S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను

పదకవితా మహుడూ, తాళ్లపాక వంశంలో మణిదీపంగా వెలిగిన అన్నమయ్య తను రాశిన పదాలను గురించి ‘దాచుకో నీ పాదాలను తగనే జేసిన పూజలివి/ పూచినీ కీరితిరూప పుష్పము లివియయ్యా!’
ఒక్క సంకీర్తనే చాలు
వొద్దికై మమ్ము రక్షింపగ/ తక్కినవి భండారాన దాచి వుండనీ../ లెక్కసమగు నీ నామము వెలసులభము.. ఫలమధికము/ దిక్కై ననే్నలితివి కనవి తీరని నా ధనమయ్యా!’
‘నా నాలికపై నుండి నానా సంకీర్తనలు/ పూనినాచే నిన్ను పొగడించితిని/ వేనామాల వెన్నుడా వినుతించనెంత వాడ/ కానిమ్మని నాకీ పుణ్యము గట్టితినింతేయయ్యా!’
‘ఈ మాట గర్వముగాదు/ నీ మహిమ కొనియాడితి గాని/ చేముంచి నా స్వాతంత్య్రము చెప్పినవాడ గాను/ నే మానబాడేవాడను నేరము లెంచకుమీ/ శ్రీ మాధవ! నేనీ దాసుడ శ్రీ వేంకటేశుడవయ్యా!’
‘దాచుకో నీ పాదాలకు దగ/ నే జేసిన పూజలివి’
ఆ ఏడుకొండల స్వామితో ప్రత్యక్ష పరిచయం పెంచుకుని ఒద్దికగా ఆయన ప్రక్కనే చేరి ఎలా పాడితే వింటాడో, అలా గానం చేస్తూ, నాలుగు నిమిషాలకో, రోజుకొకటో పాట రాసి, ఆ పాటతోనే స్వామితో పరిచయం పెంచుకుని ఏ వాగ్గేయకారుని వల్లా సాధ్యంకాని రీతిలో 32 వేల సంకీర్తనలు రాసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పాదాలకు సమర్పించిన భక్తాగ్రేసరుడు అన్నమాచార్యులు. ఆయన ‘సంకీర్తనా లక్షణ సార గ్రంథం’ పారిజాత వృక్ష సమానమైనది. సాధారణ పుష్పాలు కాస్సేపటికే వాడిపోతాయి. సమర్పణ బుద్ధితో స్వామికి సమర్పించిన ఈ సంకీర్తనా కుసుమాలు వాడనివి - క్షేమంగా ఎవరి పాదాల దగ్గర వుండాలో అక్కడే వున్నాయని సంబరపడ్డ భక్తుడు.
ఒకరి పాదాలకు నమస్కరిస్తే వారి శక్తి మనలోకి కొంత ప్రవేశిస్తుంది. అందుకే కొందరు మహాత్ములు తమ పాదాలను తాకనివ్వరు. మామూలు వ్యక్తుల పాదాలే అంత శక్తి కలిగినవే అయితే గంగమ్మ లాంటి పవిత్ర నదికి జన్మనిచ్చిన స్వామి పాదాలు ఎంత పవిత్రమో చెప్పాలా? స్వామి పాదాల స్పర్శతో పునీతమైన అన్నమయ్య కీర్తనలు పాడి ప్రచారం చేసుకునే అదృష్టం మనకు పట్టింది. స్వామి పాద స్పర్శ నోచుకున్న ఆ సంకీర్తనలు చౌకబారు బాణీల్లో కాకుండా గౌరవంగా పాడాలని మరొకరు చెప్పాలా? ఆయన సాహిత్యం చూస్తే అటుకులను స్ఫురించదూ? ఆప్యాయంగా ఆరగించిన కృష్ణుడు మరో గుప్పెడు తీసుకోపోబోతే ‘స్వామీ! చాలు! కుచేలుణ్ణి అష్టైశ్వర్యాలతో అనుగ్రహించటానికి మీరు తీసుకున్నవి చాలు’ అని రుక్మిణి వారించింది.
అలాగే పద కవితా పితామహుడు.
వేవేల జన్మలకు అవిచ్ఛిన్న భక్తిని అనుగ్రహించడానికి ఒక్క కీర్తన చాలు. తక్కినవన్నీ ఇక్కడే నీ పాదాల వద్ద నుంచనిమ్మన్నాడు.
సంకీర్తన భాండారంలో అలా కొనే్నళ్లు ఉండిపోయాయి.
(దేవసాలగం కనకాంగి రాగంలా ఉంటుంది) దేశాళి లాంటి ఎన్నో అపురూప రాగాల్లో అన్నమయ్య పాడుకున్నట్లు దాఖలాలున్నాయి. అన్నమయ్యలా మానవ భాషలో కీర్తనలు రచించిన కవి మరొకడు లేడన్నారు కళాప్రపూర్ణుడై రచని.
దేవాలయాల్లో నాలుగు నాపరాళ్లు పరిస్తే పేర్లు వ్రాయించుకునే కీర్తికండూతి మనది. 32 వేల సంకీర్తనా కుసుమాలతో స్వామినర్చించి స్వామి సమక్షంలో గుళ్లో నాలుగు రాళ్ల మధ్యా తన సంకీర్తనలను నిక్షిప్తం చేసి పెట్టి వెళ్లిన ఘనత అన్నమయ్యది. విఘ్నేశ్వరుడు సహకరించకపోతే వ్యాసభారతం ఎందరికి తెలిసేదో తెలియదు. మనుమడు చిన్నన్న అనుకోకపోతే అన్నమాచార్యుని చరిత్ర మాత్రం అసలు బైటకు వచ్చేదే కాదు. తండ్రి తాతల బాటలో తన మాటలు సాగించడంతోబాటు, యిన్ని వేల కీర్తనలు శ్రీ వేంకటేశ్వరుడిపై వెలయింపజేసిన ఆ మహనీయుని చరిత్రను అందించిన చిన్నన్నకు తెలుగు జాతి నిజానికి చాలా ఋణపడి ఉంది.
అన్నమయ్య సంకీర్తనలు వెలుగు చూడటానికి కారణం తిరుమల తిరుపతి దేవస్థానమే.
రాగి రేకుల్లో ఉన్న సాహిత్యాన్ని జన బాహుళ్యంలోకి తెచ్చిపెట్టారు.
వాస్తవానికి మనసుకు పట్టేది పాట యొక్క తీరు. అందులోని కవి హృదయం. స్వామివారికి మహా నైవేద్యం పెట్టినప్పుడు ఎవరూ వీక్షించకుండా తెర కప్పేస్తారు.
అన్నమయ్య కూడా ఆ పనే చేశాడు. సంకీర్తనా రాగమాలికలతో మహా నైవేద్యం పెట్టి తెర వేసేశాడు. సంకీర్తనా భాండారంలో అన్నమయ్య కీర్తనలు వున్నాయన్న సంగతి చాలాకాలం ఎవ్వరికీ తెలియదు. రాగి రేకుల్లో వున్న వాటిని పరిశీలించి, పరిష్కరించటంలో వేటూరి ప్రభాకరశాస్ర్తీ, సాధు సుబ్రహ్మణ్య శాస్ర్తీ మొదలైన ఎందరో ప్రముఖులకు చేతులెత్తి నమస్కరించాలి. సాహిత్యం విషయంలో అన్నమయ్య ఏ యితర వాగ్గేయకారుడికీ తీసిపోడు. పైగా వాసిలోనూ, రాసిలోనూ అందరికంటే మిన్నగా నిలిచిపోయాడనటం కూడా నిజం. ప్రతి కీర్తనకూ వ్యాఖ్యానం చేయాలంటే ఒక జీవితం సరిపోదు. అర్థంకాని విషయాల పట్ల అలసత్వం మనిషికి సహజం. అన్నమయ్య ఎలా పాడేవాడో తెలియదు- శిష్యులెవరూ లేరు.
నిజానికి మనసుకు చేరువయ్యేదీ, మురిపించేదీ ఆట, పాట. ఆకట్టుకునేది అందులోని పద విన్యాసమొక్కటే కాదు. హృదయాలను తాకుతూ నాదాన్ని నింపుకున్న మాటలే. వాసికంటే రాశికే ప్రాధాన్యతనిస్తూ అన్నమయ్య కీర్తనల ప్రచారమే లక్ష్యంగా సాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికే గనుక చిత్తశుద్ధి వుండి, వుంటే ఈ పద కవితా పితామహుడు, ‘హిమాలయమంత ఎత్తులో’ వుండేవాడు.
సంగీత కళానిధులైన శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైన కర్ణాటక సంగీత విద్వాంసులతో ఏనాడో అన్నమాచార్య కీర్తనలకు ఒక గౌరవం ఏర్పడి ఉంది.
నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారమే ఏర్పడుతుంది. ఈ సంకీర్తనల సంగీతం కూడా అంతే. వేద వేదాంత ఉపనిషత్ సారాన్ని తన పదాల ద్వారా, సంకీర్తనల ద్వారా తెలుగు జాతికి అందించిన పద కవితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఈ కీర్తనలు సినిమా వాళ్ల చేతుల్లో వుంటే ఆ ప్రభావమే కనిపిస్తుంది - అంతేకాదు. కుప్పిగంతులు వేసే ఏ సినీ నటియో, నటుడో కళ్లకు కనిపించేలా వుంటాయి. అన్నమయ్య సాహిత్యానికి దీటైన సంగీత స్థాయి ఎలా ఉండాలో తిరుమల తిరుపతి దేవస్థానానికే తెలియకపోవడం మన దురదృష్టం.
పాటలో కవితా భావన ముందుగా వస్తుందో సంగీతపు మట్టు (ట్యూన్) ముందుగానే వచ్చేసి దాని కవితా భావన పూన్చబడుతుందో ఓ పట్టాన ఎవరికి అంతుపట్టదు. అదొక బ్రహ్మ రహస్యంలా చప్పున విడదు. అందుకే బాలాంత్రపు రజనీకాంతరావు గొప్ప వాగ్గేయకారుడు, పోనీ కవి అందామా అంటే కాసేపు ఆగి, ఈ రెంటిలోనూ, ఈయన ఎందులో ఎక్కువ కాదూ? అని తేల్చేసి తృప్తిపడతాం.
ఒక్కటి మాత్రం తిరుగులేని సత్యం. రజని లాంటి భావుకుడుండడు. పుట్టగొడుగుల్లా వచ్చే పాటలూ, వరసలూ పక్కన పెట్టండి. కొందర్ని తలయెత్తి పలుకరించాలంటే చాలా దమ్ముండాలి.
కొన్నికొన్ని పాటలు పాడాలంటే డొక్కశుద్ధి ఉండాలి. భయభక్తులు తప్పనిసరి. అందుకే ఆధునిక వాగ్గేయకారుడై పేరు తెచ్చుకున్నాడు అని సగర్వంగా తెలుగువాడు తలెత్తి చెప్పుకోగల రజని ‘రాశిన’ కృతజ్ఞతా గీతం యిది. సంగీత వారసత్వం మీద, తెలుగు నాట్య రీతుల మీద, తెలుగు చూశిన పరిశోధనలు.. కాళిదాసు, అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకూ, ఆంధ్రి రాగం నుండి జ్యోతిషం వరకూ చేసిన విశే్లషణలూ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ఈ యోగం అందరికీ లభించదు.
విధాత సంకల్పం బలమైంది. ఆయన్ని వాగ్గేయకారుణ్ణి చేసింది. ఒక పాట భావసముద్రమై, ఆ పాటకు కూర్చిన సంగీతం పాకమై శ్రోతలను ముంచెత్తటం రజనితోనే ఆరంభమైంది. జ్ఞాని కదా! ఇదంతా నా ప్రతిభ కాదు అంటూనే పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలకు బాణీలు కూర్చిన వాణీపుత్రుడు. ఆకాశవాణి ద్వారా ప్రతినిత్యం ప్రభాత వేళలో ఆ కీర్తనలకు ప్రసార ప్రచార భాగ్యం కలిగించారు.
అన్నమయ్య రాగస్వరూపాలే కాదు అనురాగ స్వరాలను కూడా రమణీయంగా ఆవిష్కరించిన పుంభావ సరస్వతి.. రజని. ఇంత చేసినా ‘నాదేం లేదయ్యా! నువ్వు లేకపోతే నేనెక్కడ? నాచేత చేయించేదంతా నువ్వేగా?’ అని వినమ్రంగా తలవంచి సర్వేశ్వరుడికి మ్రొక్కి పాడుకున్న కృతజ్ఞతా పూర్వక గీతమిది.
* * *
‘నే చేయునదీ నే చేయనిదీ
సాధించినదీ ఫలియించనిదీ
నీ యిచ్ఛ లేక జరుగదట
నా స్వేచ్ఛ మొదలుతుది యెచట ॥

నిను చూచుటకే రప్పించితివే
నీ దరిశనమే యిప్పించితివీ
రుూ నోట పాట పాడించితివీ
యిది ఎవరి రచన యని అడిగితివి ॥

- మల్లాది సూరిబాబు 90527 65490