S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/09/2016 - 22:16

చిన్ననాటి నేస్తాలను, గురువులను చూస్తే ఎవరికైనా ఆనందం వెల్లివిరుస్తుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ కూడా అలాంటి అనుభూతినే పొందింది. ముంబయిలోని నవోదయ ఇండియా డ్యాన్స్ థియోటర్‌లో ఏర్పాటుచేసిన ప్రపంచ స్థా యి నృత్య సమావేశానికి అతిథిగా ఐశ్వర్యారాయ్‌ను ఆహ్వానించారు. ఇదే సమావేశానికి నిర్వాహకులు ఐశ్వరారాయ్ చిన్ననాటి నృత్య గురువు లతాసురేంద్రను సైతం ఆహ్వానించారు.

12/08/2016 - 22:09

అనార్కలీ అందం ఎప్పటికీ చెదరనిదే.కొత్త హంగులతో మార్కెట్లోకి వస్తుంటుంది. వైవిధ్యమైన వర్ణాలతో, ఎంబ్రాయిడరీ హంగులతో అద్భుతంగా మలచిన దుస్తుల్లో పండుగల కోసం వచ్చేసింది. టాలీవుడ్ కథానాయికి రకుల్ ప్రీత్‌సింగ్ వయ్యారు ఒలికిస్తూ ధరించిన ఈ అనార్కలీ సల్వార్ కమీజ్ డ్రెస్స్ యువతుల మనస్సు దోచేస్తుంది. ఆధునికతను, సంప్రదాయాన్నీ మేళవించే అనార్కలీ సల్వార్లు కనువిందు చేస్తున్నాయి.

12/08/2016 - 08:39

డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్‌లో ముష్టెత్తుకుంటున్న ఒక స్ర్తిని నలభై రోజులు జైల్లోపెట్టి అటు తరువాత దేశ బహిష్కారాన్ని చేస్తూ నోల్వేకియాకి పంపించి వేయాలని డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్ కోర్టు తీర్పు చెప్పింది. డెన్మార్క్‌లో యాచక వృత్తిని బహిష్కరించారు. ఐరోపా యూనియన్‌లో సోల్వేకియాకి సభ్యత్వం వుంది.

12/06/2016 - 22:06

శరీరం, మనసు ఆహ్లాదంగా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం. అది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి వుంటుంది. ఇదే విషయాన్ని వైద్యులు సైతం చెప్పక తప్పదు. ఫలాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యఫలం సిద్ధిస్తుందని, ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం వుంటుంది. వీటిల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. డ్రైఫ్రూట్స్ తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలావరకూ మేలు చేకూరుతుంది.

12/03/2016 - 22:10

ఆ రోజు పొద్దునే్న మొదలుపెట్టిన ఆపరేషన్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఆ తర్వాత ఫోన్ చూసుకుంటే అందులో ఎనిమిది మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. బెంగుళూరులో ఓ పరిశ్రమలో పెద్ద పని చేస్తున్న స్నేహితుడిది. తిరిగి ఫోన్ చేస్తే, ‘‘అతని నుదుటి పక్క భాగంలో మచ్చలు వచ్చాయని, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నందున ముఖ్యమైన మీటింగ్ ఉన్నా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా, ఏదైనా మందు చెప్పవా’’ అని అడిగేడు.

12/01/2016 - 22:55

మనసులో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా సాగిపోయే జీవితం బాల్యం. అలాంటి బాల్యం పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతుంది. ప్రతి ఏడు సెకండ్లకు ఓ బాలికా వధువు పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఏటా 45 లక్షల మంది బాలికలకు పెళ్లిల్లు జరుగుతున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా మనదేశంలో సగానికి సగం మంది 15వ పుట్టినరోజుకు నోచుకోకుండానే పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతున్నారు.

12/01/2016 - 22:53

మనం నిత్యం తీసుకునే ఆహారానికి హెర్బల్ టచ్ అందించినట్లయితే ఆహారం సహజ సిద్ధమైన, ఆహ్లాదకరమైన పరిమళాలు వెదజల్లడంతోపాటు, విలక్షణమైన రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టచ్‌ని ఆహారానికి ఎలా అందించవచ్చో పరిశీలిద్దాం.

12/01/2016 - 05:21

నోట్ల రద్దు ప్రభావం చూపని చోటంటూ రుూ పవిత్ర భారతభూమిలో ఎక్కడా లేదు. రాజస్థాన్‌లో ‘పుష్కర్’కి చాలామంది విదేశీయులు- ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలనుంచి కూడా ఎంతో సంబరంగా వచ్చారు. అక్కడే జరిగే ఒంటెల సంతలు, దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధాలు- కానీ పోయిన వారం రుూ పరదేశీయులు - ‘తంతే దమ్మిడీ లేదు’ అన్నట్లుగా ఖాళీ జేబులతో హతాశులై వుండిపోయారు. బ్యాంకులలో క్యాష్ లేదు. ఏ.టి.ఎమ్‌లలో నుంచి పైకం రాదు.

12/01/2016 - 05:19

‘విధిలీల’ అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసే దుర్గటనలు చిత్ర విచిత్రంగా జరుగుతూంటాయి. అమెరికాలోని ‘అట్లాంటా’కి చెందిన అన్నదమ్ములిద్దరు, వాళ్ల నాన్నతో కలిసి, దగ్గరి అడవులలోకి వేటకి వెళ్లారు తుపాకులు ధరించి మరీ.. ‘స్కాట్ ప్రిక్కిల్ ఒకవేపు, సోదరుడు బ్రియాన్ ప్రిక్కిల్ మరొకవైపు రైఫిల్స్ పట్టుకుని వెళ్లారు. చీకటి పడుతూ వున్నా వేట దొరకలేదు.

11/23/2016 - 21:20

మణిపూర్‌లో చెలామణీ నోట్లు రద్దుకావటంతో, రుూ నెల 18, 19, 20 తేదీలు- మూడు రోజులూ కూడా ఇంఫాల్ నుంచి వెలువడే మూడు పత్రికలు ప్రింటింగ్ బంద్ చేశాయి. అక్కడ పత్రికల పంపిణీకి సంబంధించి విచిత్రమైన పద్ధతి వుంది.

Pages