S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/03/2016 - 06:28

నైజం బాబులు.. నాటు బాంబులు మీరండి.. అంటూ తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న సొట్ట బుగ్గల సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ ఇంటిదైంది. లాస్‌ఏంజెల్స్‌లో బాగా సన్నిహితులైన కొద్దిమంది మధ్య ఆమె వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 29న ఈ వివాహం జరిగిందని, ఈ వివాహనికి హృతిక్‌రోషన్ మాజీ భార్య సుజాన్నోఖాన్, ప్రముఖ డిజైనర్ సురిలీగోయల్ తదితరులు మాత్రమే హాజరయ్యారు.

03/02/2016 - 03:54

ఆముదం అంటేనే నేటి ఆధునిక కాలంలో చాలామందికి ఎలర్జీ. ఆముదం తాగిన మొహంలా పెట్టావని కూడా అంటారు. కాని ఈ ఆముదం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ. జుట్టు పొడవుగా, మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపం వలన అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో ఒత్తిడి, మానసిక కారణాల జీవనశైలిలో లోపంవలన కలిగే బట్టతలను తగ్గించేందుకు చికిత్సగా కూడా వాడతారు.

02/28/2016 - 04:10

మణిరత్నం తీసిన ‘‘దిల్‌సే’’ సినిమాతో హిందీ చలనచిత్ర రంగానికి ఒక నటి పరిచయమయింది. ఈ అందాల భామ నవ్వినపుడు తన బుగ్గమీద పడే సొట్టలో కుర్రకారు అంతా పడిపోయారు. ఆ అందాల నటి పేరే ప్రీతీ జింతా. పెద్ద కళ్లు, సన్నని కనుబొమ్మలు, ఎర్రని పెదాలు, సరైన మోతాదులో ముక్కు, అందమైన నవ్వు ఇవన్నీ ఒక ఎతె్తైతే, నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట ఒక ఎత్తు. ఈ బుగ్గ సొట్టకున్న ఆకర్షణశక్తి అంతా ఇంతా కాదు.

02/26/2016 - 20:06

సంవత్సరం పొడవునా రిఫ్రిజిరేటర్ వాడకంలో ఉన్నా ఇక ఎండలు మొదలవుతుండడంతో దాని అవసరం పెరుగుతుంది. అవసరానికి మించి ఒక్క క్షణం కూడా ఫ్రిజ్ తలుపు తెరచి ఉంచకూడదు. దీనివల్ల బయటి వేడిగాలి లోపలికి చేరి మళ్ళీ చల్లదనం సంతరించుకోవడానికి ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఖర్చవుతాయి, మరికొంత సమయమూ పడుతుంది. నిల్వ చేయాల్సిన ఏ వస్తువునైనా ఫ్రిజ్ లోపల వెనకాల గోడకు తగలకుండా చూసుకోవాలి.

02/25/2016 - 22:02

పిల్లలు ఉదయం టిఫిన్లకు బదులు నూడుల్స్ చాలా ఇష్టపడి తింటుంటారు. సాయంత్రం అయిందంటే పిల్లలూ, పెద్దలూ ఫుట్‌పాత్‌లపై ఫాస్ట్ఫుడ్ సెంటర్లవద్ద గుంపులు గుంపులుగా దర్శనమిస్తుంటారు అనడంలో అతిశయోక్తి కాదు. నేటి వడివడి పరుగుల యాంత్రిక జీవనం వల్ల ఇంట్లో అల్పాహారం వండే సమయం ఏదీ? అందుకే బండ్లపై వండిన టిఫిన్‌కు అలవాటుపడుతున్నారు.

02/25/2016 - 04:47

భవిష్యత్తును గురించి సృజనాత్మకంగా కాంక్షించేదే జీవిత స్వప్నం. ఈ ఆదర్శమే ఆరేళ్ల చిన్నారి భావన లక్ష్మి ఆచరణలో చేసి చూపించింది. అనేక మంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది. అమ్మా నాన్నల ఒడిలో ఒదిగిపోయ నూరేళ్ల జీవితాన్ని అనుభవించాల్సిన వయసులో మృత్యుఒడిలో చేరాల్సి వచ్చింది. అయతే ఈ చిన్నారి చేసిన పని మరెందరికో ఆదర్శ ప్రాయమైంది.

02/25/2016 - 04:49

దేశంలో ప్రాథమిక విద్యారంగంలో ఇరవై కోట్ల మందిని చదివించాల్సిన బాధ్యత వుంది. పిల్లలు స్కూలుకి ఒకంతట రారు. అదో సమస్య. కానీ అంతకన్నా ముందు మరో సమస్య వుంది. టీచర్లు స్కూళ్లకి రారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా టౌన్‌లో టీచర్లు యిటీవల స్కూళ్లకు- పిల్లలకన్నా ముందే హాజరయిపోతున్నారు- ఎందుకంటే- డి.ఇ.ఓ. మనోజ్‌కుమార్ మిశ్రాగారొస్తున్నాడూ అంటే- పిల్లలూ, పేరెంట్సూ- ‘‘దండాలయ్యా!’’అంటూ ప్రక్కకి తొలుగుతారు.

02/24/2016 - 08:14

ఈమధ్య కాలంలో ఇ-సిగరెట్ గురించి వినే ఉంటారు. ఇ-సిగరెట్లు అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్. ఇది మామూలు సిగరెట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి ధూమపాన ప్రియులకోసం సృష్టించారు. ఇ-సిగరెట్లు అనేవి ఎలక్ట్రానిక్ సహాయంగా తయారుచేశారు. సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్,నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది.

02/24/2016 - 08:10

నాకు నువ్వు..నీకు నేనూ, ఒకరికొకరం .. నువ్వు నేను అన్నట్లు ఎనిమిది పదుల దాంపత్య జీవనంలో ఎన్నో ఎత్తుపల్లాలను, మంచి చెడుల అనుభవాలను సరిసమానంగా పంచుకున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు ఈ వృద్ధ దంపతులు. అత్యధిక కాలం వైవాహిక జీవితం గడిపిన దంపతులుగా జీరం-గంగా రవీజ్ న్యూజిలాండ్‌లో ఇటీవలనే ఎంపికయ్యారు. భారత సంతతికి చెందిన ఈ దంపతుల వయసు 99 ఏళ్లు.

02/20/2016 - 22:10

ఓసారి ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు నా దగ్గరికి సలహా గురించి వచ్చాడు. చిన్ని మీసం, పొడుగైన గడ్డం. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గడ్డం తీరు వున్న అతడ్ని చూసి ‘చెప్పండి’ అని నేనడిగాను. ‘నా మీసం గడ్డం తీయించేసుకుందామనుకుంటున్నా’ అని అన్నాడు. ‘మాది మంగలి కొట్టు కాదు, కోతల కొట్టు’ అని నేను చెప్పా. ‘నాకా విషయం తెలుసు డాక్టర్.

Pages