S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమూల్యం

జలాంతర్యామి కథనం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మన సైనికుల సేవలు అమూల్యం. మనం గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రిస్తున్నామంటే, భూ, జల, వాయు సైనికులు నిరంతరం డేగ కళ్లతో శత్రువుల కదలికలు గమనిస్తూ, వారి ఎత్తులకు పైఎత్తులు వేసి తిప్పికొడుతున్నారంటే అది మన సైనికుల గొప్పతనం. వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. భారత సైనిక నావికాదళ రక్షణ వ్యవస్థలో సబ్‌మెరైన్‌ల పాత్ర, అందులో సైనికులు దేశం కోసం, మన కోసం నిరంతరం వారందిస్తున్న సేవలు అమోఘం. అమూల్యం. వారి కష్టాలు చదువుతుంటే కళ్లు చెమర్చాయి. వారి కోసం మన వంతు బాధ్యతగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి.
-కురువ శ్రీనివాసులు (హైదరాబాద్)
కైలాసం ఆట
మనల్ని ఎన్ని పాములు మింగినా మళ్లీ పైకి వెళ్లడానికి నిచ్చెన లుంటాయన్న నీతిని తెలుపుతుంది కైలాసం ఆట.. అని బాగా చెప్పారు ‘ఓ చిన్న మాట’లో. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ నిర్వహించిన ఫొటోల పోటీలో ఎంపికయిన మలుపుల రాదారి ఫొటో చాలా బాగుంది. చదువు కాదు సంస్కారం ముఖ్యం. సంపద కాదు సౌజన్యశీలం ముఖ్యం అంటూ చెప్పిన కవిత మాకు నచ్చింది. రాగసుధా రస పానము చేసిన మహానుభావులు ఘంటసాల, బడే గులామలీఖాన్, సూర్యనారాయణ భాగవతార్‌ల గురించి చక్కగా చెప్పారు అమృతవర్షిణిలో.
-కె.సుభాష్ (శ్రీనగర్)
తమాషా
క్రైం కథ ‘మరణశిక్ష’ తమాషాగా ఉంది. ఉరిశిక్ష విధించబడిన కేజువల్ ఉరితాడు లోంచి తప్పించుకొని టైం మెషీన్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్లి అక్కడ ఒక దొంగ బిగించిన ఉరిలో చిక్కుకొని మరణించడం, ఆ దొంగ అదే టైంమెషీన్ ద్వారా గతంలోకి వెళ్లి కేజువల్‌ని ఉరి తీయడానికి సిద్ధం చేసిన తాడులో చిక్కి మరణించడం అంతా ఊహాతీతం. అసలిలా జరుగుతుందా అనిపించే కథ. టైంమెషీన్ అంటూ అభూత కల్పనలు చేశాడు రచయిత. బొప్పాయిలో గొప్ప లాభాలున్నాయని, రోజూ తింటే జీర్ణశక్తి పెరిగి రక్తంలో గ్లూకోజు స్థాయి, బిపి తగ్గుతాయని తెలిశాయి.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
చాలా బాగుంది
‘మంచి రోజులొచ్చాయి’ కథ చాలా బాగుంది. యువత చదవాల్సిన కథ. అందరిలో కొందరైనా అలా ఉంటారా? ఉంటే దేశం తప్పకుండా బాగుపడుతుంది. సండే గీత, ఓ చిన్న మాట చదువుతుంటే మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. అక్షరాలోచనలో కవితలు బాగుంటున్నాయి. అందులో ‘అమ్మతనం కూడా వ్యాపారమే’ చదివి బాధపడ్డాం. ‘లోకాభిరామమ్’లో కెమిస్ట్రీ గురించి చక్కగా చెప్పారు. ఆ పాఠం చెప్పేటప్పుడు అదే వృత్తాలతో అనుబంధాల గురించి ఉదాహరణ చెబుతాము. రాగసుధలో ఘంటసాల గారి గురించి, ఆయన ఫొటో చూసి చాలా సంతోషించాం. విశాఖలో అన్ని సంవత్సరాలు ఉన్నా జలాంతర్యామి గురించి తెలుసుకోలేక పోయాము. ‘వినదగు’లో సాధనకు కావల్సినది సంకల్పం అని బాగా చెప్పారు. లోకం పోకడలో అతడే ఓ అయస్కాంతం చాలా చిత్రంగా ఉంది. గంప కింద కోళ్లు కథ చాలా బాగుంది.
-డి.వి.తులసి (రామవరప్పాడు)
జలాంతర్యామి
అనంత సాగర అంతర్భాగంలో తిమింగలం నీడలా జారిపోతూ, దూసుకుపోతూ, చెవులు రిక్కించి శత్రు కదలికలు కనిపెడుతూ, ఎదురుదాడి చేస్తూ మనల్ని, మన దేశాన్నీ కంటికి రెప్పలా రక్షిస్తూన్న జలాంతర్గామి దళాల గురించి కవర్‌స్టోరీలో చక్కగా వివరించారు. జలాంతర్గాముల్లో పనిచేసే సైనికులకు శిక్షణ యిస్తూ రాష్టప్రతి చేతుల మీదుగా ‘కలర్స్’ పురస్కారం పొందనున్న విశాఖ విభాగం మనకు గర్వకారణం. ముత్యాల్లో ఊదారంగువి, నల్లవి, పసుపువి ఉంటాయనీ, ఆడ డాల్ఫిన్‌ల ప్రేమను పొందడానికి మగ డాల్ఫిన్లు మనలాగే బహుమతులు ఇస్తాయని తెలిసి ఆశ్చర్యపోయాం.
-ఆర్.శాంతిసమీర (వాకలపూడి)
మాగ్నటిక్ మ్యాన్
మధ్యప్రదేశ్‌కి చెందిన అరుణ్ గైక్వాడ్ గుండె, పొట్ట, వీపు భాగంలో చిన్నచిన్న ఇనుప వస్తువులు పెడితే అవి అక్కడ అతుక్కుపోయి అక్కడ నుండి కిందపడవు. అతనిని ఇండియన్ మాగ్నటిక్ మ్యాన్ అని వ్యవహరిస్తూ ఉండడం ఆశ్చర్యకరమే. అందమైన లోయలో అలసట ఎరుగని ప్రయాణ విశేషాలు ఆహ్లాదపరిచాయి. అక్కడ సంచరిస్తున్నట్టే అనిపించింది. వినోద్‌గారి కార్టూన్లు వినోదం కలిగించాయి. కథాసాగరంలో మాట్లాడే పుర్రె చెప్పిన నీతి ‘అవసరాన్ని మించి మాట్లాడవద్దు’ అన్నది బాగుంది. అందరూ పాటించాల్సిన నీతి.
-కె.హితీక్ష (రమణయ్యపేట)
దైవకృప
ఓ చిన్న మాటలో ఓ పెద్ద సందేశం ఉంది. విజయం సాధించాలంటే కఠోర శ్రమని, క్రమశిక్షణని మించిన దారి లేదనే మాట వాస్తవమయినా ఎంత నియమ నిబద్ధతను పాటిస్తున్నా గుర్తింపు పొందని మేధావులెంతో మంది ఉన్నారు. డాక్టరేట్‌లు పొందిన వారు విద్యా సంస్థల ముందు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంలా మోకరిల్లుతున్నా ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. దీనికి కారణం ఏం చెప్పాలి? దైవకృప లేదనాలా లేక అదృష్టం కలిసి రావట్లేదనాలా? కొండంత తెలివికన్నా గోరంత అదృష్టం గొప్పదనే సామెత నిజమనుకోవాలా?
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
విశ్వం
ఏమీ లేదులో నుంచి విశ్వం మొదలయింది. అప్పుడే వెలుగు పుట్టింది. వేడి పుట్టింది. కాలం, కదలిక పుట్టాయి - అంటూ బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని చక్కగా వివరించారు గోపాలంగారు ‘లోకాభిరామమ్’లో. అంతా గజిబిజి, గందరగోళం. కొన్ని సిద్ధాంతాలు అలాగే ఉంటాయి మరి. ఈ మానవ దేహంలోకి ఎలా వచ్చామో, అలాగే పోవాలి. వెంట ఏం తెచ్చుకున్నామో దానే్న తీసుకుపోవాలి. ఇక్కడి సంపాదన ఇక్కడికే అంటూ ‘వినదగు’లో మంచి విషయాలు చెప్పారు డా.వాసిలి.
-ఆర్.మరుదకాశి (కరప)