S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/24/2016 - 02:53

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో భారత స్టార్ సానియా మీర్జా దూకుడు కొనసాగుతున్నది. రెండు వేర్వేరు విభాగాల్లో ఆమె ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి డ్రీమ్న్‌న్రు కొనసాగిస్తున్న సానియా రెండో రౌండ్‌లో ల్యుడ్మిలా కిచెనొక్, నదియా చికెనొక్ జోడీపై 6-2, 6-3 తేడాతో గెలుపొందింది.

01/24/2016 - 02:52

లక్నో, జనవరి 23: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ (యుపి) విజార్డ్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ 3-1 తేడాతో గెలిచింది. ఢిల్లీకి ఇది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండో విజయం. యుపి రెండు వరుస విజయాలను సాధించిన తర్వాత తొలిసారి ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ మొదటి క్వార్టర్ ఆటలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

01/24/2016 - 02:51

సిడ్నీ, జనవరి 23: నుంచి కోలుకోలేదు. దీనితో అతనికి బ్యాకప్‌గా ఉండేందుకు గుర్‌కీరత్ సింగ్ మాన్‌ను భారత జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనునాగ్ ఠాకూర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అందుబాటులో ఉండడని, అతని స్థానంలో రిషీ ధావన్‌నుఎంపిక చేశామని అతను పేర్కొన్నాడు.

01/24/2016 - 02:51

సిడ్నీ, జనవరి 23: ఆస్ట్రేలియ చేతిలో ‘వైట్‌వాష్’ ప్రమాదం నుంచి టీమిండియా తృటిలో బయటపడింది. మనీష్ పాండే అజేయ శతకంతో ఆదుకోవడంతో, రెండు బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో చివరిదైనా ఐదో వనే్డలో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌ను మాత్రం 1-4 తేడాతో కోల్పోయింది.

01/23/2016 - 03:09

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఐదో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమె శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో 6-1, 6-7, 6-0 సెట్ల తేడాతో 22 ఏళ్ల అన్‌సీడెడ్ క్రీడాకారిణి లారెన్ డేవిస్‌ను ఓడించి కెరీర్‌లో 600వ విజయాన్ని అందుకుంది.

01/23/2016 - 03:09

వెల్లింగ్టన్, జనవరి 22: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఆటగాడు కొరీ ఆండర్సన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించాడు. బ్యాటింగ్‌లో అతను విజృంభించి అజేయంగా 82 పరుగుల కెరీర్ బెస్టు స్కోరు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి రెండు వికెట్లు కైవసం చేసుకున్నాడు.

01/23/2016 - 03:08

సిడ్నీ, జనవరి 22: ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్ డేమ్యాచ్‌లలో ఘోరంగా పరాజయం పాలయిన టీమిండియా శనివారం ఇక్కడ జరిగే చివరివన్‌డేలోనైనా విజయం సాధించి వైట్‌వాష్ అవమానాన్ని తప్పించుకోవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్‌డేలలో మొదటి మూడు మ్యాచ్‌లలో 300కుపైగా పరుగులు చేసినప్పటికీ ధోనీ సేన పరాజయాలను తప్పించుకోలేక పోయింది.

01/23/2016 - 03:07

సిడ్నీ, జనవరి 22: భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా పిచ్‌లు స్వభావానికి భిన్నంగా బౌలర్లకు ఏమాత్రం అనుకూలించని విధంగా ఉండడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంతికి, బ్యాట్‌కు సరయిన పోటీ ఉండేలా చూడడం కోసం పిచ్‌లు ఇంతకు ముందుమాదిరి కాస్త పేస్, బౌన్స్ కలిగి ఉండాలని అభిప్రాయ పడ్డాడు.

01/23/2016 - 03:06

పెనాంగ్ (మలేసియా), జనవరి 22: మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు పివి.సింధు, కిదాంబి శ్రీకాంత్ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం వీరు ఇక్కడ తమతమ ఈవెంట్లలో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

01/23/2016 - 03:06

మెల్బోర్న్, జనవరి 22: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌శ్లామ్ మ్యాచ్‌లలో 300 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకు ఎక్కాడు.

Pages