S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిక్‌నేమ్‌ల సరదాలు..

మధుసూదన్‌రావు మాస్టారు ఈయన పేరు.. డ్రిల్ కన్నా కబుర్లు ఎక్కువ చెప్పేవాడు. ‘ఏరా’లు, ‘వొరే’లు లేవు. నాకు డ్రిల్లు చెయ్యకుండా కూర్చోడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడు. నేను ఎడిటర్నిగా..! పైగా అంగ్రేజీ తోడా తోడా ఆతా హై ముజ్హే...’
మర్నాడు లెక్కల మాస్టారు రాలేదు. ఈయనే ఖాళీ క్లాసులకి.. మళ్లీ డ్రిల్ మాస్టారు రెడీ.
-మీ అందరికీ డిక్టేషన్ చెప్పనా?
-ఉత్త ఇంగ్లీషు పిచ్చోడు అన్నాడు చిన్నారావు రహస్యంగా.
ఈ గుజ్జారి చిన్నారావుని ‘ఒరేయ్ లబ్బలూ’ అని పిలిచేవాళ్లం. రబ్బరు అని రకారం పలకలేడు చిన్నా.. వాలీబాల్‌లో లిఫ్ట్ బాగా ఇస్తాడు. పెద్దాడైనాక ఈ చిన్నా - కాంగ్రెస్ నాయకుడు మరుపిళ్ల చిట్టిగారికి అల్లుడైనాడు.. ఆఫ్రికన్ బార్ (గవర్నర్‌పేట)కు ప్రొప్రైటర్ కూడా అయ్యాడు. నాకు ప్రాణమిత్రుడు.. ఇక, రాధారమణ మంచి క్లాసు ప్లేయర్. లావుగా ఉండేవాడు. మెత్తని చెమ్మగిల్లే తడి చేతులతనివి. స్పోర్ట్స్ మేగజైనులు వాళ్ల నాన్న నడిగి రైల్వే క్లబ్‌కి చెందినవి తెచ్చేవాడు. వాడి డాడీ రైల్వే ఆఫీసరు. ఈ రాధానే తర్వాత ఆంధ్రాకి రంజీ క్రికెట్ ఆడాడు. ఆనక టెన్నిస్ కూడా ఆడాడు స్టేట్ లెవల్‌లో.
-మధుసూదన్ మాస్టారు.. బాడ్మింటన్ అన్నాడు. రాయండి.. ఆ.. రాశారా? బేస్‌బాల్.. ఒకే.. ఖోఖో అంటూ ఇలా అన్నీ ఆటల పేర్లే చెబుతూ.. ఫుట్‌బాల్ రాయండి ఆ తర్వాత - రిఫరీ.. అంటూ చెప్పుకుపోయాడు.
అందరం - మా బుక్స్ ఇచ్చాం కరెక్షన్‌కి - పైకి స్లిప్స్ గట్టిగా చదివి కరెక్ట్ చేస్తూ ఒక్కటే నవ్వు.
రాధారమణ ఆటల పిడుగు అని చెప్పానుగా.. ‘్ఫడ్’ ‘బాల్’ అని రాశాడు.. ఫుడ్డు కాదు - బాబాయ్.. అదీ ఫుట్‌బాల్.. అంటూ నవ్వు.. - ఒక్కడే - బాడ్ మింటన్ అని రాశాడు. అదే కరెక్ట్ - ‘బ్యాట్ పెట్టి ఆడేది మరేటవుద్ది?’ ఆనందరావుకి మాస్టర్ మీదే అనుమానం. అందుకే జికే కావాలోయ్ అంటాడు ఈ గోకుల్.. అదీ నా కలం పేరు టెంపరరీ. ఇట్లా, సరదాగా ఇంగ్లీషు మతలబు - చెప్పే మాస్టారు ఇష్టమే.. కానీ అప్పల నరసయ్య మాస్టారు వున్నాడు.. లోయర్ క్లాసుల టీచర్.. ఇలాగే, అవసరానికి క్లాసుకి కాపలాగా వచ్చి ఒరేయ్ అబ్బాయిలూ.. అమ్మాయిలూ ఒక్కొక్కరు ఒక్కో మాటకి డిగ్రీలు చెప్పండిరా.. టాల్..? టాల్లెర్.. టాల్లెస్ట్.. అట్లా.
-ఓకే.. నెక్స్ట్.. అన్నాడు సారూ.
నెంబర్ నైన్టీన్.. టకామని లేచాడు. ‘గుడ్.. గుడ్డర్.. గుడ్డెస్ట్’ అంటూ గొప్పగా. ఇంకా వాటి మాట పూర్తి కాలేదు. చెంప ఛెళ్లుమనిపించాడు అప్పల నరసయ్యగారు. మేము అందరం కూడా చెంప తడుముకున్నాము. బ్యాడ్ అంటూ అందుకున్నాడో లేదో మురళీగాడు - వెనుక నుంచి నారాయణ అందించాడు ‘వర్స్ వర్సట్..’ అని. బ్యాడ్ బ్యాడ్డర్.. అంటాడేమో వాడు అని భయం. అ.న.గారు ‘బెంచెక్కరా నువ్వు’ అని హుంకరించాడు.. ‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడివా? నువ్వు? ఏరా...’ అని మండిపడ్డాడు.
అప్ - అప్పర్ - అప్పెస్ట్ అంటూ వాడు బల్లెక్కాడు. అమ్మాయిల ముందు.. ‘షేం’ కావడం వాడికి ఇష్టం లేదు.. అలా సరదాగా సాగేవి మాకు క్లాసులు. కాకపోతే - సోషల్ మాస్టారు ‘అన్దర్ పేరా’ (ఆయన నిక్ నేం అది) గారు మాత్రం మా ప్రాణాలు తినేసేవాడు. నోట్స్ డిక్టేట్ చెయ్యడం ఆయనకి ఇష్టం. లొడలొడ చెబుతూ ‘అనదర్ పేరా.. అనదర్ పేరా’ అని మధ్యలో అనేవారు. అంటే అనదర్ పేరా (మరో పేరాగ్రాఫ్ చేసుకోండి అన్న మాట) అంటూ ఊకదంపుడే. ఆయన పేరే ‘అనదర్ పేరా’ అయింది.
ఈ నిక్‌నేమ్ చాలా తమాషాగా ఏర్పడతాయి. మా ‘కంటిన్యూ’ మాస్టారున్నాడు. ఎంత నీటుగా నామం అదీ ధరించి వచ్చేవాడు. కానీ లెసన్ చెబుతూ కామా లేదు సేమికొలనూ లేదు.. కంటిన్యూ.. నలభై నిమిషాలు నాన్‌స్టాప్.. ఒకటే వాక్యమా? అన్నట్లు సాగేది. అప్పుడు ఆ ‘్ధర’ ఆపి.. డౌట్స్ ఏమయినా.. గలవా?’
లేవూ.. సారూ.. లెవ్వూ అని.. మేం కోరస్.
మాస్టర్లకి నిక్‌నేమ్స్ పెట్టడం యూనివర్సిటీ దాకా - అయాచితంగా సరదాగా సాగే ప్రక్రియ. చివరికి ఆ టీచర్లు కూడా వాళ్లల్లో వాళ్లు ఈ మారు పేర్లతో పిలుచుకునేవాళ్లు.
మాది ఉత్త రౌడీ ముండా స్కూలు. ‘గ్యాంగ్’లే ఎక్కువ అంటారు. అదీ నిజమే. కాని మా ఊరు అప్పుడూ గరం గరంగానే ఉండేది. మా పేటలో - ఘనీ, గాలూ, గౌస్ ఇంకా ఏవో పేర్లతో వుండేవాళ్లు. వీళ్లు నడిరోడ్డు మీదనే కత్తులు త్రిశూలాలు పెట్టుకుని కొట్టుకోవడం.. నేను స్కూలు నుంచి ఇంటికి పోతూ చూశా చాలాసార్లు. అయితే వాళ్లు పిల్లల జోలికి రాలేదెన్నడూ.
మా స్కూల్లోనే విద్యార్థుల గ్యాంగులు.. మా - పాండు, జేమ్స్ లాంటి వాళ్లు సైకిల్ చెయిన్లు.. నడుముకి కట్టుకుని తిరుగుతూ వుండేవాళ్లు. ఏ సెంటర్‌లోనో బలాబలాలు చూసుకోవడం పెద్ద పరాక్రమ కార్యక్రమం. ఎస్.ఎల్.సి.లో.. మేము ఫిఫ్త్ ఫారంలో వుండగా - కొందరికి ఉత్త పుణ్యానికి తగవు పెట్టుకొని - అవతల వాళ్లని తన్నడం హాబీ..
మా వూళ్లో మా స్కూలుకి దగ్గరలో శేష్‌మహల్ అని కొత్త సినిమా హాలు - కోలగా వుండేది అది - శేష మహల్ పేరు కాని అందరూ కోడిగుడ్డు హాలు అనేవాళ్లం. దానికి రాజ్‌కపూర్ వచ్చాడోసారి. ‘అందాజ్’ సినిమాకి దిలీప్‌ని తీసుకుని వచ్చారు.
దానిలో ‘పెడ్రో’ అని షేక్ ముఖ్తార్ నటించిన సినిమా ఆడింది. షేక్ ఆర్రున్నర అడుగుల ఎత్తు - మొరటుగా భయంకరంగా ఉండే హీరో.. మా క్లాసులో ఓ ఫ్రెండున్నాడు. చాలా పొడుగ్గా వుండేవాడు. బాస్కెట్‌బాల్ బ్రహ్మాండంగా ఆడేవాడు. గట్టిగా నా చేతివేళ్లు పట్టుకుని నొక్కేసేవాడు. ఇష్టంగానే. తప్ప మంచి సాత్వికుడు.. అతనికి నేను పెడ్రో’ అని నిక్‌నేమ్ పెట్టేశాను. అసలు పేరు మర్చిపోయాం. క్లోజ్ ఫ్రెండే, కాని ఇప్పటికీ అసలు పేరు జ్ఞాపకం రావటం లేదు. ఇంజనీర్ అయ్యాడు కోటేశ్వరరావు - అదే/ కోటిగాడు/ అనే వాళ్లు ఉత్త రౌడీ - ‘్ఫస్టు మార్కులు కృష్ణమూర్తి గనుక నన్ను వదిలి తప్ప ఎవరినయినా - ‘తంతాను’ అనేవాడు.. అదో రౌడీ నీతి.

(ఇంకా బోలెడుంది)

--వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com