S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రియో హార్బర్

చూడచక్కని రాతిగుట్టలతో పర్వత శ్రేణుల మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవు రియో. ఇక్కడ మైలు పొడవున పర్వతాల నడుమ వున్న ఖాళీ ప్రదేశం నుంచి సముద్రం 18 మైళ్ల లోపలకు చొచ్చుకు వచ్చింది. 12 మైళ్ల వెడల్పుతో ఉండే ఈ అఖాతం ఎంతో లోతైంది. ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందిన నౌకలు సైతం సురక్షితంగా సునాయాసంగా రియో హార్బర్‌లో లంగరేస్తాయి.
సుగర్‌లోఫ్, హంచ్ బ్యాక్‌లుగా ఖ్యాతిగాంచిన రెండు పర్వతాలు హార్బర్‌కు ‘కొండ’ గుర్తులు. ఒకటి 1296 అడుగులు. రెండోది 2310 అడుగుల ఎత్తు ఉంటాయి. నీటిలోంచి పైకి పొడుచుకు వచ్చినట్లుండే సుగర్‌లోఫ్‌కు కేబల్ కార్ మార్గాన్ని నిర్మించారు. దగ్గర్లోనే ఉండే హంచ్ బ్యాక్ శిఖరం మీద 1913లో వందడుగుల క్రీస్తు విగ్రహం నెలకొల్పారు. పోర్చుగీసు అనే్వషకులు 1500 సం.లోనే రియోను గుర్తించారు. కాని వారు దీన్ని ఓ నదీ ముఖ ద్వారంగా భ్రమపడి రియో డిజెనీ (జనవరి నది) అని పేరు పెట్టారు. జనవరిలో అక్కడకు చేరుకున్నందున అందుకు గుర్తుగా అలా పిలిచారు. పర్యాటకులకు ఇదొక స్వర్గ్ధామం. ఇక్కడ లభించని విలాసాలు లేవు. ప్రతి ఫిబ్రవరిలో కార్నివాల్ జరుగుతుంది. ప్రకృతి, ఆధునికత రెండూ కలగలసిన వింత ఇది.

-బి.మాన్‌సింగ్ నాయక్