S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంసార బంధం నుంచి విముక్తి చేసేది రామకథే

వాసుదాసు వ్యాఖ్యానం:
అరణ్యకాండ-3

భగవత్ చరిత్రలెన్నో వుండగా రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసు గారు. జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి విముక్తి చేసేది రామకథేనని, భగవత్ సాయుజ్యం పొందేందుకు రామాయణ రచన చేసానని అంటారాయన. పూర్వం కొందరు రాసారు కదా, మరలా ఎందుకు రాస్తున్నావంటే, ‘ఎవరి పుణ్యం వారిదే. ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు’ అని జవాబిస్తూ, శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసు గారు. భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంబ సూత్రుడు, గోల్కొండ వ్యాపారి శాఖీయుడయిన వావిలికొలను సుబ్బరావుగారు, కడప జిల్లా- జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొ ద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళలు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు. వాసుదాసు గారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, ‘శ్రీకుమారాభ్యుదయం’ అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని కలిగించారాయనకు. ఆయన రచించిన ఆ ప్రబంధం నాటి కవి పండితులను ఆశ్చర్యపరిచింది. ఆయన ప్రతిభకది తొలి హారం.
ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసుదాసు గారు,గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అ నువాదమైనా, స్వంత రచన-స్వ తంత్ర రచన అనిపించుకుంది.
వావిలికొలను సుబ్బారావుగా పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. ఈ నాటికీ క్రమం తప్పకుండా గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న అంగలకుదురు నుంచి ప్రచు రించబడుతున్న ‘్భక్తి సంజీవని’ అనే భక్తి-జ్ఞాన- కర్మ యోగాలను తెలిపే ఆధ్యాత్మిక మాసపత్రిక సంస్థాపక సంపాదకులుగా- వాసుదాసుగా-ఆంధ్ర వాల్మీ కిగా-కవి సార్వభౌమగా ప్రసిద్ధికెక్కారు. అంగల కుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం స్థాపించింది ఆయనే. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి, ఈనాటికీ దర్శనీయమైన రీతిలో శాశ్వత కైంకర్యం చేసిన వాసుదాసుగారు, వాజ్ఞ్మయ ప్రపంచంలోని భక్త కవులలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘సత్కవి మిత్రుడను’ అని చెప్పుకున్న ఆయనకు తిరుపతి వేంకటకవులు, కొక్కొండ వేంకట రత్నం పంతులు, వేదం వేంకటరాయ శాస్త్రులు మొదలైన ప్రసిద్ధ కవులందరూ స్నేహితులే.
వాసుదాసు గారు ‘కౌసల్యా పరిణయం’ అనే ప్రబంధం, ‘సుభద్రా విజయం’ అనే నాటకంతో పాటు, ‘హిత చర్యలు’, ‘ఆధునిక వచనరచనా విమర్శనం’, ‘పోతన నికేతన చర్చ, ‘పోతరాజు విజయం’, ‘రామాశ్వమేథం’, ‘ఆంధ్రవిజయం’ కూడా రాసారు. ‘ఆర్యకథానిధులు’ అన్న పేరుతో ఆయన రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి. ‘సులభ వ్యాకరణం’ తెలుగు వ్యా కరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన ‘కృ ష్ణావతార తత్వం’ ప్రశస్త కృతి పాండిత్యంతో, ఆధ్యాత్మిక భావ నతో, పాఠకులలో ఆంధ్ర భాషాభి మానాన్ని ఉద్దీపించచేసి -తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు, మహామనీషి వావిలి కొలను సుబ్బరావు గారు.
ఆంధ్ర వాల్మీకిరామాయణం తర్వాత రచించబడిన పలు గద్య- పద్య రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభించినా, ఆ రోజుల్లోనూ-ఈ రోజుల్లోనూ, వాసు దాసు గారి రామాయణానికి ప్రాచుర్యం లభించినా తగినంత గుర్తింపు ఎందుకు లభించలేదనేది జవాబు దొరకని ప్రశ్న. ‘ఆదికవి-ఆంధ్ర వాల్మీకి’, యథాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందోయతులను ఆయా స్థానాలలో నిలిపి తెనిగించిన వాల్మీకానికి రావాల్సినంత మోతాదులో, ఎందుకు గుర్తింపు రాలేదు? వ్యాస మహాభారతాన్ని మొదట తెనిగించిన నన్నయను ‘ఆదికవి’ గా పిలిచినప్పుడు, వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా పూర్వ కాండలతో కలిపి ఉత్తర కాండను కూడా మొట్టమొదట తెనిగించిన వాసుదాసుగారు కూడా ‘ఆదికవే’ కదా? నన్నయంతటి గొప్పవాడే కదా. వాస్తవానికి సరైన పోషకుడో -ప్రాయోజకుడో వుండి వుంటే, వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకిరామాయణం, ఎప్పుడో-ఏనాడో నోబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఏ మాత్రం మన తెలుగువారు ప్రయత్నం చేసినా, ఆ మహానుభావుడికి భారతరత్న-జ్ఞానపీఠ అవార్డులతో పాటు నోబెల్ బహుమానం వచ్చేది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే మంచిదేమో.
వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టుల య్యారు. మహనీయమైన ‘మందర’ రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య- ప్రతి పదార్థ-తాత్పర్య- ఛందోలంకార విశేష సముచ్ఛయంతో, నిర్మించి, వేలాది పుటలలో మనకందించారు. రామాయణ క్షీర సాగరాన్ని ‘మందరం’ మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. ‘సూక్ష్మంలో మోక్షం’ కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ. కాలం గడిచిపోతున్నది. వాసుదాసుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి ‘ఆర్యకథానిథుల’ తోనూ, ‘హితచర్యల’ పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెర మరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసు దాసస్వామి.
నారాయణా! కరుణా!
ధీనా! దీనార్తిహరణ ధీమజ్జనర
క్షానియా! యపపర్గ వి
ధానక్ష! యొంటిమిట్ట దశరథరామా!
మందరం..వ్యాఖ్యానారంభం
శ్రీరామచంద్ర ప్రభో పాహి పాహి

-సశేషం