Others

అక్కడ పేపర్లు లేక పాఠకుల ‘పస్తు!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిపూర్‌లో చెలామణీ నోట్లు రద్దుకావటంతో, రుూ నెల 18, 19, 20 తేదీలు- మూడు రోజులూ కూడా ఇంఫాల్ నుంచి వెలువడే మూడు పత్రికలు ప్రింటింగ్ బంద్ చేశాయి. అక్కడ పత్రికల పంపిణీకి సంబంధించి విచిత్రమైన పద్ధతి వుంది. పత్రికలూ, ఏజెంట్లూ, ధరావతు కట్టడం, పంపిణీ వగైరా పద్ధతికి బదులు పేపర్లు అమ్ముకునే పంపిణీదారులుగానీ, విక్రేతలు గానీ పత్రికా కార్యాలయానికి పోయి, నేరుగా పేపర్‌కి యింతా అని, తమ కమిషన్ పోనూ మిగతా సొమ్ములు అక్కడే చెల్లించి పత్రికల కట్టలు తెచ్చుకుని అమ్ముకుంటారుట! ఆ విధంగా పేపరు ఖరీదు నాలుగున్నర రూపాయలు అయితే, విక్రేతకు మూడు రూపాయలే మిగులుతుందిట. కాని పోయిన వారం కొనుగోలుదారుల దగ్గర చాలినంత కొత్త కరెన్సీ లేకపోవడంతో, వాళ్లు పేపర్ల కట్టలు కొనుక్కోవడం మానేశారు. దాంతో పబ్లిషర్స్ అంతా మూకుమ్మడిగా పత్రికల ప్రచురణ మూడు రోజులు ఆపేస్తాం అని ప్రకటించారు. లేదా, గవర్నమెంట్ పత్రికల్ని కూడా అత్యవసర సర్వీసుగా భావించి పాత కరెన్సీతో కొనుక్కోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ‘24వ తేదీవరకైనా పాత నోట్లకి పత్రికలు అమ్ముకోగలగాలి’ అన్నవాళ్ల గోడు స్థానిక ఎమ్మెల్యేలు విన్నారే తప్ప కేంద్రంలో పలుకుబడి చాలక, ఏమీ చేయలేకపోయారు. మణిపూర్ గవర్నర్ డా నజ్మా హెఫ్తుల్లా- తన నిస్సహాయతని వ్యక్తంచేశారు. ఆసుపత్రులు, పన్నుల వసూలు కేంద్రాల లాంటివే వార్తాపత్రికలు అన్న చట్టం లేకపోవడంతో, ప్రజలు, ప్రచురణకర్తలూ కూడా వార్తాపత్రికలు లేని మూడు రోజులూ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల ఇంగ్లీష్ పత్రికలు కొద్దిగా అమ్మకానికి దొరికాయ్. కొనేవాళ్లే తక్కువ అయినారు!

-వీరాజీ veeraji.pkm@gmail.com