కొన్ని సందర్భాలు (సండేగీత )
Published Saturday, 10 November 2018జీవితంలో ఎన్నో సందర్భాలు ఉంటాయి.
విజయాలూ వైఫల్యాలూ ఎన్నో ఉంటాయి.
విజయాలు వరించినప్పుడు ఏదీ గుర్తుకు రాదు.
కానీ వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎన్నో గుర్తుకు వస్తాయి.
కొన్ని సందర్భాల్లో-
మనం చాలా నిరుపయోగంగా అన్పించవచ్చు.
ఎందుకూ పనికిరాని వ్యక్తులుగా అన్పించవచ్చు.
ఒంటరిగా...
అన్నీ కోల్పోయినట్టుగా అన్పించవచ్చు.
భగవంతుడు నిర్దయగా మన పట్ల వుండవచ్చు.
ఈ ప్రపంచంలో మన పాత్ర ఏమీ లేదని అన్పించవచ్చు.
ఇవన్నీ తాత్కాలికమే...
అన్నింటినీ ఎదుర్కోవాలి.
ఆటుపోట్లు సహజం.
మన జీవితంలో ఎప్పుడూ ఇదే పరిస్థితి వుండదు.
సందర్భం ఏదైనా
గుండె నిండా ధైర్యం వుండాలి.
ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది.
జీవితం ఓ మంత్రసాని లాంటిది.
అన్నింటినీ స్వీకరించక తప్పదు.
వర్షం రావాలని ప్రార్థిస్తాం.
వర్షంతో బాటూ బురద కూడా వస్తుంది.
అన్ని సందర్భాలు
కొన్ని సందర్భాలుగా వుండవు.
అవి మారతాయి.
అదే సృష్టి రహస్యం.