S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముఖంలోంచి మూత్ర విసర్జన

విదేశాల్లో ఇష్టంగా తినే ఎండ్రకాయలకు మనుషుల్లాగానే మెదడు, నాడీ వ్యవస్థ, ఉదరాలు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ ఉంటాయి. వీటికి ఉండే రెండు చేతుల్లాంటి ‘పంజా’లు విభిన్న సైజుల్లో ఉంటాయి. ఒకదానితో ఆహారాన్ని ఒడిసిపట్టుకుని నలిపేస్తుంది. మరోదానితో ముక్కలుగా చేసి తింటుంది. వీటికి రెండు ఉదరాలు ఉంటాయి. మొదటిదానిలో పళ్లుంటాయి. ఆహారాన్ని అది చిన్నచిన్న ముక్కలుగా చేస్తే రెండో ఉదరంలో ఆహారం జీర్ణమవుతుంది. దీని ముఖంపై కళ్లకింద ఉన్న రెండు రంధ్రాల ద్వారా అవి మూత్రాన్ని విసర్జిస్తాయి. ముఖ్యంగా జతకట్టే సమయంలోను, పరస్పరం ‘కమ్యూనికేషన్’ ఇవ్వడానికి ఇలా చేస్తాయి. వివిధ జాతులను బట్టి 8 సెంటీమీటర్ల నుంచి దాదాపు మూడున్నర అడుగుల పొడవున ఇవి పెరుగుతాయి. శరీరంపై ఉండే ‘షెల్’ను ఏడాదికోసారి విడిచిపెట్టి తన పరిమాణానికి అనుగుణంగా కొత్త ‘షెల్’ను పెంచుకుంటాయి. వీటిని బతికుండగా వేడినీళ్లలో పడేసినా అవి బాధను వ్యక్తం చేయలేవు. వాటికి వోకల్‌కార్డ్స్ లేకపోవడమే అందుకు కారణం. అలా వేణ్ణీళ్లలో వేసినప్పుడు వాటి శరీరంలోంచి గాలి బయటకు వస్తుందంతే.