Others

‘‘లేడి కాబోలు’’ అనుకుని తమ్ముణ్ణి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విధిలీల’ అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసే దుర్గటనలు చిత్ర విచిత్రంగా జరుగుతూంటాయి. అమెరికాలోని ‘అట్లాంటా’కి చెందిన అన్నదమ్ములిద్దరు, వాళ్ల నాన్నతో కలిసి, దగ్గరి అడవులలోకి వేటకి వెళ్లారు తుపాకులు ధరించి మరీ.. ‘స్కాట్ ప్రిక్కిల్ ఒకవేపు, సోదరుడు బ్రియాన్ ప్రిక్కిల్ మరొకవైపు రైఫిల్స్ పట్టుకుని వెళ్లారు. చీకటి పడుతూ వున్నా వేట దొరకలేదు. అంతలో బ్రియాన్‌కి చీకట్లు వాలుతున్న సాయంకాలం వేళ- దూరాన పొదలమాటున ఏదో జంతువు కదలాడుతున్నట్లు అనిపించింది. తక్షణం ఛాన్స్ పోనిస్తానా? అనుకుంటూ తుపాకీనెత్తి కాల్పులు జరిపాడు. 30 సంవత్సరాల స్కాట్ ఆర్తనాదం చేస్తూ నెత్తుటిమడుగులో కూలిపోయాడు. దక్షిణ కరోలినా పోలీసులూ, డాక్టర్లూ కూడా రుూ యువకుణ్ణి బ్రతికించలేకపోయారు. పాపం! అన్న రోదనని ఆపలేకపోయారు! ఈ సంఘటన నవంబర్ 16న జరిగింది. ఇది యిలా వుండగా-
తండ్రిని చంపిన తనయుడు!
సరిగ్గా యిటువంటిదే, 25 శనివారంనాడు- న్యూయార్క్ దగ్గరి శాండీక్రీక్ అడవులలో జరిగింది. ‘లేడి’ కాబోలు అనుకుని కన్నతండ్రినే, కుమారుడు తన రైఫిల్‌తో షూట్ చేశాడు. పాతికేళ్ల కుమారుడు క్రిస్ట్ఫర్ డిపారో చెట్టుమీద మాటు వేసుకుని కూర్చున్నాడు. తండ్రి తన దారంట వేట వెతుక్కుంటూ వెళ్లాడు. అంతలో పొదలకవతల, ఒక వంద గజాల దూరంలో అలికిడి అయింది. ‘దొరికింది లేడిపిల్ల’ అనుకుంటూ క్రిస్ట్ఫర్ 270 రైఫిల్‌ని ఢాం.. ఢామ్మని పేల్చాడు. అవతల్నుంచి- వెనుకటికి దండకారణ్యంలో- అలో! లక్ష్మణా!’ అని మారీచుడు ఆర్తనాదం చేసినట్లు- ‘‘మై సన్! డిపారో!’’ అంటూ తండ్రి కెల్విన్ (54) రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ‘కనీసం ఒక చిన్న కుందేలయినా దొరకకపోతుందా?’ అనుకుని వేటకి పోయిన తండ్రిని ఆ విధంగా మృత్యువు వేటాడింది. కొడుకు తక్షణం తండ్రిని ఆసుపత్రికి చేర్చాడు గానీ లాభం లేకపోయింది. అతని ప్రాణాలు అప్పటికే అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ రెండు కేసుల్లోనూ, బ్రతికి వున్న యువకులిద్దరిమీద ఏ సెక్షన్ క్రింద కేసుపెట్టాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారుట!