S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీరెంత సంపన్నులు?

వాడికేంటి లక్షాదికారి . ఈ మాట చాలా సార్లు వినే ఉంటాం. లక్షాధి కారి పేరుతో సినిమా కూడా వచ్చింది. 1963లో వచ్చిన సినిమా ఇది. ఆ కాలంలో లక్ష రూపాయలుంటే సంపన్నుడన్నమాట! అంతకన్నా ముందు 54లో వద్దంటే డబ్బులో హీరో నిర్ణీత కాలంలో కొన్ని వేల రూపాయల డబ్బు ఖర్చు చేయాలని హీరోయిన్ తండ్రి పరీక్ష పెడతాడు. అతడా డబ్బు ఖర్చు చేయలేకపోతాడు. ఓ యాభై ఏళ్ల తరువాత ఇదే కథను కొంత మార్చి రజనీకాంత్‌కు నిర్ణీత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని పరీక్ష పెడతారు. అంటే 50 ఏళ్ల క్రితం వేల రూపాయల విలువ కాస్తా, ఇప్పుడు కోట్ల రూపాయల్లోకి మారిందన్న మాట!
సంపన్నుడు అనే దానికి నిర్వచనం నిర్థిష్టంగా ఉండదు. ఎవరికి తోచినట్టు వారు నిర్వచించ వచ్చు. సాధారణంగా సొంత భవనం, ఖరీదైన కారు. విలాసవంతమైన జీవితం ఉంటే సంపన్నుడు అనే నిర్ణయానికి వచ్చేస్తారు. నిజంగా అతను సంపన్నుడా? ఈ రోజుల్లో కారు, ఇళ్లు అన్నీ బ్యాంకు లోన్లతో లభించేస్తున్నాయి. నెల నెలా కిస్తు చెల్లించే స్థోమత ఉంటే చాలు వీటిని సమకూర్చుకోవచ్చు.
కవర్ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయవద్దు అని ఇంగ్లీష్‌లో ఓ మాట ఉంది. దీన్ని మనిషికి అన్వయించుకుంటే కారు, ఇళ్లు చూసి సంపన్నుడని, అవిలేకపోతే పేదవాడు అనే అంచనాకు వస్తే పప్పులో కాలేసినట్టే.
ఒక వ్యక్తికి పాతిక లక్షల కారు, మూడు కోట్ల రూపాయల విలువైన భవనం ఉందని అనుకుందాం. దీనికి తగ్గట్టుగా అతనికి నాలుగు కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆస్తికన్నా అప్పు ఎక్కువగా ఉన్న అతను పేదవాడే అవుతాడు కానీ సంపన్నుడు కాదు. కారు, భవనాలు, విలాసవంతమైన జీవితాన్ని చూసి అంచనా వేయడం సరైన విధానం కాదు.
ఆర్థిక నిపుణులు సంపన్నులు ఎవరు అనే దానికి ఓ సరికొత్త నిర్వచనం చెప్పారు. ఈ నిర్వచనం ప్రకారం మనం సంపన్నులు అనుకునే వారు నిజంగా సంపన్నులు కాకపోవచ్చు. అదే విధంగా సామాన్యులు అని మనం అనుకునే వారు ఈ కొత్త నిర్వచనం ప్రకారం సంపన్నులు కావచ్చు.
ఒక వ్యక్తి నెల జీతం లక్ష రూపాయలు కావచ్చు. నెలకు కనీసం ఐదువేల రూపాయల పొదుపు కూడా లేకుండా మొత్తం లక్ష రూపాయలు ఖర్చు చేయడం, కొందరికి అదీ సరిపోక అప్పులు చేయడాన్ని చూస్తుంటాం. అదే సమయంలో నెలకు 50వేల జీతం ఐనా 30 వేల రూపాయల ఖర్చు పోగా, 20వేల రూపాయల వరకు పొదుపు చేయడం అంటే అతను లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికన్నా సంపన్నుడని అర్థం. నెలకు 20 వేలు పొదుపు చేసి ఆ పొదుపును సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే కొంత కాలానికి ఆ డబ్బు అతని జీతాన్ని మించి ఆదాయం సమకూరుస్తుంది. మీ నెల జీతం ఎంత అని కాదు. జీతంలో ఎంత పొదుపు చేస్తున్నారు అనేదే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం మీరు జీవిస్తున్న లైఫ్ స్టైల్ మీకు తెలుసు. ఈ స్థాయి జీవనానికి నెల ఖర్చు ఎంతో మీకు తెలుసు. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ఇప్పటికప్పుడు వదిలేస్తే మీ జీవితం ఇప్పటి స్థాయిలోనే యధావిధిగా ఎంత కాలం ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు ఉద్యోగం వదిలిపెడితే ఇదే స్థాయిలో మరో మూడు నెలలు ఉండగలరా? మూడేళ్లు ఉండగలరా? ఏంత కాలం ఉండగలరు అనే దానిపైనే మీరు సంపన్నులా కాదా? అనేది తేల్చడమే ఈ కొత్త నిర్వచనం.
ఇప్పుడున్న ఉద్యోగాన్ని ఇప్పటికిప్పుడు వదులుకుంటే ఇప్పటి స్థాయిలో కనీసం నెల రోజులు కూడా జీవించలేరు అంటే మీరు నిరుపేద అన్నట్టు. ఓ మూడు నెలల పాటు ఇదే స్థాయిలో నివసిస్తే పేదవారే. ఆరునెలల పాటు అదే స్థాయిలో జీవించ గలిగితే పరవాలేదు. మీరు మీ పొదుపు, అదనపు ఆదాయాన్ని ఇలానే పెంచుకుంటూ పొతే ఒకనాటికి సంపన్నులు కావడానికి అవకాశం ఉంది. ఏడాది పాటు ఇదే స్థాయిలో జీవించ గలిగితే మీ ఆర్థిక పరిస్థితి పరవాలేదు. ఇంకాస్త ఆదాయ స్థాయి పెంచుకోండి. రెండు నుంచి ఐదేళ్ల పాటు ఇదే స్థాయిలో ఉండగలిగితే మీరు సంపన్నులు. ఐదేళ్లు అంత కన్నా ఎక్కువ కాలం ఇదే స్థాయిలో ఉందంటే మీరు కచ్చితంగా సంపన్నులు. ఒక్క జీతం మాత్రమే కాదు మీకు పాసివ్ ఇన్‌కమ్ గురించి తెలుసు. మీలాంటి వారే సంపన్నులు అవుతారు.
ఇదీ ఆర్థిక నిపుణులు సంపన్నతపై తేల్చిన కొత్త విధానం. ఈ విధానం ప్రకారం మీ జీతం ఇప్పటికప్పుడు ఆగిపోతే మీరు ఇదే స్థాయిలో ఎన్ని నెలలు జీవించ గలరో మీకు మీరు లెక్కలు వేసుకోండి.
ఇలాంటివి ఆలోచిస్తే ఆందోళన కలగడం, భయం వేయడం సహజమే. ఏదీ శాశ్వతం కాదు. మహా మహా కంపెనీలు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. కొడక్ కెమెరాల కంపెనీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచంలో ఎవరు కెమెరా ఉపయోగించినా కెమెరాలోని రీలు వీరిదే. టెక్నాలజీ తెచ్చిన మార్పు వల్ల రీలు అవసరం లేని కెమెరాలు వచ్చాయి. ప్రతి స్మార్ట్ ఫోన్ రీలు అవసరం లేని కెమెరానే. కొడక్‌లో పని చేసే లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మీరేమి అంత కన్నా గొప్ప కంపెనీలో పని చేయడం లేదు కదా? ఏదో జరిగిపోతుందని కాదు. అదే విధంగా ఏమీ జరగదు అనే గ్యారంటీ లేదు. ఏదైనా జరగవచ్చు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్పినట్టు. అంతా బాగున్నప్పుడే పొదుపును ఆశ్రయించి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. కొత్త విధానం ప్రకారం మీరెంత సంపన్నులో లెక్కలు వేసుకుని సంపన్నులుగా మారేందుకు ప్రయత్నించండి.

-బి.మురళి