S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దోసకాయ

ఒక్కొక్క ఆటకు నిర్ణీతమయిన ఆటస్థలం, ఆటగాళ్లు ఉండాలి. కాని ఈ ఆటను ఆడాలంటే ఆటస్థలం, ఆటగాళ్లు, ఎలాంటి వస్తువులు అవసరం లేదు. ఇసుకలో, మట్టిలో, ఇంట్లో కూడా ఆడుకోవచ్చు. ఇందులో ఉరకడం, గెంతడం లాంటివి ఉండవు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే మనం ఆడుకునే ఆటల్లో కూరగాయల పేర్లు కూడా ఉన్నాయి. నిజమే! ఆ ఆట పేరే ‘దోసకాయ’. ఈ ఆటకు దోసకాయ అని పేరెలా వచ్చిందంటే ఇసుకను కానీ, మట్టిని కానీ సన్నగా, పొడుగ్గా డిజైన్ చేస్తారు. అందువల్ల దోసకాయ లాగా పొడుగ్గా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.
ఆడే విధానం
ఈ ఆటను ఇద్దరు పిల్లలు మాత్రమే ఆడాలి. వాగులో కానీ, మట్టిలో గానీ మొదట ఒకరు రెండు చేతుల్తో ఇసుకను సన్నగా, పొడుగ్గా రెండు అడుగుల వరకు కుప్పలాగా చేసి, అందులో ఒక చిన్నని కట్టెపుల్లను ఎదుటి పిల్లాడు చూడకుండా పెట్టాలి. లేదా కట్టెపుల్లను పెట్టే ముందు పిల్లాడ్ని కళ్లు మూసుకొమ్మని చెప్పాలి. ఆ తరువాత రెండు అరచేతులతో ఆ పుల్ల ఎక్కడుందో అక్కడ వేయమని చెప్పాలి. అలా వేసిన తరువాత ఆ ఇసుకను మాత్రమే దోసిలితో తీసుకెళ్లి ఏదో ఒక దగ్గర కుప్పగా పోయించాలి. ఇసుకను చేతుల్లోకి తీసుకున్న తర్వాత కళ్లు మూయాలి. అలా పోసిన కుప్పను ఎవరయితే తీసుకెళ్లి కుప్పగా పోశారో వారు వెళ్లి ఆ కుప్పను వెదకాల్సి ఉంటుంది. ఆ పోసిన ఇసుక కుప్ప దొరికిన తర్వాత అందులో కర్రపుల్ల ఉందో లేదో వెతకాలి. ఆ కుప్పలో దొరికితే ఫరవాలేదు. దొరక్కపోతే అక్కడ నుండి వెళ్లి ముందు పొడుగ్గా పోసిన కుప్పలో వెతకాలి. ఆ కుప్పలో దొరికినట్లయితే ఎవరయితే మిగతా కుప్పను కళ్లు మూసుకొని వెళ్లి ప్రక్కన పోశారో వాళ్లు ఓడిపోయినట్లు. ఎవరయితే ఇసుకను కళ్లు మూసి పోయించారో వారు గెలిచినట్లు. పోసిన కుప్పలో దొరికినట్లయితే పోసిన వారే గెలుస్తారు.

-శ్రీనివాస్ పర్వతాల 94906 25431