Others

బుగ్గమీది సొట్టకు ఏ బంగారు నగకు సాటి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిరత్నం తీసిన ‘‘దిల్‌సే’’ సినిమాతో హిందీ చలనచిత్ర రంగానికి ఒక నటి పరిచయమయింది. ఈ అందాల భామ నవ్వినపుడు తన బుగ్గమీద పడే సొట్టలో కుర్రకారు అంతా పడిపోయారు. ఆ అందాల నటి పేరే ప్రీతీ జింతా. పెద్ద కళ్లు, సన్నని కనుబొమ్మలు, ఎర్రని పెదాలు, సరైన మోతాదులో ముక్కు, అందమైన నవ్వు ఇవన్నీ ఒక ఎతె్తైతే, నవ్వినప్పుడు బుగ్గమీద పడే సొట్ట ఒక ఎత్తు. ఈ బుగ్గ సొట్టకున్న ఆకర్షణశక్తి అంతా ఇంతా కాదు. చలనచిత్ర రంగంలో సొట్టబుగ్గలున్న భామలదే పైచేయి. ఒక పెళ్లి కుదిర్చే వెబ్‌సైట్‌లో ఎలాంటి అమ్మాయి కావాలీ అనే కాలమ్‌లో ఒక అబ్బాయి సొట్టబుగ్గ ఉన్న అమ్మాయి కావాలి అని రాశాడు. నేటి తరంలో సొట్టబుగ్గకున్న సత్తా అటువంటిది.
ఓసారి నా క్లీనిక్‌కి వచ్చిన ఓ పెద్దాయిన మా క్లీనిక్ పాంప్లెట్‌లో సొట్టబుగ్గలున్న కొందరి చిత్రాలని చూసి నాతో ఇలా అన్నాడు. ‘‘మీ క్లీనిక్‌లో బుగ్గమీద సొట్టలుంటే తీసేస్తారా? మా అమ్మాయి నవ్వితే రెండు బుగ్గలమీద సొట్టలు పడతాయి అన్నాడు.’’ తనని ఆశ్చర్యంగా చూస్తు నేను ‘‘మీకు ఆ చిత్రాలని చూస్తే అలా అర్థమయిందా? మేం బుగ్గసొట్టలు తీయం, వచ్చెలా చేస్తాం’’అని చెప్పా. దానికి తను ‘‘బుగ్గ సొట్టలు ఎవరు పెట్టించుకుంటారండీ’’అని అమాయకంగా అడిగిన ప్రశ్నకు నేను నవ్వుతూ ‘‘21వ శతాబ్దంలో అమ్మాయిలకొకవరం యిది, మీ అమ్మాయి రెండు బుగ్గలమీద సొట్టలతో పుట్టి మీకు అల్లుళ్ళను క్యూకట్టేలా చేసింది’’అని చెప్పా. నేటి యువతరంలో సొట్టబుగ్గలకున్న డిమాండ్ అటువంటిది.
ఆ తరం వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటే- రుూతరం అమ్మాయిల మనోభావాలు... ఒక అమ్మాయికి తన చెల్లెలంటే అసూయ. వీళ్ళిద్దరూ పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్ళినప్పుడు అందరూ చెల్లెలి చుట్టూ చేరి నవ్వమని అడిగేవారంట. ఆమె నవ్వితే బుగ్గమీద సొట్ట పడేదట. అందరూ ఆ సొట్టను తాకి నవ్వుతూ బలే బాగుంది మాకు లేదే అని బాధపడేవారంట. ఫంక్షన్స్‌లో తన చెల్లెలికి వస్తున్న గుర్తింపుని చూసి ఈ అక్క అసూయ ఆకాశాన్ని అంటింది. తనకీ ఎలాగైనా సొట్టబుగ్గలు కావాలన్న కసితో నాదగ్గరికి వచ్చింది. తన చెల్లెలికి ఒక్క బుగ్గమీదే సొట్టపడుతుంది, నాకు రెండు బుగ్గలమీదా కావాలని అడిగింది.
అందుకే నేనెప్పుడూ అంటూ ఉంటా ‘‘బుగ్గమీద సొట్టకు ఏ బూషణంబు సాటి’’ అని.
అసలు బుగ్గమీద సొట్ట ఎందుకు వస్తుంది?
నిజం చెప్పాలంటే బుగ్గ సొట్ట ఒక లోపం, బుగ్గమీది చర్మం ఇంకా దాని కింద నుండే కండ రెండు సరి సమానంగా లేనప్పుడు ఈ సొట్ట ఏర్పడుంది. చాలామందిలో రెండూ సరిసమానంగా ఉంటాయి. కానీ కొందరిలో చర్మంకన్నా కింది కండ కొంచెం చిన్నదిగా ఉంటుంది. వీరిలో నవ్వినప్పుడు కండకన్నా ఎక్కువ ఉన్న చర్మం సొట్టలా ఏర్పడుతుంది. ఇది ఒక అందమైన లోపం.
సొట్ట పడాలంటే ఏం చెయ్యాలి?
చిన్ని ఆపరేషన్ ద్వారా బుగ్గపై సొట్ట పడేలా చేయచ్చు.
ఎంత సమయం పడుతుంది?
45 నిమిషాల నుంచి ఒక గంట దాకా పడుతుంది.
ఆసుపత్రిలో ఎన్ని రోజులుండాలి?
ఆపరేషన్‌కి 15 నిమిషాల ముందు వచ్చి, అయిన అరగంటకి వెళ్ళిపోవచ్చు.
రుూ ఆపరేషన్ మనిషికి మొత్తం మత్తు ఇచ్చి చేస్తారా?
లేదు, నోట్లో చిన్ని మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, దీని ద్వారా ఆపరేషన్ చేసే బుగ్గకి మాత్రం తిమ్మిరి వచ్చేస్తుంది. నొప్పి ఉండదు. ఈ తిమ్మిరి 2 నుంచి 3 గంటల పాటు ఉంటుంది.
మొహంపైన గాట్లు ఏమైన పడ్తాయా?
లేదు! మొత్తం ఆపరేషన్ నోట్లోంచి చేస్తాం, మొహంపై చిన్ని గాటు కూడా ఉండదు.
ఆపరేషన్ అంటే ఏం చేస్తారు?
ముందుగా చెప్పినట్టు, చర్మం కన్నా దాని కిందున్న కండ చిన్నదిగా ఉంటే సొట్ట పడుతుంది. మేం చర్మంతో సరిసమానంగా ఉన్న కండని కొంచెం కోసి తీసేస్తాం.
అలా కండకోసి తీయడంవల్ల తినడంలో కానీ, మొహానికి కాని ఎలాంటి కష్టం కలగదా?
కష్టం కలగదు కానీ జనాలకి మీరంటే ఇష్టం పెరుగుతుంది.
కుట్లు పడతాయా?
ఒకటి కానీ రెండు కానీ పడతాయి, వారం తరువాత తీసేస్తారు.
ఏ వయసులో చేయించుకుంటే మంచిది?
ఎదిగే వయసులో మొహంపై అందానికి సంబంధించిన ఏ ఆపరేషన్ మంచిది కాదు. అది మన సహజమైన ఎదుగుదలని ఆపేసే ప్రమాదం ఉంది. అందుకే 18 ఏళ్ల తరువాత చేయించుకుంటే మంచిది.
ఆపరేషన్ తరువాత?
కొంచెం వాపు ఉండొచ్చు, అది 2నుంచి 3 రోజుల్లో తగ్గిపోతుంది. భోజనంలో ఎక్కువ కారం వేడి ఉన్న పదార్థాలని ఓ వారం మానేస్తే మంచిది.
అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూచన ఏంటంటే సొట్ట నవ్వినప్పుడు మాత్రమే బుగ్గమీద పడాలి, మామూలుగా ఉన్నప్పుడు సొట్ట కనిపించొద్దు, కానీ ఆపరేషన్ తరువాత సొట్ట నవ్వినప్పుడు ఇంక నవ్వనప్పుడు కూడా కనిపిస్తుంది. 3నుండి 5 వారాలలో గాయం మానగానే సొట్ట నవ్వినప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
ఆపరేషన్ నష్టాలు:
జాగ్రత్తగా చేస్తే ఏమి లేవు.
ఆపరేషన్ తరువాత కూడా సొట్ట పడని సందర్భాలు:
ఉన్నాయి. అవి కొందరిలో మాత్రమే, దానికి దిగులు చెందాల్సిన పనిలేదు. మళ్లీ అదే ప్రదేశంలో ఆపరేషన్ చేసి మరికొంచెం కండను తీసేసి శ్రద్ధగా కుడితే సొట్ట తప్పకుండా ఏర్పడుతుంది.
సొట్ట రెండు చెంపల మీదా చేయించుకోవచ్చా?
చేయించుకోవచ్చు కానీ ఇందులోని కష్టం. ఏంటంటే రెండు బుగ్గల మీద సొట్టలు సిమిట్రికల్‌గా కనిపిస్తాయని చెప్పడం కష్టం, మిల్లిమీటర్ కండ ఎక్కువగా లేక తక్కువగా తగ్గించినా సొట్ట దిశ మారే ప్రమాదం ఉంది. అందుకే రెండు చెంపల మీద సొట్ట ఒకే ప్రదేశంలో పడేలా చేయడం కష్టం, చాలామంది ఒకే బుగ్గపైన సొట్ట కావాలని అనుకుంటారు. ఒకే బుగ్గపై సొట్ట ఫ్యాషన్.
కొసమెరుపు:
ఇంజనీరింగ్ తరువాత యాంకర్ కావాలని అనుకున్న ఓ అమ్మాయికి ఆడిషన్‌లో కెమెరా మ్యాన్ ‘‘నీ బుగ్గమీద సొట్ట ఉంటే నువ్వు చాలా బావుంటావని’’ చెప్పాడంట. ఆ మాట ఆ అమ్మాయ మెదడులో అతుక్కుపోయింది. ఆ అమ్మాయి నాదగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకుంది. ఇప్పుడు ఆమెతో పనిచేసే సిబ్బంది అంతా తనని అసలు పేరుతో కాకుండా, ‘డింపుల్’అని పిలుస్తారట. తన అసలు పేరు తానే మర్చిపోయేలా ఉందని చెప్పింది. ఆంగ్లంలో ‘‘డింపుల్’’ అంటే బుగ్గ సొట్ట అని అర్థం. ఒక బుగ్గ సొట్ట పేరునే మార్చేస్తుంది. *

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డా. రమేష్ శ్రీరంగం 92995 59615