శ్రీ సీతారాముల పెళ్లి
Published Saturday, 24 March 2018శ్రీ సీతారాముల పెళ్లి ముత్యాల తలంబ్రాలు
రామదాసు రామభక్తి కీర్తన ప్రసూనాలు
తానీషా ప్రభుని సమతాభావ సౌరభాలు
సకల ప్రజాళిని బ్రోచే కల్యాణ వౌక్తికాలు
భూ భువన కల్యాణ మంటపానికి
పచ్చని మావి తోరణాలు రెపరెపలాడ
దివ్య భద్రగిరి పెండ్లి పీటలపై జరిగే
శ్రీ సీతారామ కల్యాణం లోక కల్యాణకరం
సీతమ్మ చేతుల పద్మ రాగాలై రాజిల్లు
ముత్యాల తలంబ్రాలు రాముని మేని కాంతికి
ఇంద్రనీలాలై భాసిల్లి జలజలా రాలగ
సకల భువనాలు తిలకించి, పులకించె.
*