S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అప్పుడైతే కుంగుబాటు తక్కువ ( విజ్ఞానం)

చలిచలిగా, పొడిపొడిగా ఉండే వసంత, శీతాకాలంలో వాతావరణం చాలామందికి కాస్తంత చిరాకుగానే ఉంటుంది. కానీ ఆ కాలంలో ప్రసవించిన బాలింతలకు మాత్రం ఆ సమయం ఎంతో మంచిదని తాజా అధ్యయనం చెబుతోంది. సాధారణంగా ప్రసవించిన తరువాత చాలామంది మహిళలు ఒకరకమైన కుంగుబాటుకు గురవుతారు. దానినే ‘బేబీ బ్లూ’గా పిలుస్తారు. బాగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు దగ్గరగా ఉంటూ బాలింతలతో ఎక్కువ సమయం గడిపితేనే వారు కోలుకోవడం మామూలే. ప్రతి పదిమంది బాలింతల్లో ఒకరు ఇలా కుంగుబాటుకు గురవడం సాధారణం. మానసికంగా వారికి ధైర్యవచనాలు చెప్పి తేరుకునేలా చేయడం పరిపాటి. మిగతా రోజుల్లో ప్రసవించినవారికన్నా వసంతకాలం, శీతాకాలంలో ప్రసవించినవారు ఇలా కుంగుబాటుకు గురవడం తక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రసవం తరువాత బాలింతల్లో మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు ఏమిటి కారణం అన్న దానిపై పరిశోధనలు చేస్తున్నామని, వారిని ఆరోగ్యవంతులుగా ఉంచడం ఎలా అన్నదానిపై తమ దృష్టి ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు అనుబంధంగా పనిచేసే బ్రిగ్‌హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జీ ఝౌ చెప్పారు. ఇంటికో, హాస్పిటల్‌కో గర్భిణులు ఎక్కువకాలం పరిమితమైపోయి ఉంటారు. తాము ఒంటరివారమన్న భావన వారిలో పేరుకుపోతుంది. అదే శీతాకాలం లేదా వసంతకాలంలో అయితే వాతావరణం వల్ల సెలవులు, కుటుంబ సభ్యులు బయటకి వెళ్లడం తగ్గుతుంది. వారితో ఎక్కువ సేపు గడిపే అవకాశం గర్భిణులకు ఉంటుంది. ఫలితంగా వారు ప్రసవం తరువాత కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయని డాక్టర్ జీ అంటున్నారు. ఇలాంటి మరికొన్ని సిద్ధాంతాలు తమ పరిశోధనలతో రూపుదిద్దుకుంటున్నాయని జీ అంటున్నారు. విటమిన్ డి లోపం వారిని ఎక్కువగా వేధిస్తుందని, ఎక్కువకాలం సూర్యరశ్మి తగలకుండా ఉండటం వల్ల ఈ కుంగుబాటుకు దారితీస్తుందని కూడా వారు భావిస్తున్నారు. భారీకాయంతో ఉండే గర్భిణులు, నిర్ణీతకాల పరిమితికన్నా ముందే ప్రసవించినవారు తొందరగా కుంగుబాటుకు గురవుతారని వారి అధ్యయనంలో తేలింది. ప్రసవించిన మహిళల్లో కనీసం పదిశాతం మంది కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. విచారం, విశ్రాంతి లేదన్న భావన, ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఈ కుంగుబాటుకు లక్షణాలు. ప్రసవం తరువాత బాలింతల్లో హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు, మానసిక పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. జూన్ 2015, ఆగస్టు 2017 మధ్యకాలంలో ప్రసవించిన 20,169 మంది మహిళలకు సంబంధించిన వైద్య నివేదికలను ఈ పరిశోధక బృందం పరిశీలించింది. వీరిలో 817 మంది కుంగుబాటుకు గురైనారని తేలింది. అయితే శీతాకాలంలో, వసంతకాలంలో ప్రసవించిన మహిళలు ఎందుకు ఎక్కువగా కుంగుబాటుకు గురవడం లేదన్నది ఇథమిద్ధంగా తేలలేదు. అయితే వారు ఎక్కువసేపు నవజాత శిశువు, కుటుంబ సభ్యులతో కలసి ఉండే అవకాశం ఆ సీజన్‌లలో ఉండటం ఒక కారణం అయి ఉండవచ్చన్నది వారి అంచనా. సాధారణంగా ప్రసవం తరువాత బాలింతలు రెండు వారాల మేరకు కుంగుబాటుకు గురవుతుంటారు. ఆసమయంలో తగిన చికిత్స చేయకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా పరిణమిస్తుంది. ఈ పరిశోధనల్లో మరో విషయం తేలింది. పిల్లలు పుట్టిన తరువాత ప్రతి 25మంది తండ్రుల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారట. ఎక్కువకాలం గర్భం ధరించి ఉన్న మహిళల్లో కుంగుబాటుకు గురవడం తక్కువని తేలింది. ప్రపంచంలో మిగతా జాతుల మహిళల్లోకన్నా కకాసియన్ మహిళల్లో కుంగుబాటుకు గురవడం చాలా తక్కువని ఈ అధ్యయనంలో తేలిన మరో అశం. నిజానికి ఏ తరహాలో ప్రసవం జరిగిందన్నది ఇక్కడ ప్రధానం కాదు. తాజా అధ్యయనం ఫలితాలను బోస్టన్‌లో ఇటీవల జరిగిన అనస్థీషియాలజీ వార్షిక సదస్సులో చర్చించారు.

ఎస్.కె.ఆర్.