Others

స్నాక్స్ కావు...స్నేక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు ఉదయం టిఫిన్లకు బదులు నూడుల్స్ చాలా ఇష్టపడి తింటుంటారు. సాయంత్రం అయిందంటే పిల్లలూ, పెద్దలూ ఫుట్‌పాత్‌లపై ఫాస్ట్ఫుడ్ సెంటర్లవద్ద గుంపులు గుంపులుగా దర్శనమిస్తుంటారు అనడంలో అతిశయోక్తి కాదు. నేటి వడివడి పరుగుల యాంత్రిక జీవనం వల్ల ఇంట్లో అల్పాహారం వండే సమయం ఏదీ? అందుకే బండ్లపై వండిన టిఫిన్‌కు అలవాటుపడుతున్నారు. డబ్బున్నవారు తమ పిల్లలకు పిజ్జాలు, బర్గర్లు కొనివ్వకపోతే అది తమ హోదాకు తక్కువగా భావించి పిల్లల అనారోగ్యాలకు కారకులవుతున్నారు. ఈ కాలంలో పిల్లలు మూడుపూటలా భోజనం చేసే దాఖలాలు కనీసం పల్లెల్లో కూడా లేదు.
స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపురీలతోపాటు బేకరీల్లో తయారుచేసే స్వీట్స్, కేక్స్ లాంటివి తినడానికి నోటి రుచిగా వున్నా కొన్నాళ్లకు చిన్నారులకు ఊబకాయం వచ్చి తద్వారా దీర్ఘకాలిక రోగాలకు బలవుతున్నారు అని వైద్యులు ఎంత చెప్తున్నా పెడచెవిన పెడుతున్నారు. పిల్లల్లో ఊబకాయం రావడానికి పైన చెప్పిన జంక్‌ఫుడ్స్ కారణం. బర్గర్లలో కార్పొహైడ్రేట్స్, హాని కలిగించే కొవ్వుపదార్ధాలు అధికంగా వుంటాయ. ఇవి తినడం వల్ల మెదడులోని రసాయనాలు మార్పు చెందుతాయి. దాంతో ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. జ్ఞాపకశక్తి కూడా తగ్గే అవకాశాలు అధికంగా వున్నాయి. ఈ స్నాక్స్ పిల్లలే కాదు పెద్దలకూ అలవాటుగా మారింది. చాలారోజులు పాకెట్లలో నిలువ వున్న ఆహారం తీసుకోవడంవల్ల రకరకాల క్యాన్సర్లు మాత్రమే కాదు నిద్రలేమి, సంతానలేమికి గురవుతున్నారు. అమెరికాలోని పిల్లల్లో ఊబకాయానికి స్నాక్సే కారణం అని న్యూయార్కు స్కూల్ ఆఫ్ పబ్లిక్ సెంటర్ హెల్త్‌కు సంబంధించి ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయ. అలాగే బర్గర్లు, పిజ్జాలు తినడంవల్ల జ్ఞాపకశక్తి కోల్పోతారని కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయాల పరిశోధనలు రుజువు చేసాయి.
పిల్లల్లో ఈ పిజ్జాలు, నూడిల్స్ వ్యసనానికి కొంతవరకు టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం కూడా వుంది. టీవీలో నోరూరించే యాడ్స్ చూసి పిల్లల ఒత్తిడి భరించలేక వీటిని కొనడం పిల్లలు తినడంతో పాటు పెద్దలు రుచి చూస్తూ స్నాక్స్‌కు బానిసలవుతున్నారు. ఫేస్‌బుక్ సోషల్ సైట్‌ల వల్ల వీటి మార్కెటింగ్ గణనీయంగా పెరుగుతోంది. తరచు నెట్స్ ద్వారా వీటిని తిలకించి స్నాక్స్‌పై పిల్లల్లో అమితమైన ఆసక్తి ప పెరుగుతోంది అనడంలో సందేహం లేదు. రోడ్లపై దొరికే ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో దుమ్ము, ధూళి కూడా తోడై పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే అల్సర్లు ప్రారంభమవుతున్నాయి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం, ఒక వయసు వచ్చాక గ్యాస్, ఎసిడిటీలకు గురవడం జరుగుతోంది. వీటి నిషేధం నామమాత్రంగా వుండడంవల్ల ప్రస్తుతం ఇవి స్నాక్స్ కాదు స్నేక్స్‌గా తయారవుతున్నాయి.

-ఈవేమన