావటం నిర్వాణానికి తొలి అంకం. అంటే పదార్థ జగతితోను, మానస జగతితోను బంధం ఉన్నా జ్ఞానోదయ ప్రభావం ఉన్న ప్లేన్ ఇది. అందుకే, ఈ స్థితిని బౌద్ధిక్ నిర్వాణంగా చెప్పుకోవచ్చు. కాలాతీత జ్ఞానాన్ని మిగుల్చుకున్న స్థితి బౌద్ధిక్ నిర్వాణానిది.
ఈథరిక్, యాస్ట్రల్, మెంటల్ సంచారమంతా ఫిజికల్ క్రిందే లెక్క. అందుకే వీటన్నిటి చైతన్యం అధో చైతన్యంగానే పరిగణింపబడుతుంటుంది.
బుద్ధిక్ ప్లేన్‌లో నిర్వాణంలోకి అడుగుపెట్టటం మాత్రమే జరుగుతుంది. సెల్ఫ్ బుద్ధిక్ ప్లేన్ నుండి విడివడి తనదైన భూమికను చేరటంతో సెల్ఫ్ ‘సోల్’గా తన సహజ పరిణామంలో అడుగుపెడ్తుంది. నిజానికి, సెల్ఫ్ కూడా ఆత్మనే. ఫిజికల్, ఈథరిక్, యాస్ట్రల్, మెంటల్‌ల తాకిడితో సెల్ఫ్‌పై భౌతిక శరీర ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే, బుద్ధిక్ ప్లేన్‌లో సంపూర్ణంగా దేహాతీతం అవుతూ, కాలాతీతం అవుతూ ఆత్మ శరీరంగా తనదైన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది.
ఆత్మ ప్రస్థానం నిర్వాణ, పర నిర్వాణ, మహాపర నిర్వాణ భూమికలలో జరుగుతుంటుంది. అంటే, ఆత్మ నిర్వాణాత్మగాను, పరనిర్వాణాత్మగాను, మహాపర నిర్వాణాత్మగాను ప్రామాణికమవుతూ ‘స్పిరిట్యుయల్ ట్రినిటి’ అనిపించుకుంటుంది. బుద్ధుడు నిర్వాణంలోను, జీసస్ పరనిర్వాణంలోను, మైత్రేయ మహాపర నిర్వాణంలోను తమ ఆత్మప్రస్థానాన్ని నిలుపుకుని స్పిరిట్యుయల్ మాస్టర్స్ అయ్యారు. ఇలా మహాత్మల ప్రస్థానంతో హఖ్ఘౄశ ఉ్ప్యఖఆజ్యశ తీజ ద్ఘ్పళ ళ్ఘష్దళజూ జఆఒ ఔళ్ఘరీ, తీజ ద్ఘ్పళ యశళ ఛిఖ షజూషళ అన్నట్టు, స్పిరిట్యుయల్ మాస్టర్స్ అంటే ఆధ్యాత్మిక మహాత్మలు అని కాదు.. స్పిరిట్‌గా పరిణమించిన మాస్టర్స్ అని. స్పిరిట్యుయల్ మాస్టర్స్ అందరూ కాంతి శరీరులు కాలాతీతులు.