S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/05/2017 - 21:53

వ్యావహారిక భాషలో వ్రాయబడిన కన్యాశుల్కం నాటకంలోగల ఇంగ్లీషు వాక్యాలు సంస్కృత వాక్యాలు తత్వాలు నేటితరంవారికి ఏమీ అవగాహన కావు. అవగాహన కాని ఘట్టాలు ఆ నాటకంలో ఇంకా ఉన్నాయి. వరవిక్రయ నాటకానికి కూడా కన్యాశుల్కం నాటకానికి ఇచ్చిన గౌరవం ఇవ్వాలి.

03/05/2017 - 21:52

తెలతెలవారుతోంది పల్లె కాశ్మీరం!
రెప్పలు తెరిచిన పడుచు వేకువ.. చీకటి పాయలు చిక్కులు దువ్వుతోంది!
లేమంచు స్నానం, ఆపై చలిమంటల కుంపట్లు..
కురులకు సాంబ్రాణి ధూపంలా!
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సుప్రభాతంకన్నా ముందే మంద్రస్థాయిలో
వాకిలి ముందు అమ్మ శుభ్రంచేస్తున్న పొరక్కట్ట గాత్రం వినిపిస్తుంది!
మబ్బుచాటు మాటువేసి చురచురచూస్తున్న

03/05/2017 - 21:50

నేను ఒంటరిగాడినే
ఒక్కడిగా ఉన్నప్పుడు
గుంపులోని జనంలో
నేనెప్పుడూ అందరిని

బృందగానంలో
నా గాత్రం కలిస్తే
నా గళం ఒక్కటి కాదు
అది కోటి గొంతుకల
కమనీయ గానం

వీణలోని తంత్రులవలే
అందరిలో కలిసున్నప్పుడు
నా నాదం
అమృత వాయిద్యం

03/05/2017 - 21:48

ఇతనా బడా షహీన్ షహర్‌ల ఇల్లేమీ లేనివాణ్ని
అడ్రస్ అంటూ లేనివాణ్ని
కాందిశీకున్ని.. శరణార్థిని
నిత్య యాత్రికుడ్ని.. నిరంతర సంచారిని

03/05/2017 - 21:47

‘అడవి’ నవల
రచయిత: వసంతరావు దేశ్‌పాండే
పేజీలు: 294, వెల: రు.150/-
ప్రతులకు: వసంతరావు దేశ్‌పాండే,
9-52, శ్రీనిలయం,
టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్, 5045001

02/26/2017 - 21:53

కొన్ని రాత్రులంతే నిద్రను గ్రద్దల్లా తన్నుకుపోయి
గుండెను తల నరాల్లోకి లాగి ఉరాలు కొడుతూ
లబ్ డబ్‌ల లయ తప్పించి అపస్వరాలకు
ఆజ్యం పోస్తుంటాయ్
గీరుకుపోయిన చోటనే కారం చల్లి
కొరివితో బొబ్బలకు లేపనాలు రాస్తుంటాయ్

02/26/2017 - 21:52

సాహిత్యం సమాజంలో తలెత్తిన సమస్త వైరుధ్యాల్ని, వైవిధ్యాల్ని సంక్లిష్టతలను, పట్టుకోగలుగుతుందా? సామాన్య జనం ఆనందంగా, సరళంగా జీవితాన్ని అనుభవించే తీరుతెన్నులందిస్తుందా? బహుళ తాత్త్విక దృష్టితో, సాహిత్యం నిర్మలమైన అకలుషితమైన ఆలోచనలనిస్తూ, పెట్టుబడిదారీ దోపిడీ విధానాలను ఎత్తిచూపుతూ ఎండగట్టే ప్రయత్నం చేస్తుందా? సామాన్యుల హదృయ స్పందనలు, ఆక్రోశాలు నమోదు చేయగలుగుతుందా?

02/26/2017 - 21:51

ఇల్లు కదలదు
మనుషుల కాళ్ళతో
బయటికి వెళ్లి వస్తుంది.
చక్రాలు లేకున్నా
దేశాలు సంచరిస్తుంది.
ప్రపంచాన్ని
ముక్కలుగా చేసి
ఇంటికి తీసుకొస్తుంది.
ఎన్ని కవితలు రాసినా
ఇంట్లో కొత్తవాటికి చోటిస్తుంది.

ఇల్లు అమ్మలాంటిది
ఆమె కొంగు పొడవు
రెండు గజాలే కావొచ్చు
కాని అది అనంతమైన
మమతల పతాకంలా వుంటుంది.

02/26/2017 - 21:49

ఎంత చీకటిని రెప్పల మాటున దాచేదో తెలియదు గానీ
నిచ్చె మల్లి నిర్మలత్వాన్నీ, పారిజాత పరిమళాన్నీ
ఇంటి ముందు వేసే ముగ్గులో నింపి
ఉదయాలను స్వచ్ఛంగా చిత్రించేది

దిగమింగిన కన్నీళ్లెప్పుడూ
దుఃఖమై కురవడం చూడలేదు కానీ
కల్లోలాన్ని దాచిన గాంభీర్యతలో
మహా సముద్రంలా కనిపించేది

02/26/2017 - 21:47

భారతదేశంలో బ్రిటీష్ పాలనాకాలంలో, అందరు అధికారులూ పరాయి పాలకుల్లాగా ప్రవర్తించలేదు. తమ తమ ఉద్యోగ విధుల పరంగా గాని, ఇతరత్రా అభినివేశంతోగాని, మన ప్రాచీన నాగరికతను, సంస్కృతినీ త్రవ్వితీశారు! వ్యవసాయ, ఆర్థికాభివృద్ధులకు ఎనలేని కృషి చేశారు. దేశ సాహిత్య పెంపునకు తోడ్పడ్డారు! అప్పుడు వారే కనుక అలాంటి అవిశ్రాంత కృషి చేసి వుండకపోతే, ఇప్పటి దేశ పరిస్థితులెలా వుండేవో అనిపిస్తుంది.

Pages