క్రీడాభూమి

అరుణిమ ఖాతాలో వౌంట్ అకొన్కగువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 2: అంగవైకల్యాన్ని అధిగమించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన అరుణిమ సిన్హా ఖాతాలో మరో శిఖరం చేరింది. అర్జెంటీనాలోని వౌంట్ అకొన్కగువా శిఖరాన్ని తాను అధిరోహించినట్టు అక్కడి నుంచి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. సముద్ర మట్టానికి 6,960 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తాను ఐదో శిఖరాన్ని పూర్తి చేశానని చెప్పింది. ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలన్నదే తన లక్ష్యమని, వీటిలో ఇప్పటికే ఐదు పూర్తయ్యాయని పేర్కొంది. మరో రెండు కూడా పూర్తి చేశానని తెలిపింది.