S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనుకూలం

జీవితం మనం అనుకున్నట్లు సాగదు. కొన్ని పరిస్థితులు మనకు ఇష్టం లేని పనిలోకి నెట్టుతాయి.
పనె్నండు సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నాను. ఆ కోర్టులో చాలా పని ఉంది. అది సీనియర్ సివిల్ జడ్జి మరియు అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులతోపాటూ వివాహాల కేసులు కూడా ఆ కోర్టులో వున్నాయి. రకరకాల కేసులు. అప్పుడు తెలుగులో తీర్పులు చెప్పడం ప్రారంభించాను. ప్రజల నుంచి విశేషమైన ప్రతిస్పందన లభించింది.
అక్కడ పని చేయడం చాలా ఉత్సాహంగా ఉండింది. అప్పుడు కొత్తగా ప్రతి జిల్లాలో న్యాయసేవాధికార సంస్థలకి కార్యదర్శి ఉద్యోగాలను సృష్టించారు.
కోర్టుల్లో పని భారం తగ్గించడానికి కోర్టు వెలుపల కేసులని పరిష్కరించడానికి ఉద్దేశించి ఈ కార్యదర్శి ఉద్యోగాన్ని సృష్టించారు. మంచి న్యాయమూర్తులు ఈ పోస్టుల్లో వుండాలన్న ఉద్దేశంతో కొంతమందిని ఈ ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. అందులో నేనొక్కడిని.
రకరకాల కేసులని చూస్తున్న నాకు అది ఇష్టం కలిగించలేదు. కష్టం కలిగించింది. ఎందుకంటే అక్కడ పని తక్కువ. న్యాయమూర్తిలా ఉండదు. ఆ పదవి ఓ యాక్టివిస్ట్‌లా ఉంటుంది. నన్ను ఉన్న కోర్టులోనే కొనసాగించమని హైకోర్టు న్యాయమూర్తులని కోరాను. కానీ ఫలితం లేకపోయింది. నిజామాబాద్‌లోనే నన్ను పోస్ట్ చేశారు. మెడ మీద పడిన తరువాత ఏం చేస్తాం పని చేయక తప్పదు.
కోర్టులో వున్నప్పుడు రాత్రి కేసులని చదువుకొని ఉదయాన స్టెనో వచ్చేవాడు. తీర్పులు చెప్పే పని ఉండేది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆఫీసుకి వెళ్లినప్పుడు మాత్రమే పని ఉండేది. ఒంటరిగా ఉండేవాడిని. ఏం చెయ్యాలో తోచేది కాదు. స్టెనో లేడు కానీ తెలుగూ, ఇంగ్లీషు తెలిసిన ఇద్దరు టైపిస్టులు మా ఆఫీసులో ఉండేవాళ్లు.
అంతే! ఉదయం తెలుగు ‘లా’ పుస్తకం సాయంత్రం ఇంగ్లీషులో ‘లా’ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. ఆ సంవత్సరంలో పనె్నండు పుస్తకాలు రాశాను. కోర్టులో వుంటే ఒక్క పుస్తకం మాత్రమే రాయగలిగేవాణ్ని. ఆ సమయాన్ని ఆ విధంగా సద్వినియోగపరచుకున్నాను. ఆ తరువాత కొంతకాలానికి కోర్టుకి బదిలీ అయ్యాను. ఈ పుస్తకాలు రాసే వేగం తగ్గిపోతుంది.
మనకు ఇష్టంలేని పరిస్థితులు ఏర్పడితే వాటిని అధిగమించి మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మలుచుకోవాలి.
అప్పుడు బాధ కన్నా సంతోషం ఎక్కువగా ఉంటుంది.

*
- జింబో

94404 83001

- జింబో 94404 83001