S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగోలీ చిన్నోడి రికార్డు..ముగ్గూ మురిపెం

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. సకాలంలో దానిని గుర్తించగలిగి, ఆ రంగంలో కృషి చేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. సరిగ్గా దీనే్న చేసి చూపించాడు మధ్యప్రదేశ్‌కి చెందిన రాహుల్ స్వామి. రంగోలీ ఆర్ట్‌లో సిద్ధహస్తుడిగా పేరు గడించిన రాహుల్ క్షణాల్లో రకరకాల రంగులతో కళ్లు మిరుమిట్లు గొలిపే ముగ్గులను వేసి చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తాడు. తనకి పదిహేడేళ్ల వయసు ఉన్నప్పటి నుండి రాహుల్ ఈ కళలో మునిగి తేలుతున్నాడు. అతను రకరకాల డిజైన్లలో వేసే ముగ్గులు రంగోలీ కళలో చేయి తిరిగిన ఆడవారిని కూడా సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంటాయి.
ఆడవారు గానీ, మగవారు కానీ రంగోలీ డిజైన్లు వేస్తే వేయవచ్చు. కానీ రాహుల్ అంత వేగంగా వేయలేరు. ఈ విషయాన్ని గుర్తించబట్టే అతని నైపుణ్యానికి మెచ్చి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అతని ప్రతిభకు పట్టం గడుతూ తమ పుస్తకంలో అతని పేరును నమోదు చేశారు. అత్యంత వేగంగా రంగోలీ డిజైన్లు వేసే ఆర్టిస్టు ఇండియా మొత్తానికి అతనే. అతను కేవలం పదంటే పదే నిముషాల్లో పదడుగుల స్థలంలో పదమూడు కేజీల ముగ్గును ఉపయోగించి అత్యంత వేగంగా కళ్లు చెదిరే రంగోలీ డిజైన్ వేస్తాడు. అతను ఇప్పటి వరకు పది వేల వరకు రకరకాల రంగోలీ డిజైన్లను సృష్టించాడు. మధ్యప్రదేశ్‌లోని ఏ గుడి దగ్గర తిరునాళ్లు, ఉత్సవాలు జరిగినా, ఏ ఇనిస్టిట్యూట్ వద్ద వేడుకలు జరిగినా ఆయా యాజమాన్యాలు రాహుల్‌ని పిలిపించి, అతనితో అద్భుతమైన రంగోలీ డిజైన్లు వేయించుకుంటాయి ఆయా ప్రాంగణాల్లో. దాంతో ఆ వేదికలకే సరికొత్త కళ వచ్చి చేరుతుంది. అలాగే టెలివిజన్ షోలు జరిగే ప్రాంతాల్లో కూడా అతని రంగోలీ డిజైన్ ఉండాల్సిందే. వారు కూడా అతని పనితనాన్ని భేషుగ్గా ఉపయోగించుకుంటు ఉంటాయి. అతను ఇరవై నాలుగు వేల చదరపు అడుగుల స్థలంలో పదమూడు గంటల్లో ఓహో అనిపించే అద్భుత డిజైన్‌తో రంగోలీని తీర్చిదిద్ది చూపరులతో భేష్ అనిపించుకున్నాడు. ఇరవై నాలుగు వేల చదరపు అడుగులు అంటే ఒక పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు అంత స్థలం.
రాహుల్ తన కళ ద్వారా ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఒక సెలబ్రిటీగా ప్రాచుర్యం తెచ్చుకున్నాడు. అతను తన టెక్నిక్‌ని ఫ్రీహ్యాండ్ గలీచా రంగోలీగా పేర్కొంటాడు. రంగోలీ డిజైన్ వేయాలంటే వేయాలన్న పద్ధతిలో కాకుండా రాహుల్ తాను రంగోలీ వేయాల్సిన ప్రదేశాన్ని, అక్కడి వాతావరణాన్ని అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి అప్పుడు రంగోలీ డిజైన్ వేస్తాడు. అలాగే ఏదో ఒక రంగోలీ డిజైన్ వేయడం కాకుండా మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ఒక మెసేజ్ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే జాతీయ నాయకులు, మన దేశంలోని చారిత్రక ప్రదేశాలు కూడా అతని రంగోలీల్లో కనిపిస్తుంటాయి.
తాను ఎప్పటికైనా రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలంలో రంగోలీ డిజైన్ వేసి గిన్నిస్‌కి ఎక్కడమే లక్ష్యంగా అతను చెబుతున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్