S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/20/2016 - 18:45

శ్రీనగర్: ఇక్కడి జమ్ము రోడ్డులో శనివారం సిఆర్‌పిఎఫ్ జవాన్లు వెళుతున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులు జరపగా ఓ జవాన్ మరణించాడు. 12 మంది జవాన్లు గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ శిక్షణ సంస్థ భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ భవనంలో ఇంకా కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఉండిపోవడంతో జవాన్లు అక్కడ ఉగ్రవాదుల కోసం మాటువేశారు.

02/20/2016 - 16:22

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ విచారణకు వ్యక్తిగతం హాజరు కానక్కర్లేదని పటియాలా హౌస్ కోర్టు శనివారం ఊరట కలిగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. వ్యక్తిగత హాజరు నుంచి మరో ముగ్గురికి మినహాయింపు ఇస్తూ, ఈ కేసులో సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడాకు బెయిల్ మంజూరు చేసింది.

02/20/2016 - 12:01

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్ కులస్థుల ఆందోళన హర్యానాలో తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ రోజు రోహతక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకారులు రహదారులను నిర్బంధించారు. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరగడంతో ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా చేరుకుంటున్నారు. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నంలో నిన్న పోలీసులు కాల్పులు జరపగా, ముగ్గురు వ్యక్తులు మరణించడంతో అధికారులు సైన్యాన్ని రంగంలోకి దింపారు.

02/20/2016 - 03:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై బుధవారం పాటియాల హౌస్ కోర్టు కాంప్లెక్స్ వద్ద దాడి జరిగినప్పుడు ఆయన వంటిపై గాయాలయినట్లు ఆయన వైద్య పరీక్ష నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

02/20/2016 - 02:00

రాయ్‌బరేలీ, ఫిబ్రవరి 19: దేశ భక్తికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల నుంచి పాఠాలు నేర్చుకోవల్సిన అవసరం తనకు లేదని, దేశభక్తి అన్నది తన రక్తంలోనే ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జెఎన్‌యు వివాదంలో తనపై దేశ ద్రోహం ఆరోపణలు చేయడాన్ని శుక్రవారం ఆయన తీవ్రంగా ఖండించారు.‘ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఉంచి దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకులేదు.

02/20/2016 - 01:55

పాట్నా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జెఎన్‌యు వివాదంలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి శుక్రవారం మరింత తీవ్రమైంది. ఆర్థిక రంగంలో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం భావోద్వేగాలను రెచ్చగొడుతోందని, బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడమే పెద్ద నేరంగా చూస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌లు ఆరోపించారు.

02/20/2016 - 01:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జెఎన్‌యు వివాదం నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీకి కీలక పదవి దక్కకుండాపోయింది.కేంద్ర సమాచార కమిషన్(సిఐసి)లో కమిషనర్ల ఎంపికకు సంబంధించి జాబితాలో ఇప్పటి వరకూ బస్సీ పేరు ఉండేది. అయితే జెఎన్‌యులో ఆందోళనలు ఆపడంలోనూ, పాటియాల కోర్టు వద్ద ఘర్షణలు నివారించకుండా ఆయన ప్రేక్షక పాత్ర వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

02/20/2016 - 01:52

గౌహతి, ఫిబ్రవరి 19: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు కలిఖోపుల్ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గవర్నర్ రాజ్‌ఖోవా ఆయన చేత ప్రమాణం చేయించారు. పదకొండుమంది బిజెపి ఎమ్మెల్యేల వెలుపలి మద్దతుతో కలిఖో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. ఆయనకు మరో ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉంది. వీరందరూ కూడా కొత్త ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది.

02/20/2016 - 01:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌యు)లో దేశ వ్యతతిరేక నినాదాల పేరుతో వామపక్ష, అభ్యుదయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వామపక్షాలు, ఇతర పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.

02/20/2016 - 01:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బొంబాయి హైకోర్టు నిర్దోషిగా పేర్కొనడాన్ని సవాలు చే స్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తన సమాధానాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను కోరింది.

Pages