S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సగం పాడుబడిన ఇంట్లో ఉండవచ్చా?

వీరాంజనేయులు (విస్సన్నపేట)
ప్రశ్న: మేం ఉంటున్న ఇల్లు కొంత భాగం పాడుబడి కాలిపోయింది. ఆ ఇంట్లో ఉండవచ్చా? ఇంటి పరిస్థితి ఆ విధంగా ఉండటంతో మాకు కలిసిరావటంలేదు.
జ: సగభాగం కూలిపోయిన ఇంటిలో నివసించకూడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ముందుగా మీరు వేరే ఇంటికి అద్దెకు వెళ్లి మీ ఇంటి మిగిలిన భాగాన్ని కూడా కూల్చివేయండి. లేకపోతే ఆ దోషాలను మీరు అనుభవించవలసి వస్తుంది. అలాగే కొన్ని దోష నివారణలు ఉన్నాయి. నివారణ చేయించుకోండి.
కె.రామారావు (నిజామాబాద్)
ప్రశ్న: నేను రాజకీయాలలో చాలాకాలంగా ఉంటున్నాను. ఐతే ఎంత శ్రమించినా ప్రతిఫలం దక్కడంలేదు. రాజకీయాలలో ఉన్నత స్థితికి రావడానికి వాస్తుపరమైన సలహాలు సూచించగలరు.
జ: రాజకీయపరంగా ఎదగడానికి పడమర వాయవ్య దిశ చాలా బాగా యోగిస్తుంది. అలాగే మీరు నివసిస్తున్న ఇంటి వాస్తు కూడా ఆధారపడి ఉంటుంది.
రుషి (కందుకూరు)
ప్రశ్న: మేము నివసిస్తున్న ఇంటికి నైరుతిలో మెట్లు.. ఆ మెట్ల కిందనే టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇలాగే టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నారు. సమస్య తీరే మార్గం చెప్పండి.
జ: ముందుగా నైరుతిలోగల టాయిలెట్స్‌ని తీసి పడమర/ దక్షిణ మధ్యభాగంలోకి వచ్చే విధంగా మార్చుకోండి. మీ సమస్యలు తీరుతాయి.
దామోదరరెడ్డి (రంగారెడ్డి జిల్లా)
ప్రశ్న: నూతనంగా ఒక గృహ నిర్మాణం మొదలుపెట్టాం. కానీ మా సమస్య పూజ గది. ఈ పూజగది బాత్‌రూమ్ గోడను ఆనుకొని నిర్మిస్తున్నాం. అలా ఉండవచ్చా?
జ: చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఇదే. స్థలం లేకపోవడం చేతనో/ ఏదో కారణం చేతనో పూజగదిని బాత్‌రూంను ఆనించి నిర్మిస్తున్నారు. దీనివల్ల చేసిన పూజలకు ప్రతిఫలం దక్కదు. అలాగే అనుకోకుండా ఏదో ఒక సమస్య వస్తుంది. మీరు పూజగదిని తూర్పు మధ్యభాగంలో వంటగది తర్వాత నిర్మించుకోండి.
లోహిత్‌కుమార్ (రఘునాథపల్లి)
ప్రశ్న: మేం వ్యాపారం చేస్తున్న స్థలం దిక్కులు తిరిగి ఉంటుంది. అనగా తూర్పు దిశ అనుకున్నది ఆగ్నేయ దిశ అవడం జరిగింది. అలాగే ఈశాన్యంలో మెట్లు ఎక్కి మేము రెండవ ఫ్లోర్‌లోకి వెళ్లవలసి వస్తున్నది. మేం ఇందులో రెండు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. అన్నీ సమస్యలే. దీనిలో నుండి మేం బయట పడాలి అన్నా ఆ పని జరగడం లేదు.
జ: దిక్కులు తిరిగి వున్న స్థలంలో వ్యాపారం చేయడం.. అది కూడా ఆగ్నేయ దిశ రోడ్డు కలిగి ఉన్నటువంటి స్థలంలో అంటే తప్పకుండా మీ వ్యాపారంలో భాగస్వాములు ఉంటే ఈపాటికే అందరూ విడిపోయి ఉంటారు. అలాగే నష్టాలు రావడం, చివరకు అప్పుల పాలు కావడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా పెద్ద తప్పు ఈశాన్యంలో మెట్లు అంటే ఇంకా చాలా ఘోరం. దీనివల్ల మీ వ్యాపారం మూసివేయవలసిన పరిస్థితి వస్తుంది. ముందుగా మీరు అక్కడ నుండి బయటకు రావడానికి సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి. అవి చేసుకొని బయటకు రండి. మీ వ్యాపారం తిరిగి లాభాల బాట పడుతుంది. *

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28