S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమాచారం (స్ఫూర్తి)

స్కూల్ నించి ఇంటికి వచ్చిన ఏక్తారా తన ఇమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి చూసుకుని చెప్పింది.
‘్ఛ! నా ఫ్రెండ్ భట్నాగర్‌కి మర్యాద తెలియదు’
‘ఏమైంది?’ తల్లి అడిగింది.
‘వాడి పెన్ రీఫిల్ అయిపోతే నా పెన్నుని ఇచ్చాను. లేదా స్లిప్ టెస్ట్ రాయలేక పోయేవాడు. థాంక్స్ లెటర్ పంపుతాడని చూస్తే నా ఇమెయిల్‌లో లేదు’
‘నిజమే. మన దేశంలో థాంక్స్ చెప్పే సదాచారాన్ని ఎవరూ చక్కగా పాటించరు. కృతజ్ఞతా భావం మనసులో ఉంటే సరిపోదు. ప్రేమలా బయటికి వ్యక్తం చేయకపోతే అది నిరుపయోగం అవుతుంది. రోజూ భోజనానికి మునుపు క్రిస్టియన్స్ ఆ రోజు భోజనం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి కానీ తినరు. దైవ ప్రార్థన చేసి అన్నం తినాలనే నియమాన్ని మనలో కూడా చాలామంది పాటించరు’ తల్లి చెప్పింది.
ఆ సంభాషణ విన్న ఏక్తార తండ్రి వెంటనే చెప్పాడు.
‘కృతజ్ఞత లాంటి పెద్ద పదాలు వద్దు. పెన్ను అందిందని తెలియజేయాల్సిన బాధ్యత నీ ఫ్రెండ్ మీద ఉంది. ఎవరైనా, ఏదైనా ఇస్తే అందిందని, మనం ఇమెయిల్ ద్వారా ఎవరికైనా ఆసక్తిగల ఇన్ఫర్మేషన్ పంపితే రిప్లై కొట్టి ఎక్నాలెడ్జ్ చేయడం.. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కానీ భారతీయుల్లో ఎక్నాలెడ్జ్‌మెంట్ సంస్కారం చాలా తక్కువ’
‘నిజమే. మన ప్రభుత్వ విధానాలు కూడా అలాగే ఉన్నాయి. మనం ఇల్లు మారాక అడ్రస్ ఛేంజ్, కొత్త అడ్రస్ ప్రూఫ్‌ని స్థానిక ఎన్నికల కార్యాలయంలో ఇస్తే ఎక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వమన్నారు. రేపు మన ఓటుహక్కుని తొలగిస్తే తప్పు మనమీద లేదని రుజువు చేసుకోవడానికి ఎడ్నాలెడ్జ్‌మెంట్ లేదు. కార్యాలయ సిబ్బంది తప్పు చేసినా, మనం నమోదు చేయలేదని కొట్టిపారేస్తారు’ తల్లి కూడా చెప్పింది.
* * *
ఏక్తారా బాబాయ్, పిన్ని ఓ పెళ్లికి హాజరవడానికి వాళ్లింటికి వచ్చారు. వేదికకి వెళ్లడానికి ఏకార్తా తల్లే ఓలా టేక్సీని బుక్ చేసింది. మూడు రోజులు ఉన్నాక ఏక్తారా తండ్రి వాళ్లని తన కారులో రైల్వేస్టేషన్‌లో దింపి వచ్చాడు.
వాళ్లు క్షేమంగా చేరినట్లుగా మర్నాడు ఫోన్ రాలేదు.
‘చూశారా? ఫోన్ చేయమని చెప్పినా వాళ్లు ఇంటికి చేరాక ఫోన్ చేయలేదు’ ఏక్తారా తల్లి ఫిర్యాదుగా చెప్పింది.
రెండు రోజుల తర్వాత ఏక్తారా బాబాయ్‌కి ఫోన్ చేస్తే చెప్పాడు.
‘రైలు వరంగల్ చేరుకున్నాక నాకు ఓ కన్ను బాగా ఎర్రబడింది. ఓ మెడికో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లమంటే దిగి వెళ్లాం. కంటిని పరీక్ష చేశాక తక్షణం ఆపరేషన్ చేయకపోతే కన్ను పోయేదని చెప్పి ఆపరేషన్ చేశారు. ఇందాకే ఇంటికి చేరుకున్నాం’
‘నీకు మా ఇంట్లోంచి బయలుదేరి మీ ఇంటికి వెళ్లినప్పుడల్లా క్షేమంగా చేరినట్లు ఫోన్ చేసే అలవాటు లేదు. ఉండి ఉంటే దారిలో ఏదైనా అయిందనుకుని ఫోన్ చేసి వరంగల్ వచ్చేవాడిని. కనీసం ఇలాంటి ఆపదలో చిక్కుకున్నప్పుడు కూడా నువ్వు సమాచారం ఇవ్వలేదు. ఇది మంచి పద్ధతి కాదు’ ఏక్తారా తండ్రి తమ్ముణ్ని మందలించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి