S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం -- (19-8-2018 నుంచి 25-8-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం ఊహించని ఇబ్బందులు. అనుకోని సంఘటనలు. ఆరోగ్య లోపాలు. అసంతృప్తి. ధార్మిక వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించడంలో విఫలం. సోమవారం సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో సమస్యలు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ప్రయాణ లోపాలు. మంగళవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కొంత ఆధ్యాత్మిక ధోరణి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. బుధవారం వ్యతిరేకతల వల్ల అసంతృప్తి. లక్ష్యాలను సాధించడంలో కొన్ని అడ్డంకులు, ఉన్నత విద్యా వ్యవహారాలు, ప్రయాణాలు. గురువారం ఆలోచనలకు రూపకల్పన. మానసిక ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలు, సంతాన సమస్యలు. శుక్రవారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక విజయాలు. సామాజిక గౌరవం పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం భాగస్వామ్యాల్లో సమస్యలు. పరిచయాల వల్ల ఇబ్బందులు. కాలం ధనం శ్రమ వృథా అయ్యే సూచనలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సోమవారం సంప్రదింపుల వల్ల స్నేహానుబంధాలు పెరుగుతాయి. శుభవార్త అందుతుంది. భాగస్వామితో కలిసి ప్రయాణాలు. మంగళవారం ఊహించని సమస్యలు. అనుకోని ఒత్తిడులు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. వృత్తిలో జాగ్రత్త అవసరం. బుధవారం సంతానవర్గ వ్యవహారాల వల్ల సమస్యలుంటాయి. ఆందోళన ఉన్నా అన్నీ సర్దుకుంటాయి. శ్రమాధిక్యం. గురువారం సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్య లోపాలుంటాయి. శుక్రవారం లక్ష్యాలను సాధిస్తారు. అన్ని పనుల్లో అనుకూలత. ఉన్నత విద్య ఉద్యోగాదులు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. వ్యతిరేకతలు అధికం. విజయం సాధించేందుకు ప్రయత్నం. పరిచయాల వల్ల సమస్యలుంటాయి. శ్రమాధిక్యం. సోమవారం కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. రుణ రోగాదులపై విజయం. ఆర్థిక నిల్వలపై దృష్టి. మంగళవారం భాగస్వామ్యాల్లో లోపాలుంటాయి. పరిచయాల వల్ల కాలం ధనం వృథా అయ్యే సూచనలు. ఇబ్బందులు. బుధవారం సౌకర్యాలు మెరుగుపరచుకునే ప్రయత్నం. ఆహార విహారాదుల్లో అనుకూలత. సౌఖ్యంగా గడుపుతారు. గురువారం అధికారిక సంప్రదింపులు. ప్రయాణాదులుంటాయి. పితృవర్గ వ్యవహారాలపై దృష్టి. శ్రమాధిక్యం. శుక్రవారం అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. వ్యవహారాల్లో లోపాలు. ఊహించని సంఘటనలు. జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. ఆలోచనల్లో ఒత్తిడులు. వ్యవహారాల్లో జాగ్రత్త. వ్యతిరేక ప్రభావాలను గమనించే అవకాశం. సృజనాత్మకత లోపాలు. సోమవారం నిర్ణయాదులు లాభిస్తాయి. వ్యాపార వ్యవహారాదులపై దృష్టి. అన్ని పనుల్లో ముందుగా ఉండే ప్రయత్నం. సంతోషం. మంగళవారం భాగస్వామ్యాల వత్తిడుల వల్ల విజయ లోపాలు. పరిచయాల వల్ల సమస్యలు. పోటీ రంగంలో ఒత్తిడులు. బుధవారం సంప్రతింపుల వల్ల కొంత మేలు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వ్యతిరేక ప్రభావాలపై విజయసాధన. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో శ్రమాధిక్యం. మాటల్లో కొంత అధికారిక ధోరణి. పనుల్లో ఎదురీత ఉంటుంది. శుక్రవారం పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. కొత్త పరిచయాలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల్లో అనుకూలత ఉన్నా కొంత ఆలస్యం ఉంటుంది. గృహ వాహనాదులు కొంత శ్రమకు గురి చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ఆలోచనలు. సోమవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణాదులుంటాయి. విశ్రాంతి, సౌఖ్యం కోసం కాలం వెచ్చిస్తారు. మంగళవారం వ్యతిరేక ప్రభావాల వల్ల మానసిక ఒత్తిడులు. ఆందోళన తగ్గించుకోవాలి. కొంత నిరాశాత్మక ధోరణి. బుధవారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. సంతానవర్గ సంతృప్తి. నూతన భావనలకు రూపకల్పన. గురువారం నిర్ణయాదుల్లో ఒత్తిడులు. శారీరక శ్రమ. కొంత ఆందోళన ఉన్నా కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. శుక్రవారం పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు అధికం. అన్ని పనుల్లోనూ కొంత జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం దగ్గరి ప్రయాణాల్లో సౌకర్యలోపాలు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. సంప్రదింపుల్లో జాగ్రత్త. ఒక వార్త ఇబ్బంది కలిగించవచ్చు. శ్రమ అధికవౌతుంది. సోమవారం లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆదరణ. సోదరవర్గ ప్రయోజనాలు. కమ్యూనికేషన్స్ వల్ల సంతోషం. మంగళవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో జాగ్రత్త. విద్యా వ్యవహారాల్లో ఇబ్బందులు. బుధవారం నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. గృహ వాహనాది వ్యవహారాల్లో అనుకూలత. సంతోషంగా విహరిస్తారు. గురువారం వ్యర్థమైన ఖర్చులు. ప్రయాణాలు. టాక్స్‌లు చెల్లిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విశ్రాంతి లోపం. శుక్రవారం అభీష్టసిద్ధి. సంతాన వర్గంతో సంతృప్తి. నూతనమైన కార్యక్రమాల రూపకల్పన.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం సేవకవర్గ సహకారం లభిస్తుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం విషయంలో కొంత జాగ్రత్త. పనుల ఆలస్యం. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో అనుకూలత. వ్యాపార వ్యవహారాల వల్ల ఆర్థికాంశాలలో అనుకూలమైన ప్రభావాలు. మంగళవారం సౌకర్య లోపాలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. నైరాశ్య ధోరణి. బుధవారం విలాసాలు విందుల కోసం వెచ్చిస్తారు. విహార యాత్రలకు అవకాశం. సోదరీమణులతో సంప్రదింపులు. గురువారం లాభాలు ప్రభావితం చేస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శుక్రవారం గృహ వాహనాది విషయాలు ప్రభావితం చేస్తాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. సోమవారం లక్ష్యాలను సాధించే యత్నం. నూతన వ్యవహారాలు, కార్యక్రమాలపై దృష్టి. కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. మంగళవారం సంప్రదింపుల్లో లోపాలు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. సోదర వర్గంతో వ్యతిరేక భావనలు. మాటల్లో నైరాశ్యం. బుధవారం లాభాలు ప్రభావితం చేస్తాయి. అన్ని పనుల్లో చక్కని ప్రయోజనాలు. పెద్దల ఆశీస్సులు. ఆర్థిక నిల్వలుంటాయి. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారులతో జాగ్రత్త. గౌరవం కోసం ప్రయత్నం. శుక్రవారం కమ్యూనికేషన్స్ వర్తిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాదులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం నిర్ణయాదుల్లో ఆలస్యాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. విందులు, విహారాల కోసం ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. విశ్రాంతి లోపం. సోమవారం వ్యాపార లోపాలకు అవకాశం. ఖర్చులు పెట్టుబడులు అధికం. నష్టపరిహారాలపై దృష్టి. శ్రమతో కార్యాలు. మంగళవారం కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక నిల్వలలో ఆశించిన సంతృప్తి ఉండదు. మాటల్లో నైరాశ్య ధోరణి. నిర్ణయ లోపాలు. బుధవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారులతో కొంత జాగ్రత్త. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. గురువారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలున్నా జాగ్రత్తగా మెలగాలి. కీర్తిప్రతిష్టలపై దృష్టి. శుక్రవారం మాట తీరులో ఎన్నో మార్పులు. కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం ఖర్చులు పెట్టుబడుల వల్ల ప్రయోజనాలు విస్తరిస్తాయి. విశ్రాంతి లోపం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. ప్రయోజనాలలో సంతృప్తి తక్కువ. సోమవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు. మంగళవారం ఆత్మవిశ్వాస లోపాలు. నైరాశ్య ధోరణి. ప్రయోజనాలేవీ సంతృప్తినివ్వవు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. బుధవారం లక్ష్యాలను సాధిస్తారు. దూర ప్రయాణాలు, కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం. విహారాలు, విశ్రాంతి. గురువారం అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. అధికారిక ఒత్తిడులు. అనారోగ్యం. శుక్రవారం నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. అన్ని పనుల్లోనూ అనుకూలత. శ్రమ ఉన్నా గౌరవం, గుర్తింపు. ఆత్మవిశ్వాసం.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. లాభాలున్నా సంతృప్తి ఉండదు. ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. అధికారిక వ్యవహారాలలో ఆలస్యం. సోమవారం వ్యతిరేకతలపై విజయం. వ్యాపార వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. పోటీరంగం ప్రభావితం చేస్తుంది. మంగళవారం కాలం ధనం వ్యర్థవౌతాయి. ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. నిరాశా ధోరణి. విశ్రాంతి లోపం ఉంటుంది. బుధవారం ప్రయోజనాలు అధికం. ఊహించని సంఘటనలు. అనుకోని ఇబ్బందులుంటాయి. జాగ్రత్త. గురువారం పరిచయాలు, స్నేహానుబంధాలు ఇబ్బందికి గురి చేస్తాయి. భాగస్వామ్యాల్లో ఒత్తిడుల వల్ల ప్రయోజన లోపాలు. శుక్రవారం విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణావకాశాలు. ఖర్చులు పెట్టుబడులు, విందులు వినోదాలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు. వృత్తి ఉద్యోగాదుల్లో వ్యతిరేక ప్రభావాలుంటాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. లక్ష్యాలను సాధించడంలో సమస్యలు. సోమవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. అన్ని పనుల్లో అనుకూలత. సంతానంతో సంతృప్తి. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మంగళవారం లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. బుధవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులున్నా సంతోషంగా గడుపుతారు. నూతన పరిచయాలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. గురువారం వ్యతిరేక ప్రభావాలు అధికం. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. అధికారిక వ్యవహారాలు. శుక్రవారం అన్ని పనుల్లో ప్రయోజనాలు, పెద్దల ఆశీస్సులు, లాభాలు సంతృప్తినిస్తాయి.

--డాక్టర్ సాగి కమలాకరశర్మ