S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తీర్మానాలు - ప్రణాళికలు

కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఏడు నెలలు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది ఐదు నెలలే. ఇది గుర్తుకు తెచ్చుకోగానే అయ్యో అన్పిస్తుంది.
కొత్త సంవత్సరం వస్తుందనగానే చాలామంది కొత్తకొత్త తీర్మానాలు చేస్తుంటారు. కొత్త సంవత్సరంలో వాటిని సాధించాలని అనుకుంటారు. గత సంవత్సరం కన్నా ఈ కొత్త సంవత్సరం మరింత విజయవంతంగా కొనసాగాలని కాంక్షిస్తారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్లు నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు ప్రయాణం చేయడం మర్చిపోతారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకే జరుగుతుంది.
కొత్త పుస్తకాలు ప్రచురించాలని కొంతమంది ప్రణాళికలు రచిస్తే మరి కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఇంకా ఏవో ఏవో పనులు చేయాలని అనుకుంటారు. వాటిని మరిచిపోతారు. వాటి వైపు దృష్టి సారించరు. వాటివైపు దృష్టి సారిస్తే కొంత ఫలితం ఉంటుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? మళ్లీ మనం ఏర్పరచుకున్న తీర్మానాల వైపు ఎలా వెళ్లాలి. వాటిని ఎలా సాధించాలి?
ఆరునెలలో, ఏడు నెలలో గడిచిపోయాయి. ఫర్వాలేదు. ఇంకో ఆరు నెలలో, ఐదు నెలలో సమయం ఉంది. కొత్త సంవత్సరంలో మనం ఏర్పరచుకున్న గమ్యాల వైపు ప్రయాణం చేయడానికి చాలా సమయం ఉంది. మనం అనుకున్నవి సాధించే అవకాశం చాలా ఉంది.
* మనం ఆరేడు నెలల్లో అనుకున్నవి ఏవీ సాధించలేదు. అయితే ఏమిటీ? మన లక్ష్యాలు గడిచిన రోజుల గురించి కాదు. అంటే గతం నుంచి కాదు. భవిష్యత్తు గురించి. అందుకని గతం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకూడదు. భవిష్యత్తు వైపు దృష్టి సారించాలి.
* ఓ పుస్తకం ప్రచురిద్దామని అనుకుంటే అది ఎప్పటిలోగా ప్రచురిద్దాం. ఈ విషయంలో స్పష్టత ఉండాలి. అదే విధంగా బరువు తగ్గాలని అనుకుంటే ఎంత బరువు తగ్గాలి. ఎంతకాలంలో తగ్గాలి. ఈ విషయం గురించి ఓ ఆలోచన వుంటే మనం అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
* మన ఆత్మీయులకి మన లక్ష్యం చెప్పాలి. మనం అనుకున్న సమయంలో మనం ఆ లక్ష్యం వైపు వెళ్లే విధంగా వాళ్లు మనల్ని ప్రోత్సహిస్తారు. ఆ విషయాన్ని మనకు గుర్తుచేస్తూ ఉంటారు. ఈ ఎంపిక చాలా మంచిగా ఉండాలి. వాళ్లు మనల్ని ప్రశ్నించే విధంగా, నిరుత్సాహపరిచే వ్యక్తులుగా ఉండకూడదు.
* అన్నింటికన్నా ముఖ్యమైనది - మనం ఈ రాబోయే కాలంలో ఏం చేయాలని అనుకుంటున్నామో వాటిని రాసి ఉంచి, అది మనకు తరచుగా కన్పించే విధంగా ఉంచుకోవాలి.
కొత్త సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఐదారు నెలలు ఉంది.
గతంతో పని లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించండి. పురోగతి ఉంటుంది.

- జింబో 94404 83001