S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బొప్పాయతో గొప్ప లాభాలు

ఫ్రశ్న: షుగరు వ్యాధి ఉన్న వారు బొప్పాయి పళ్లు తినవచ్చా? బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు దయచేసి వివరించండి.
జ: గుండె జబ్బులు, షుగరు వ్యాధి, కేన్సర్ జబ్బులున్న వాళ్లు బొప్పాయి పండుని రోజూ తింటూ ఉంటే వారి జీర్ణశక్తి బాగయి, దోషాలను శరీరమే సరిచేసుకో గలుగుతుంది. షుగరు వ్యాధిగ్రస్తులు బొప్పాయి పండును తిన్నందువలన రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుందని, బీపీ తగ్గుతుందని, ఆస్తమాని తగ్గించే గుణం, కేన్సర్ ఏర్పడకుండా ఆపే గుణమూ దీనికున్నాయనీ, వ్రణాలు త్వరగా మానుతాయని, 20 జూన్, 2017 మెడికల్ న్యూస్ టుడే జర్నల్ ప్రకటించింది.
బొప్పాయి పళ్లు ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉపయోగార్థం పండుతాయి. పపావ్, పావ్ పావ్‌లని కూడా వీటిని వివిధ దేశాల్లో పిలుస్తారు. దాని తీపి రుచి, కాషాయ వర్ణం, కడుపు నిండా లక్షణం, జీర్ణశక్తిని పెంచే గుణం, తగిన పోషకాలను అందించే శక్తి ఇవన్నీ బొప్పాయిని ప్రసిద్ధ ఫలంగా ప్రాచుర్యం తెచ్చాయి.
మెక్సికో దీని జన్మస్థలం. కర్రీబియన్, ఫ్లోరిడాలలో ఇది అత్యధికంగా పండుతుంది. 2,3 వందల ఏళ్ల క్రితం భారతీయలకు ఈ పండు అపూర్వమైనదే! పొగాకు, మిరపకాయ, జామ పండ్లతోపాటు పోర్చుగీసులు తెచ్చిన ద్రవ్యాల్లో బొప్పాయి కూడా ఒకటి. ప్రస్తుతం 5 మిలియన్ టన్నుల బొప్పాయి భారతదేశంలో పండుతున్నట్టు అంచనా! ఈ మూడు నాలుగేళ్లలో బొప్పాయి వాడకం తెలుగు నేల మీద ఎక్కువగా పెరిగింది.
యళ్ఘన్ఘశఆ్దజశ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉందనీ, అది ముంచుకొచ్చే ముసలితనాన్ని నివారిస్తుందనీ కనుగొన్నారు. సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాలు చర్మం మీద ముడతల్లాంటి వార్థక్య లక్షణాలు కలగటానికి కారణం అవుతాయి. ఈ జీయాక్సాన్థిన్ రసాయనం అతి నీల లోహిత కిరణాల రేడియేషన్ దుష్ట ప్రభావాన్ని తగ్గిస్తుంది.
బొప్పాయి పండులోని కాషాయ వర్ణం దానిలోని బీటా - కెరోటిన్ సాంద్రతకు గుర్తు. కేరట్‌తో సమానంగా బీటా కెరోటిన్‌ని బొప్పాయి అందిస్తుంది. తెలుగు ప్రాంతాల్లోని ప్రజలకు బీటా కెరోటిన్ సమృద్ధిగా అందటానికి ఇప్పుడు అన్ని సీజన్లలో దొరికే పండ్లలో పుచ్చ, బొప్పాయి సామాన్యుడికి అందుబాటు లో ఉన్నాయి. ఈ బీటా కెరోటిన్ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.
మధ్య
వయసు మగవాళ్లు బొప్పాయిని తమ ఆహారంలో భాగంగా రోజూ తీసుకుంటే ఉంటే, ప్రోస్టేట్ కేన్సర్ ప్రమాదం నివారించటం సాధ్యం అవుతుంది. బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ కె కేల్షియం వొంటబట్టేలా చేయటానికి సహకరిస్తుంది. రక్త ప్రసార వ్యవస్థను సరిచేస్తుంది.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే జీర్ణశక్తిని పెంపుచేసే ఎంజైమ్ ఉంటుంది. దీనికి వ్రణాలను తగ్గించే గుణం కూడా ఉందని పరిశోధనలో తేలింది. కేన్సర్ వ్రణాలే కాదు, పేగులో పుళ్లను కూడా ఇది తగ్గిస్తుంది. ఆరోగ్యదాయకమైన జీర్ణకోశ వ్యవస్థను బొప్పాయి పండ్లు సమకూరుస్తాయి. కండరాలకు, ముఖ్యంగా మెదడు కండరాలకు ఇది శక్తిని అందిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి.
నరాల జబ్బుల్లో, ముఖ్యంగా అల్జీమర్స్ లాంటి మతిమరుపు వ్యాధుల్లో బొప్పాయి, చికిత్సను మెరుగుపరచటానికి తోడ్పడుతుంది. కాలిన చోట బొప్పాయి గుజ్జు రాస్తే, పుండు, వాపు త్వరగా తగ్గుతాయి. పపైన్ ఎంజైముతో కట్టు కట్టేందుకు ఆయింట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ముఖానికి బొప్పాయి పండు గుజ్జుని పట్టిస్తే చర్మం కాంతిమంతం అవుతుంది. మొటిమలు త్వరగా తగ్గుతాయి. బొప్పాయి పండ్లు తింటే జుట్టు రాలడం ఆగుతుంది. మృదువుగా ఉంటుంది. కె,ఎ,సి విటమిన్లు తగినంతగా అందటానికి బొప్పాయి పండు ఉన్నంతలో చవకగా దొరికే ఒక ఉపాయం.
అరచేతిలో పట్టేటంత బొప్పాయి పండులో 120 కేలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల పీచు పదార్థం, 18 గ్రాముల షుగరు, 2 గ్రాముల మాంసకృత్తులు, ఇతర విటమిన్లు వగైరా ఉన్నాయి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే విష దోషాలను నివారించే రసాయనం బొప్పాయిలో ఇంకా అధికంగా ఉంటుంది. అందుకనే వండకుండా తినే సలాడుల్లో బొప్పాయిని, టమోటాని కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
మలబద్దత, మొలల వ్యాధుల్లో బొప్పాయి పండుని తప్పనిసరిగా రోజూ తింటూ ఉంటే కాల విరేచమ్నం అయ్యే అవకాశం ఉంది. పచ్చి బొప్పాయకాయ బాలింతలకు పాలు పెరిగేలా చేస్తుంది. పండు కూడా తినవచ్చు. బొప్పాయి జ్యూసు తాగవచ్చు. పుచ్చకాయ, అరటిపండు, సపోటా, పైన్‌యాపిల్లాంటి ఇతర పండ్లతో బొప్పాయిని కూడా కలిపి తింటూ ఉంటే మేలు చేస్తుంది. బొప్పాయి జ్యూసులో మిరియాల పొడి, నిమ్మరసం తగినంత కలిపి తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
ఎక్కువ పీచు ఉన్న (డైటరీ ఫైబర్) కూరగాయలు బీర, పొట్ల, సొర, ముల్లంగి, కేరట్, కీరదోస లాంటి వాటి ముక్కలతోపాటు బొప్పాయి పండు ముక్కలు కూడా కలిపి పెరుగు వేసుకుని, కొత్తిమీర, ఉల్లి, టమోటాలు రుచి కోసం చేర్చి తాళింపు పెట్టుకుంటే కమ్మని పెరుగుపచ్చడి తయారౌతుంది. దీన్ని అన్నంతో కలిపి, లేదా విడిగా కూడా తినవచ్చు. షుగరు వ్యాధిలో గ్లూకోజు రక్తంలో తగ్గటానికి ఈ సలాద్ మంచి ఉపాయం. ఇది తిని, ఇడ్లీ అటు, పూరి, ఉప్మా వగైరా టిఫిన్లు మానేస్తే షుగరు త్వరగా తగ్గుతుంది. టిఫినే్ల సగం అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రక్తంలో కొవ్వు తగ్గటానికి, షుగరు తగ్గటానికి ఇది మంచి ఉపాయం.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com