S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫిక్కల్లో నొప్పి

ఫ్ర: కాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి. పిక్కలు పట్టేస్తున్నాయి. గట్టిగా నడవాలంటే కష్టంగా ఉంటోంది. నివారణ సూచించండి.
-జె.ఎస్.లక్ష్మి (ఒంగోలు)
జ: పిక్కలు పట్టేయటం చాలా మందిలో తరచూ కనిపించే ఒక వ్యాధి లక్షణం. మోకాలుకు దిగువ భాగంలో కాళ్లకు వెనక వైపున దృఢంగా ఉండే కండరాలను పిక్కలు (ష్ఘచి ౄఖఒషళఒ) అంటారు. ఇవి పట్టేసి తీవ్రమైన కాళ్ల నొప్పులకు దారి తీస్తుంది. ష్ఘచి ౄఖఒషళ ష్ఘూౄఔఒ అంటారు ఈ వ్యాధిని. ఎక్కువ మందిలో పిక్కలు పట్టేయటానికి అతిగా నడవటం, వ్యాయామం, కొన్ని రకాల క్రీడలు ఇలాంటివి ఈ వ్యాధికి సాధారణ కారణాలు. స్ర్తి పురుషులెవరికైనా ఇది రావచ్చు.
మోకాళ్లకు కింది భాగంలో పిక్కల దగ్గర నమిలేస్తున్నట్టు నొప్పి పుడుతుంటుంది. చెరకుని మిషన్‌లో పెట్టి పిండినట్టుగా ఉందని తమ బాధని చెప్పుకుంటారు. కండరాలు, నరాలు, రక్తనాళాలూ మూడూ ఈ నొప్పికి కారణాలే. కండరాలు బాగా వాచిపోయి, తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు తక్షణం వైద్యుడి సలహా పొందటం అవసరం.
నడవాలంటే కాళ్లు నొప్పులు, పిక్క కండరాలు పట్టేయటం ష్ఘచి ౄఖఒషళ ష్ఘూౄఔఒ, రక్తంలో ఉప్పు ఇతర లవణాలు తగ్గిపోవటం, శోష (జూళ్దకజ్ఘూఆజ్యశ), పొగ త్రాగే అలవాటు, పొగాకు ఉత్పత్తులను అతిగా తీసుకోవటం, కండరాలు గాయపడటం (ౄఖఒషళ ఒఆ్ఘజశ), అతిగా శ్రమ పడటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం, నిల్చోవటం, పిక్క కండరాలకు సరఫరా అయ్యే రక్తనాళాలలో అవరోధాలు (బ్లాకులు) ఏర్పడటం, పిక్క కండరాలకు సరఫరా అయ్యే నరాల మీద వత్తిడి కలగటం, పిక్కనీ మడమనూ కలిపే కండరంలో గాయం ఏర్పడటం, షుగరు వ్యాధి, మడమల నొప్పి, మోకాలు దిగువన రక్తనాళాలు పొంగటం (వేరికోజ్ వీన్స్), కాలుకు సరఫరా అయ్యే ప్రధాన రక్తనాళంలో రక్తం గడ్డకట్టి తరక (ఇ్య్యజూ ష్యఆ) అడ్డుపడటం ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి.
పిక్క కండరాలపైన బిగుతుగా క్రీప్ బ్యాండేజ్ కట్టి ఉంచటం వలన నొప్పి నిదానిస్తుంది. ఈ క్రీప్ బ్యాండేజి మందుల షాపుల్లో దొరుకుతుంది. సాగే గుణం కలిగిన ఈ ఎర్రటి గుడ్డ బిగించి కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కండరాల మీద వత్తిడి పడే విధంగా అతిగా నడవటం, యోగా వ్యాయామాలు చేయటం, బరువులు లేపటం కొంతకాలం ఆపాలి. మంచుముక్కలు పిక్క కండరాలకు అద్దుతూ కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. రాత్రి పడుకునేటప్పుడు కాళ్ల కింద రెండు దిళ్లు ఎత్తు పెట్టుకోవాలి.
కాళ్లను బాగా చాచి, పైకీ కిందికీ కదుపుతూ పిక్క కండరాలు సాగే విధంగా మృదువైన వ్యాయామం చేయాలి. అతిగా చేస్తే కండరాలు గాయపడే ప్రమాదం ఉంది. పాదాలను కూడా ఇలానే దాచి అన్ని కోణాల్లోకి మృదువుగా కదులుస్తూ వుంటే నొప్పి సర్దుకుంటుంది.
ఆయుర్వేద శాస్త్రంలో ఈ వ్యాధిని పిండికోద్వేష్ణనం అంటారు. రక్తహీనత కూడా దీని కారణాల్లో ఒకటిగా ఈ శాస్త్రంలో చెప్పటం జరిగింది. మాంస కండరాలలో వాత దోషం వలన ఈ వ్యాధి కలుగుతోంది.
ఇది రాత్రికి రాత్రే శరీరంలో వాతం పెరిగినందువలన వచ్చే వ్యాధి కాదు. దీర్ఘకాలంగా వాతాన్ని పెంచుకునే ఆహార విహారాలను పాటించటం వలన కలిగే వ్యాధి. ఆధునిక వైద్యం వ్యాయామం, శ్రమ లాంటి విహారానికి సంబంధించిన కారణాలను పేర్కొంటోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఆహారంలో వాత దోషాన్ని పెంచేవి కూడా ఈ వ్యాధి రావటానికి అదనపు కారణాలుగా సూచించింది. మాంసగత వాతం అనేది దీనికి ముఖ్య కారణం.
ఆమలకి (ఉసిరికాయ)తో చేసిన తొక్కు పచ్చడిని రోజూ తినండి. బూడిద గుమ్మడికాయని కూరగాయ అనే సంగతి మర్చిపోయి గుమ్మాలకు దిష్టిబొమ్మలుగా వ్రేలాడదీస్తున్నాం. ఇది అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన కూరగాయ. దీన్ని ఆహార పదార్థంగా చేసుకుని తరచూ తినటం అలవాటు చేసుకోవాలి. సొరకాయతో ఏయే వంటకాలు చేసుకుంటామో అవన్నీ లేత బూడిద గుమ్మడికాయతోనూ చేసుకోవచ్చు.
స్థూలకాయం, షుగరు వ్యాధి లేనివారైతే ముదురు బూడిద గుమ్మడితో హల్వా చేసుకుని ఔషధ ప్రమాణంలో రోజూ తింటూ వుంటే పిక్కలనొప్పులు తగ్గుతాయి. కూష్మాంద లేహ్యం అనే పేరుతో ఆయుర్వేద షాపుల్లో ఈ ఔషధం దొరుకుతుంది కూడా! రోజూ 1-2 చెంచాలు రెండు పూటలా తీసుకుంటే మంచిది.

(మిగతా వచ్చే వారం)

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com