S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/20/2016 - 22:39

పురుషులు స్ర్తిల కంటే ఎక్కువ మద్యం ఎందుకు తాగగలుతున్నారు అనే రహస్యాన్ని అమెరికన్ శాస్తవ్రేత్తలు ఇప్పుడు ఛేదించగలిగినట్టే భావిస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన పురుషులకంటే దానిని త్రాగిన స్ర్తిలు మరింత త్వరగా ‘మైకం’లో పడతారని, ఆల్కహాల్‌ని పుచ్చుకోవడం వల్ల మగవాళ్ళ కంటే ఆడవాళ్లకి కాలేయం దెబ్బతినడం అధికంగా జరుగుతుందని పలువురు పరిశోధకులు పేర్కొన్నారు.

04/19/2016 - 22:25

ఒకప్పుడు ఆమెను చూస్తే చీదరించుకునేవారు. అనారోగ్యం పాలైన కన్నతల్లిని కాపాడు కునేం దుకు దేవదాసి వృత్తిని స్వీకరించటమే ఆమె చేసిన నేరం. అయతేనేమి అవమానాలను దిగ మింగు కుని ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేసింది. ఈ రోజు చీదరించుకున్నవారే గౌరవిస్తున్నారు. పసి వయసు నుంచే పలు ఆటు పోట్లను ఎదుర్కొన్న మహానంద అనే మహిళ గాథ ఇది.

04/16/2016 - 22:05

గురక మనని మనవాళ్ళనుండి ఎంత దూరం చేస్తుందో దీనిని చూస్తే అర్థమవుతుంది.
అసలు గురక ఎందుకు పెడతారు నిద్రపోతున్నప్పుడు మన ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి అందకపోతే మన శరీరం గట్టిగా ఊపిరిపీల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో వచ్చే శబ్దమే ‘గురక’.
ఊపిరి ఎందుకు సరిగ్గా తీసుకోలేం?

04/13/2016 - 22:04

ఇల్లాలిని ఇంటి ఆర్థిక మంత్రి అంటారు. భార్య చేసే పొదుపే ఆ ఇంటి భవిష్యత్ పురోగమనానికి వెలుగు. వృధా కానిదే ఆదా.. ఇదే పొదుపు. ‘‘చీమ ఎంతో చిన్నది, పనిలో ఎంత మిన్నది, ముందుచూపు వున్నది, పొదుపులోన మిన్నది..’’ అంటూ చిన్నప్పుడే పాడుకున్నా ఇంకా పొదుపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. పొదుపు అంటే వచ్చే ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దానిలో కొంత భవిష్యత్ అవసరాలకు వెనుకేసుకునే డబ్బు అనుకునే రోజులు పోయాయి.

04/13/2016 - 21:49

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాట తప్పకుండా బీహార్‌లో సంపూర్ణ మందు నిషేధం విధించడంతో ఎంతోమంది మగాళ్ళతో కొంతమంది దేవుళ్లు కూడా దిగాలు పడిపోయారు. సారాభిషేకం కల్లు నైవేద్యం కొన్నిచోట్ల దేశవాళీ, విదేశీ మద్యం లాంటి వాటితో ఎంతోమంది గ్రామదేవతలకు, ‘బాబా’లకు బీహార్ భక్తులు సారాభిషేకం చేస్తారు. కాని ‘బీరు బాటిల్స్’’తో తెచ్చి కూడా చిల్లర దేవుళ్లకి నైవేద్యం, అభిషేకం చెయ్యడం వీలు అవడంలేదు.

04/13/2016 - 00:22

‘ఈ పురస్కారం నాకు ఎంతో సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది.’’దక్షిణాది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో వ్యక్తంచేసిన మాటలు. మంగళవారంనాడు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ...ప్రజలు నా కష్టాన్ని గుర్తిచినందుకు కృతజ్ఞతలు అని పేర్కొంది.

04/10/2016 - 01:09

పిల్లలమీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ వుంటుందో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి కావాల్సిన తన కొడుకు నుదుటిమీద ఎత్తుగా, పెద్దగా అందవికారంగా ఉన్న గడ్డను చూసి తల్లిదండ్రులు బాధపడటం సహజం. పెళ్లిచూపులకోసం విదేశాల నుంచి వచ్చిన కొడుకు నుదుటి మీద ఉన్న గడ్డను చూసి ముందు పెళ్లిచూపుల కంటే డాక్టర్ వద్దకు వెళ్లటం మేలని భావించి తండ్రీ కొడుకులు వచ్చారు. ‘‘అసలు ఈ గడ్డ ఏంటి డాక్టర్?’’ అని అడిగాడు.

04/07/2016 - 22:12

అదుగదుగో వస్తున్నది నవ దుర్ముఖి ఉగాది
ఇది మానవ జన మేధోమథనానికి పునాది
దుర్ముఖియను పేరేమిటి? మర్మమేమిటో వినండి!
దుర్మద దేశద్రోహుల దృష్టి దహించుటకెనండి!
ధనస్వాముల, దళార్ల చీకటి ముసుగులు
జనసేవా పరాయణోజ్వల దృష్టుల భస్మమగును
తరతరాల ఒక కుటుంబ దర్పపు పాలన అది యొక
దురాచారమే! నేటికి తొలగినదది శుభసూచన
భారత సంస్కృతిదెలిసిన వారె పాలకులు గావలె!

04/07/2016 - 22:07

శ్రీ శుభములిచ్చి తెలుగిళ్ళ సిరులవిచ్చి
చైత్రమాసపు పరువాలు ధాత్రికిచ్చి
పచ్చని బతుకుల్ అందర్కి పంచి యిచ్చి
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులిచ్చి

శిశిర రుతువు రాల్చినవన్ని చెట్లకిచ్చి
మనుషులందరికి మమత మంచి యిచ్చి
రమ్యమై నవరాగ సరాగ బాల
ద్రావిడాడపడుచువమ్మ నీవు రమ్ము

04/07/2016 - 22:05

స్వాగత గీతాల్ని వినిపించకుండానే
తెలుగువారి ముంగిట్లో
వచ్చి వాలిన వసంతం
అవును మరి- అది మన అందరి- సొంతం!
తొందరపడిన కోయిల-
ముందుగా కూసిందో-
సందడి చేసే సుమ సౌరభాలు
వడి వడిగా గుబాళించాయో

Pages