S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మడమ నొప్పి నివారణ

ప్రశ్న: మడమ నొప్పి తీవ్రంగా బాధపెడ్తోంది. అడుగు కింద పెట్టాలంటే భయంగా ఉంది. ఈ వ్యాధి వివరాలు చెప్పండి.

-కంచర్ల సామ్రాజ్యలక్ష్మి (సామర్లకోట)
**
జ: కాలు కింద పెట్టగానే నొప్పి రావటం అనేది మడమ కండరం గాయపడిందనటానికి గుర్తు. కొంచెం నడిచేసరికి కండరం ఉత్తేజం పొంది నొప్పి తగ్గినట్టనిపిస్తుంది.
నడి వయసులో, ముఖ్యంగా ఆడవాళ్లలో ఇది ఎక్కువగా కనిపించే వ్యాధి. కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చుని లేదా పడుకొని లేచిన తరువాత అడుగు నేల మీద పెట్టగానే తేలు కుట్టినంత నొప్పి పుట్టి అడుగు ముందుకు సాగక అవస్థ పడతారు. కొద్ది నిమిషాలు నడవగానే నొప్పి దానికదే తగ్గి బాగానే నడవగలుగుతారు. విశ్రాంతి తరువాత కలిగే ఈ నొప్పి మడమ భాగంలోనే ఎక్కువగా వస్తుంది.
శరీరంలో ప్రతి అవయవానకీ ఒక శాస్త్రం ఉంది. అలాగే పాదానికి సంబంధించిన శాస్త్రాన్ని పోడియాట్రిక్స్ అంటారు. పాదం అడుగున ఏర్పడే నొప్పి, ఎరుపు, మంట, వాపు ఇవన్నీ పోడియాట్రిక్స్ శాస్త్రానికి సంబంధించిన అంశాలు.
శరీరంలోని 26 పెద్ద ఎముకల్లో మడమ ఎముక ఒకటి! మొత్తం 33 ఎముకల పెద్ద జాయింట్ ఇది. కనీసం వంద కండరాలు ఈ ఎముకల్ని సంధానం చేసి పాదం కదిలేలా చేస్తున్నాయి. మనం నడుస్తున్నాం. నాట్యం చేస్తున్నాం. ఆడగలుగుతున్నాం. ఎగిరి దూక గలుగుతున్నాం. పాదం అడుగున ఉండే కండరాలు కుషన్ లాగా ఉపయోగపడి పాదంలోని ఎముకలు గాయపడకుండా కాపాడుతున్నాయి.
మడమ ఎముక చుట్టూ ఆవరించి ఉండే ష్దజళఒ ళశజ్యూశ అనే కండరం గాయపడినప్పుడు పాదం వెనుక భాగంలోనూ, మడమ భాగంలోనూ విపరీతమైన నొప్పి కలుగుతాయి. నొప్పి వచ్చిందంటే, పాదం అడుగున ఉండే ప్లాంటార్ ఫేసియా అనే కండర భాగం దెబ్బతింటోందనీ, తక్షణం జాగ్రత్త పడాలని శరీరం హెచ్చరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. దీన్ని రి వయోభారం, స్థూలకాయం లాంటి కారణాలు ఈ పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. ప్లాంటార్ కండరానికి కొద్దిపాటి విశ్రాంతినిచ్చి వత్తిడిని తగ్గిస్తే నొప్పి తగ్గుతుంది.
ఒక్కోసారి మడమ భాగంలో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఎముకలాంటిది పెరిగి అది మడమ ఎముకకూ దాని అడుగున ఉండే కండరానికీ మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. దాంతో అటు మడమ ఎముక, ఇటు మడమ కండరం రెండూ గాయపడతాయి. దీన్ని ‘హీల్‌స్పర్’ అంటారు.
బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేల మీదకు బలంగా తొక్కి పెట్టి ఉంచుతాం. అంతే బలంతో వ్యతిరేక దిశలో శరీరం కండరాలను లోపలికి లాగుతుంది. ఒక గుడ్డముక్కను అటూ ఇటూ లాగితే ఎలా చిరిగిపోతుందో, అలాగే, బైటకూ, లోపలికీ ఒకేసారి పాదం లోపల వత్తిడి కలుగుతుంది. దాంతో పాద కండరాలు గాయపడతాయి.
పాదంలో ఎముకల లోపల చిట్లడం వలన కూడా నొప్పి కలుగవచ్చు. ఇవి కాక, పాదంలోపలున్న ఎముకలలో కూడా ఆర్థరైటిస్, కీళ్లవాతం లాంటి ఎమముకలకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు. ఎక్స్‌రే తీస్తే అనుమానాలు తీరతాయి. ఒక్కోసారి అరికాళ్లు విపరీతంగా కారం పోసినట్టు మంటలు, తిమ్మిరి, స్పర్శ తెలియక పోవటం లాంటివి కూడా పాదకండరాలు గాయపడినందువలన కలుగవచ్చు.
మనం కొత్తగా బరువు పెరగకపోయినా, వయసు పెరుగుతున్న కొద్దీ బరువు ఆపగలిగే శక్తి కండరాలకూ, ఎముకలకూ తగ్గినప్పుడు ఇలాంటి బాధలు తప్పక వస్తాయి. అందుకని బరువు తగ్గే ఉపాయాలు కూడా పాటించటం అవసరం అవుతాయి. మెత్తటి కుషన్ చెప్పులనే వాడండి. కటిక నేల మీద పాదాన్ని చెప్పులు లేకుండా మోపకండి. ఇంటా బైటా తిరిగేందుకూ వేర్వేరు చెప్పుల జతలు ఉంచుకోండి. చెక్కలాగా ఉండే చెప్పుల వలనే మ్యుంగా ప్లాంటార్ కండరం గాయపడుతోందని గమనించండి! వాడుతున్న అలాంటి చెప్పులను మార్చటం తక్షణ కర్తవ్యం.
గరుకు నేల మీద నడిస్తే మడమ కండరం పైన వత్తిడి పడుతుంది. ఎక్కువ దూరం నడిచే పనులు పెట్టుకోకండి. మడమనొప్పి ఉన్నప్పుడు వ్యాయామం కోసం నడక కన్నా సైకిల్ తొక్కటం, ఈదటం లాంటి ఇతర మార్గాలు పాటించండి.
రోజూ పది నిమిషాల సేపు మంచుముక్కతో పాదానికి కాపడం పెట్టండి. లేదా ఉంచకలిగినంత సేపు ఐసుగడ్డ మీద పాదం పెట్టి ఉంచండి. ఉప్పు కాపు పెట్టినా ఉపశమనం కలుగుతుంది. ఒకసారి అదీ ఒకసారి ఇదీ మార్చిమార్చి పెట్టుకోవచ్చు కూడా! కాలు వేసుకొని కూర్చుని, టెన్నిస్ బంతి లేదా పిల్లలు ఆడుకునే రబ్బర్ బంతిని పాదం అడుగున ఉంచి దాని మీద గట్టిగా వత్తుతూ బంతిని గుండ్రంగా తిప్పండి. నొప్పి ఉపశమిస్తుంది.
ఒక తుండుగుడ్డని నిలువుగా జానెడు వెడల్పున మడిచి, దాని రెండు కొనలూ రెండు చేతులతో లాగి పట్టుకొని, బంతిని పాదానికి అదుముతూ, చల్లకవ్వాన్ని తిప్పినట్టు తిప్పుతుంటే నొప్పి బాగా ఉపశమిస్తుంది. ఒక చేత్తో కొనని మీ వైపు లాగుతుంటే, రెండో చేయి పాదం వైపు వెళ్లాలి. టవల్ స్ట్రెచ్ విధానం అంటారు దీన్ని. ఇవన్నీ ఉపశమన మార్గాలు. వాతపు నొప్పులను పెంచే ఆహార విహారాలన్నీ మడమ నొప్పిని కూడా పెంచుతాయి. వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. పులుపు, దుంపకూరలు, కష్టంగా అరిగే పదార్థాలన్నీ వాత నొప్పుల్ని పెంచుతాయి.
జాగ్రత్తగా ఉంటూ, పాదానికి తగిన విశ్రాంతి, తగినంత వ్యాయామం ఇవ్వటమే దీనికి చికిత్స. మెత్తటి చెప్పుల సంగతి మరచిపోకండి. గాయం దానికదే తగ్గకపోతే శస్తచ్రికిత్స అవసర పడవచ్చు కూడా. మడమ నొప్పి వచ్చిన రోజే జాగ్రత్త పడితే, అది ఆపరేషన్ దాకా దారి తీయకుండా ఉంటుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com