నేను.. నవచక్ర చాలనం
Published Saturday, 25 August 2018నేను
భూగోళ తత్త్వం + ఖగోళ తత్త్వం
దేహ తత్త్వం + దేహాతీత తత్త్వం
దృశ్య తత్త్వం + అదృశ్య తత్త్వం
దేహపరంగా షట్చక్రాలు.. దేహాతీతంగా త్రిచక్రాలు. మొత్తానికి,
నవచక్ర శోభితంగా
‘నేను’ శాశ్వత, అశాశ్వతం మేలు సంగమం.
అశాశ్వత నుండి శాశ్వతకు ప్రస్థానం.
తొలి చక్రం నుండి దేహపరంగా ఏడవ చక్రం నుండి దేహాతీతంగా ‘నేను’ ప్రస్థానం.
భౌతిక అవసరాల నుండి అధిభౌతిక అస్తిత్వం వరకు ఈ ప్రస్థానం సాగుతుంటుంది - దృశ్యంగాను, అదృశ్యంగాను.
రెండు కాళ్ల పైభాగ కేంద్రం తొలి చక్ర స్థానం - కుండలినీ తత్త్వ కేంద్రం - దీనికి జీవన లాలస మెండు. ఈ పాంచభౌతిక లాలసకు కామా పడేది పంచమ, షష్టమ చక్రశక్తి చాలనంతో. సప్తమ చక్రం నుండి అధిభౌతిక ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ ప్రస్థానంలో తలభాగానిది ప్రథమ స్థానం. భౌతికంగా తొలి చక్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అధిభౌతికంగా ఈ ఏడవ చక్రానికీ అంతకు మించిన ప్రాధాన్యత ఉంది.
సప్తమ, అష్టమ, నవమ చక్రాలు ఆకాశికాలు. అంటే, ఆకాశ ఖగోళ తత్త్వం, ప్రభావం, శక్తి కలవి ఇవి.. ప్రథమ నుండి షష్టమ వరకు ఉన్న చక్రాలు భూచక్రాలు. వీటిపై పంచ భూతాత్మక తత్వం, ప్రభావం, శక్తి అధికం.
* * *
నేను -
దైహికంగా షట్చక్ర శక్తిచాలనంతో జ్ఞాన, విజ్ఞానకోశమే! ఆత్మపరంగా సప్తమ, అష్టమ, నవమ చక్ర చాలనంతో ప్రజ్ఞాన భాసురమే! ఆత్మ భౌతిక పరిధులను దాటటం, పంచభూత ప్రభావాల నుండి విడివడటం - ఇలా అయిదు చక్రాల బంధం నుండి బయటపడ్డ తర్వాతనే సాధ్యమవుతుంది. ఆకాశిక ప్రస్థానం. ఇక సోల్ స్పిరిట్‌గా పరిణమించటం సప్తమ చక్ర చాలనంతోనే ప్రారంభమవుతుంది. అందుకే ఏడు, ఎనిమిది, తొమ్మిది చక్రాలు ఒక్క ‘గిక పట్ట’తో మాత్రమే అనుభూతమవుతాయి.
ఈ నవచక్ర బంధనంతో - ఒక విధంగా అజ్ఞాచక్ర చాలనంతో ఆత్మ తత్వానికి గురుతత్వం జత కలిసి మానవ అవతరణగా ‘నేను’ భూచక్ర శక్తి చాలనంగా, ఆకాశ తత్త్వ చాలనంగా పరిణమిస్తుంది. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్ర చాలనమంతా మానవతత్త్వ విలసితంగా ఉంటుంది. ఆజ్ఞ, సహస్రార చక్ర శక్తి చాలనమంతా గిక తత్త్వ ప్రభాసరంగా సాగుతుంటుంది. ఇక, ఆజ్ఞ సహస్రారాల మధ్యన ఉండేది సోమచక్రం. దీన్ని ఒక చక్రంగా కొన్ని యోగ మార్గాలు ఉటంకించక పోతున్నప్పటికీ ఈ చక్ర తత్వం అమృతత్త్వమే! ఇది గిక పరిణావానికి ఎంతో అవసరం.
మొదటి అయిదు చక్రాల శక్తిచాలనం పాంచభౌతిక ఇంద్రియపరంగా సాగుతుంటే, ఆపై రెండు చక్రాల శక్తిచాలనం ఇంద్రియాతీతంగా అనుభూతమవుతుంటే, ఎనిమిది తొమ్మిది చక్రాల శక్తిచాలనం దేహాతీతంగా, అతీంద్రియంగా, విశ్వప్రజ్ఞతో అలరారుతుంటుంది. అందుకే తొలి అయిదు చక్రాల మానవాత్మ పరిణామాన్ని ‘పర్సనల్’ అనీ, ఆపై నాలుగు చక్రాల మానవాతీత ఆత్మ పరిణామాన్ని ‘ట్రాన్స్‌పర్సనల్’ అనీ అంటుంటాం.
యోగసాధనా పరంగా పర్సనల్ అంటే ‘మీడియమ్’ అని. అయినప్పుడు ట్రాన్స్‌పర్సనల్ అంటే ట్రాన్స్ మీడియమ్ అనే. ఈ గిక ప్రక్రియ అంతా ట్రాన్స్‌ఫార్మేషన్. ఈ ట్రాన్స్-్ఫర్మేషన్ సాధ్యమయ్యేది మీడియం ఎనర్జీ సెంటర్స్ అయిన ఏడు చక్రాలు ట్రాన్స్‌ఫార్మేషన్ అయినప్పుడే. ట్రాన్స్ మీడియమ్, ట్రాన్స్ ఫార్మేషన్ అంటే పునర్నిర్మిత నేను, పునరుజ్జీవన నేను అనే అర్థం.
ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది చక్రచాలనమంతా ఆకాశతత్వ విలసితం. ఇంద్రియ తత్వం, దేహతత్వం, భౌగోళిక తత్వం ఆరవ చక్రమైన ఆజ్ఞకు ఏడవ చక్రమైన సస్రారకు, ఎనిమిదవ చక్రమైన ఖగోళకు, తొమ్మిదవ చక్రమైన విశ్వకు అవసరం లేదు. అయితే, ఈ నాల్గింటి పరిణామం ఆస్ట్రల్, ఈథరల్‌ల సంయోగమైన ఆకాశతత్వ సంబంధమైంది.
* * *
నేను
భూతత్వపరంగా పంచనూతాల అధీనంలో ఉంటూ మొదటి అయిదు చక్రాల శక్తిచాలనంతో ‘అహం’కరిస్తుండటం ఎంత సహజమో, గిక సాధనతో ‘అహం’ నశించిందనకుంటూనే ఆజ్ఞాచాలనంతో గిక ప్రతిభ అనకుంటూనే ఆధ్యాత్మిక వికాసనం అనుకుంటూ ఆధ్యాత్మిక మత్తువంటి మాయకలో పడిపోవటం అంతే సహజం. ఈ మత్తు అనేక విధాల యోగ సాధకులను, గురువులను కమ్మేస్తుంటుంది. ఆ మత్తులో జారిపోవటమూ జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ అనుభవమూ సత్య సమ్మతమే అనిపిస్తుంటుంది. ప్రతి మాటా, ప్రతి చేటా, ప్రతి చూపూ ‘సత్య ప్రజ్ఞ’ అనిపిస్తుంటుంది.
నిజానికి, వొదిగి ఉండే తత్వంలో సత్యం ప్రజ్ఞాన్వితం అవుతుందే తప్ప ప్రాపంచిక ఆర్భాటాలతో విలక్షణం అనుకుంటే అది గికత్వానికి దర్లక్షణమే అవుతుంది. అందుకే అంటుంటారు డఔజూజఆఖ్ఘ ఘౄఆళూజ్ఘజఒౄ జఒ ఘశ ళశజూళౄజష జూకఒచిఖశషఆజ్యశ యచి ఆ్దళ దజూజూ ఉకళ అని.
ఆజ్ఞాచక్రం పైన ఉన్న ‘త్రినేత్రం’ అదృశ్య నేత్రమే అయినప్పటికీ ఇది భూత, భవిష్య, వర్తమాన ఆత్మ పరిణామాన్ని అవలోకించగలదు. ఈ మూడవ కన్ను దైహికమైన రెండు నేత్రాలు చూడలేని విశ్వసంపదను చూడగలుగుతుంది. త్రినేత్రంతో అంటే గత జ్ఞానమైనా, భవిష్య జ్ఞానమైనా వర్తమాన జీవితాన్ని ఎగసిపడేలా చేయకూడదు కదా?! ఎదిగిన కొద్దీ వొదుగు అంటేనే ‘నేను’ అహంకరించకుండా పరిణమించగలిగేది.
* * *
‘నేను’కు ముక్తిమార్గం సప్తమ చక్రమైన సస్రారం. ఇది గిక బాట. ‘్భతిక నేన’కు మూలాధారం ఎలా భూమిక అవుతుంటుందో ‘గిక నేన’కు సహస్రారం అలా భూమిక అవుతుంటుంది. ‘ఆజ్ఞా’చాలనంతో భౌతికం నుండి విడివడ్డ ‘నేను’ ‘సహస్రార’ ప్రజ్ఞతో, భూత భవిష్యత్తులను అవలోకించగలటమే కాక ‘కాలాతీతం’ కాగలుగుతుంది. గిక సాధనతో ‘నేన’ ఆజ్ఞాశక్తి చాలనంతో దేహాతీతం కావటమూ, సహస్రా శక్తి చాలనంతో కాలాగీతం కావటమూ సాధ్యమవుతుంటుంది.
అంటే, ‘ప్రాణ చికిత్స’లు ఆజ్ఞాచక్ర ప్రాభవంతో సాధ్యమవుతుంటే, సహస్రార ప్రాభవంతో ఇతరులను ప్రభావపరచగల తత్వం, ఆకర్షణ ‘ఆరా’గా ప్రకాశమానం అవుతుంది. ఇలా మానవ కపాల భాగం అంటే తలభాగం ఆజ్ఞ, సహస్రారాల శక్తిచాలనానికి అదృశ్యంగా దోహదపడుతుంటుంది.
ఈ దేహాతీతంగా అంటే భౌతిక కాయానికి పైన అంటే మానవ కపాలానికి కొన్ని అంగుళాల దూరంలో అదృశ్యంగా సూర్యతత్వం నెలకొని ఉంటూ సహస్ర కిరణ సంయోగ భాసురంగా ఉంటుంది.. ఇదీ గిక తేజస్స.. గికంగా చెప్పుకునే ‘ఆరా’!
సహస్రారం వరకు ‘నేన’ ప్రయాణం మోర్టల్‌గా అంటే అశాశ్వతంగానే అష్టమ చక్రం నుండి ‘నేను’ ఇమ్మోర్టల్‌గా శాశ్వత పరిణామానికి తావలమవుతుంది. అంటే, మూలాధారం నుండి సహస్రారం దాకా ‘నేను’ది మోర్టాలిటీ కాగా అష్టమ, నవమ చక్ర చాలనంతో నేనుది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అవుతుంది. ఒక విధంగా ‘్భతిక శరీరం’ అష్టమ చక్ర చాలనం నుండి ఆ చక్ర అధీనంలోకి వెళ్తుంది.
‘పునర్నిర్మిత నేను’కు ఈ ‘ఖగోళ చక్ర చాలన’మే మూలం. ఆధారం. ఈ చక్రచాలనంతో సప్తచక్ర విలసనంగా ఎదిగిన భౌతిక శరీరం అగ్నికి ఆహుతి అయినట్లే యోగాగ్నికి ఆహుతి అవుతుంది. అంటే, ‘నేను’ ‘అగ్నిపునీత’ అవుతుంది. అగ్ని నుండి పుట్టుకొచ్చిన దేహానికి ఇక ‘చావు’ కబురు ఉండదు. అంటే, నామకః మృత్యువు’ అన్నది భవిష్యత్తులో భౌతిక శరీరాన్ని కబలించినా, అగ్నిపునీత అయిన భౌతిక శరీరం గికంగా ఆత్మశరీరవే. అగ్ని పునీత అయిన నాటి నుండి భౌతికానిది అమరత్వమే! అధిభౌతికమే! మృత్యువును జయించటమే!!
అగ్నిపునీత అయిన నేను సాగించి భౌతిక ప్రయాణమంతా కర్తగా కాదు. కేవలం సాక్షిగా మాత్రమే. కర్తృత్వం మృత్యుంజయత్వ ‘నేను’కు ఉండదు. మానవాతీత, ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’లో ఈ పునర్నిర్మిత నేను మానసిక భ్రమలు, మానసిక మాయలు ఈ పునరుజ్జీవన ‘నేను’ను చలింప చేయలేవు. ఇలా ఈ పునరుజ్జీవన నేను ఒక దివ్యత్వ లోగిలి. సృష్టి వాకిలి ఖగోళ నేత్రం.
* * *
నేను- నవమ చక్ర శక్తి చాలనంతో-
దేహాతీతం! మానవాతీతం!
దృశ్యాతీతం! అదృశ్యాతీతం!
బియాండ్ బర్త్ అండ్ డెత్!
ఔట్ సైడ్ టైమ్ అండ్ స్పేస్!
అంటే.. నేను.. విశ్వగర్భ
విశ్వగర్భం అంటే విశ్వనేత్రం
విశ్వనేత్రం అంటే విశ్వదర్శనం
విశ్వదర్శనం అంటే అన్నీ తానే అయినది.
ఇలా - ‘నేను’ నేనే!
- అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.