S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ రామ.. నీ నామ..

ఓ రామ నీ నామమేమి రుచిరా
శ్రీరామ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీ నామమేమి రుచిరా !ఓ రామ!

కదళీ కర్జూరాది ఫలముల కదికవౌ
కమ్మన నీ నామమేమి రుచిరా ! ఓ రామ!

నవరసముల కన్న నవనీతముల కంటె
అధికవౌ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటె
అధికవౌ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

అంజనతనయ హృత్కమలంబునందు
రంజిల్లు నీ నామమేమి రుచిరా ! ఓ రామ!

శ్రీసదాశివుడు తానేవేళ భజియించు
శుభరూప నీ నామమేమి రుచిరా ! ఓ రామ!

సారములేని సంసార తరుణమునకు
తారకము నీ నామమేమి రుచిరా !ఓ రామ!

శరణన్న జనులను సరగున రక్షించు
బిరుదుగల్గిన నామమేమి రుచిరా ! ఓ రామ!

తుంబుర నారదుల్ డంబమీరగ గా
నంబు చేసెడి నామమేమి రుచిరా ! ఓ రామ!

అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామమేమి రుచిరా !ఓ రామ!
*