S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2016 - 09:00

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు భద్రతను, గౌరవాన్ని కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపి (అఖిల భారత విద్యార్థి పరిషత్) మాజీ సభ్యుడు ప్రదీప్ నర్వాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు.

02/21/2016 - 09:00

న్యూఢిల్లీ: ఢిల్లీ జెఎన్‌యులో గత వారం చోటుచేసుకున్న వివాదానికి సంబంధించి ముగ్గురు యువకుల కోసం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు వారిపై అభియోగం నమోదైంది. ఫారిన్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు ఢిల్లీపోలీసులు సమాచారం అందించారు.

02/21/2016 - 08:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై సమాలోచనలు జరిపా రు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రజాసమస్యలపై ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని నిలదీయాలని సోనియా పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.

02/21/2016 - 08:58

రాయపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే రాయపూర్, రాజ్‌నందన్‌గావ్ జిల్లాల్లో కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రాజ్‌నందన్‌గావ్ జిల్లాలోని కుర్రుభట్ గ్రామంలో ‘రూర్‌బన్ మిషన్’ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర నూతన రాజధాని నయా రాయపూర్‌లో సైతం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

02/21/2016 - 06:35

న్యూఢిల్లీ: నేపాల్ కొత్త రాజ్యాంగం విజయవంతం కావడమనేది ఏకాభిప్రాయం, చర్చలపై ఆధారపడి ఉందని, నేపాల్ శాంతి, సుస్థిరత, సమగ్రాభివృద్ధినే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని శనివారం ఇక్కడ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలితో విస్తృత చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

02/21/2016 - 05:31

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పంపోర్ వద్ద శనివారం శ్రీనగర్-జమ్మూ రహదారిలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడటంతో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు. వీరిలో ఒక సాధారణ పౌరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

02/21/2016 - 06:13

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జెఎన్‌యూ, జాట్ రిజర్వేషన్ల ఉద్యమం, రోహిత్ వేముల ఆత్మహత్య తదితర అన్ని వివాదాస్పద అంశాలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ హామీ ఇచ్చారు.

02/21/2016 - 05:22

చండీగఢ్: ఒబిసి కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో హర్యానాలో ఆందోళనకు దిగిన జాట్‌లు శనివారం మరింత రెచ్చిపోయారు. ఉద్యమాన్ని తీవ్రం చేస్తూ పెద్దఎత్తున విధ్వంసకాండకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు జాట్‌ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, ఆందోళన విరమించాలని హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన విజ్ఞప్తిని జాట్ నేతలు తిరస్కరించారు.

02/20/2016 - 18:46

సూరత్: పటేల్ కులస్థులకు రిజర్వేషన్లను కల్పించాలని గుజరాత్‌లోని సూరత్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్న హార్దిక్ పటేల్‌ను శనివారం ఆస్పత్రికి తరలించారు. దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనను ఇటీవల సూరత్ జైలుకు తరలించారు. తన డిమాండ్ల సాధన కోసం హార్దిక్ గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో జైలు సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు.

02/20/2016 - 18:46

లక్నో: ఇక్కడి ఎయిర్‌పోర్టు రన్‌వేపై శనివారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శకటాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Pages