S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాకీ టస్

ఈమధ్య ఓ ఇద్దరు మిత్రులు కలిశారు. వాళ్లిద్దరు న్యాయవాదులే. నేనే న్యాయవాద వృత్తిని వదిలి న్యాయమూర్తి పదవిలోకి వెళ్లిపోయాను. వాళ్లు న్యాయవాద వృత్తిలో చేరి బహుశా ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయేమో. అయినా ఈ మధ్య ఓ గమ్మతె్తైన సంభాషణ జరిగింది.
‘మీ ప్రాక్టీస్ చేస్తున్నారా?’ ఇది ప్రశ్న. ఈ ప్రశ్నని నేను వేశాను. వాళ్లిద్దరు కూడా వేసుకున్నారు. చాలా రోజుల తరువాత కలిశాం కాబట్టి ఈ ప్రశ్న వేసుకున్నారా అని ఆలోచించాను. కాని కాదు.
న్యాయవాద మిత్రులు, డాక్టర్లూ కలిసినప్పుడు ఈ ప్రశ్న సర్వసాధారణంగా వస్తుంది.
అంటే వాళ్లు ముప్పై, నలభై సంవత్సరాలు దాటిన తరువాత కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలా..?
అవును ఈ రెండు వృత్తుల్లో వున్న వ్యక్తులని పని చేస్తున్నారా? అని అడగరు. ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ ఎలా ఉందీ అని అడుగుతారు. కొత్తగా ఈ వృత్తుల్లో చేరిన వాళ్లనే కాదు. చాలాకాలం నుంచి ఆ వృత్తుల్లో వున్న వ్యక్తులని ఈ ప్రశే్న వేస్తూ ఉంటారు. వాళ్ల అనుభవం ఎంత వున్నప్పటికీ ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది.
ప్రాక్టీస్ అంటే నిరంతర సాధనగా మనం అనుకోవచ్చు. చట్టం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. శాసనాల వ్యాఖ్యానాలు కూడా ఎప్పుడు ఒకే మాదిరిగా వుండవు. అవి నిరంతరం మారుతూ ఉంటాయి.
వైద్యశాస్తమ్రూ అంతే! అది ఎప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది. కొత్తకొత్త విషయాలు కనుక్కోబడతాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి.
ఈ భావన (కానె్సప్ట్) మన జీవితాలకి అన్వయించుకుంటే మనమూ పురోగమిస్తాం. ఓ గాయకుడు ఎంతో ప్రాక్టీస్ చేసి గానీ కచేరీకి రాడు. ఆటగాడూ అంతే! నిరంతర సాధన.
ఈ సాధన ఏ కొందరికో పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది.
మనం ఏ వృత్తిలో వున్నా ఈ సాధన అవసరమే! ఎందుకంటే ప్రతి వృత్తిలో కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి.
అందుకే సాధన అవసరం. నిరంతర అధ్యయనం ఇంకా అవసరం. నేర్చుకోవాలన్న తపన మరీమరీ అవసరం.
పరిపూర్ణత అనేది ఎవరికీ సాధ్యంకాదు. కనీసం అందరికీ సాధ్యం కాదు. కానీ వున్నంతలో కొంచెం మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అందరికన్నా లబ్ధి పొందేది ఆ సాధన చేసే వ్యక్తులే!

- జింబో 94404 83001