S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/04/2016 - 07:38

కొలంబో, జనవరి 3: శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఎన్నికల్లో మాజీ కెప్టెన్, దేశ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ శాఖ మంత్రి అర్జున రణతుంగకు చేదు అనుభవం ఎదురైంది. తన సోదరుడు నిశాంత రణతుంగను అధ్యక్షుడిగా గెలిపించులేకపోయాడు. అంతేగాక, తాను ఉపాధ్యక్ష పదవికి స్వయంగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అతనిపై జయంత ధర్మదాస 22 ఓట్ల తేడాతో విజయభేరి మోగించాడు.

01/04/2016 - 07:37

సిడ్నీ, జనవరి 3: ఆస్ట్రేలియాతో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రెగ్ బ్రాత్‌వెయిట్ 85 పరుగులతో ఆదుకోకపోతే, విండీస్‌కు ఈ స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు వికెట్లు పడగొట్టడమేగాక, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.

01/04/2016 - 07:36

ముంబయి, జనవరి 3: చెన్నై ఓపెన్ టెన్నిస్ టో ర్నమెంట్‌లో భారత ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మ న్ మెయన్ డ్రాకు అర్హత సంపాదించాడు. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ వార్డ్‌తో సుమారు రెండున్నర గంట లు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో క్వాలిఫయ ర్‌లో అతను 2-6, 7-5, 6-4 తేడాతో విజయం సా ధించాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, మిగతా రెండు సెట్లలో ఎదురుదాడికి దిగి గెలవ డం విశేషం.

01/04/2016 - 07:36

ముంబయి, జనవరి 3: వెస్టిండీస్ క్రికెటర్లలో పోరాట పటిమ కొరవడిందని, వారు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీని ఇవ్వలేకపోతున్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ విమర్శించాడు.

01/04/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 3: భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని, అతను కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు అభిప్రాయపడ్డాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ అశ్విన్‌ను స్ట్రయిక్ బౌలర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించాడు. బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలను ప్రదర్శించగల సత్తా అతనికి ఉందని కితాబునిచ్చాడు.

01/04/2016 - 07:35

ముంబయి, జనవరి 3: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు అభిమానులు బ్రహ్మరథం పడతారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్య ప్రదర్శనతో ఒర్లీలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంలో శనివారం రాత్రి ఆరంభమైన పిబిఎల్‌కు ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

01/03/2016 - 05:43

కొత్త సంవత్సరం.. పైగా ఒలింపిక్స్ సంవత్సరం.. రియో డి జెనిరోలోని క్రీడాభిమానులు వారం రోజుల సంబరాలు జరుపుకోవడానికి ఇంతకంటే సందర్భం ఏం కావాలి? ఈఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకూ ఒలింపిక్స్ జరుగుతాయి. పలు కేంద్రాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం రియోలో ఎక్కడ చూసినా ఒలింపిక్ సంబరాలు కనిపిస్తున్నాయి.

01/03/2016 - 05:42

సిడ్నీ, జనవరి 2: వెస్టిండీస్‌తో ఆదివారం మొదలయ్యే మూడో టెస్టులో స్పిన్నర్ స్టెఫెన్ ఒకీఫ్ ఆడనున్నాడు. గాయపడిన పీటర్ సిడిల్ స్థానంలో స్పిన్నర్ ఒకీఫ్‌ను తీసుకోవడం మినహా, రెండో టెస్టులో విండీస్‌ను 177 పరుగుల తేడాతో ఓడించిన జట్టును యథాతథంగా మూడో టెస్టుకు కూడా కొనసాగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఒకీఫ్ చెరికతో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు.

01/03/2016 - 05:41

సిడ్నీ, జనవరి 2: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదంలో పడింది. మొదటి టెస్టును ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆతర్వాత రెండో టెస్టును 177 పరుగుల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో పటిష్టమైన ఇంగ్లాండ్‌కు ఈ జట్టు ఎంత వరకూ ఎదురునిలిస్తుందనేది అనుమానంగానే ఉంది.

01/03/2016 - 05:40

లక్నో, జనవరి 2: అంగవైకల్యాన్ని అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన అరుణిమ సిన్హా ఖాతాలో మరో శిఖరం చేరింది. అర్జెంటీనాలోని వౌంట్ అకొన్కగువా శిఖరాన్ని తాను అధిరోహించినట్టు అక్కడి నుంచి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. సముద్ర మట్టానికి 6,960 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తాను ఐదో శిఖరాన్ని పూర్తి చేశానని చెప్పింది.

Pages