Others

బిచ్చగత్తెకి దేశ బహిష్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్‌లో ముష్టెత్తుకుంటున్న ఒక స్ర్తిని నలభై రోజులు జైల్లోపెట్టి అటు తరువాత దేశ బహిష్కారాన్ని చేస్తూ నోల్వేకియాకి పంపించి వేయాలని డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్ కోర్టు తీర్పు చెప్పింది. డెన్మార్క్‌లో యాచక వృత్తిని బహిష్కరించారు. ఐరోపా యూనియన్‌లో సోల్వేకియాకి సభ్యత్వం వుంది. అక్కడనుంచి యిక్కడికి ఏ రకంగా వచ్చిన పౌరులకయినా కొన్ని సదుపాయాలుంటాయిగానీ బిచ్చం ఎత్తడం ఘోర నేరం అని డెన్మార్క్ పీనల్‌కోడ్‌లోని 197వ ఆర్టికల్ చెబుతోంది. రెండువేల పనె్నండు నాటికి కేవలం ఐదుగుర్ని మాత్రమే నేరుగా బిచ్చమెత్తుకుంటున్నారని దండించారు గానీ- గవర్నమెంటు రుూ ఏడాదినుంచీ చాలా కఠినంగా వ్యవహరించాలని- యిక్కడ వున్న తూర్పు ఐరోపా దేశాల అనాధలు అంతా స్వీడన్‌కి వెళ్లి పోవచ్చునని- డెన్మార్క్ రోడ్లమీద కనబడ కూడదని పోలీసులు హెచ్చరించారు. ఐతే, రోడ్డు వారంట ఒక కంబళి మీద కూర్చుని, చిప్ప అక్కడ పెట్టి కొంగ జపం చేస్తే ఫర్వాలేదు. జనాల్ని వేధిస్తేనే- సాంఘిక నేరం అవుతుందిట!- మన ట్రాఫిక్ జంక్షన్లకీ చట్టం వర్తిస్తే ఎంత బాగుణ్ణు!

డ్యాన్స్‌కి‘నో’ అంటే....!
పంజాబ్‌లో భాఠిండా నగరంలో ధూంధాంగా జరిగిన పెళ్లివేడుకలో భాగంగా నృత్యగానం చేస్తున్న బృందంలోని కుల్వీందర్‌కౌర్ అనే పాతికేళ్ల డ్యాన్సర్ మధ్యలో దూరి, ఒక గెస్ట్ డ్యాన్స్ చేస్తానన్నాడు. వీల్లేదు అన్నారు బృందం.
అంతే! సదరు శిరోమణి-అకాళీదళ్ నాయకుని కుమార రత్నం. లక్కీగోయెల్ అనేవాడు తుపాకీ గురిపెట్టి ఆమెను కాల్చిపారేశాడు. సాధారణంగా పెళ్లిళ్లల్లో అతిథులు వీరోచితంగా సంబరాలు చేస్తూ తుపాకులు గాలిలోకి పేలుస్తారుగానీ ఈ తప్పతాగిన రాజకీయ నాయకుని పుత్రరత్నం ఆడపిల్ల మీద ప్రభావం చూపించాడు. అతనూ, అతడి మిత్రలు నలుగురూ పరారీలో ఉన్నారు. పోలీసులు శవపంచాయితీలో వ్యస్థులైవున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో కదా!

లోతులు, అంతులు చూసే ‘బార్’లు!

‘’ఆకాశం అంతులు చూస్తాం- సముద్రాల లోతులు తడుముతాం’- అంటూ చెప్పే మనిషి సినిమా పాటలకే పరిమితం కావటం లేదు. సురాపాన శాలలు అలౌకిక వంటకాల రుచులు కూడా చూడటానికి రెస్టారెంట్‌లు కట్టేసుకుంటున్నాడు. అటువంటిదే ఒక ‘సారా కొట్టు’ (బార్ అనాలి) రెడ్ సీ గర్భంలో (ఎర్ర సముద్రగర్భం) నిర్మించాడు. దానిపేరు ‘రెడ్ స్టార్ బార్’ ఓ వంద మంది అతిధులకు సరిపోయే రుూ రెస్టారెంట్ సముద్రంలో- పాతాళ లోకం చూపించే సినిమా సీను లాగ వుంటుంది.
పదహారడుగుల లోతున జలచరాలు వీపులు గోకుతున్నట్లు అద్దాల కవతల తిరుగాడుతూండగా- ఓ హోయ్!.... ఇది యిలా కాగా, చైనాలో వెయ్యి అడుగుల ఎత్తున అంబర చుంబిత శిఖరాన- స్వర్గతుల్యమయిన ‘‘పానశాల’’, ‘‘్భజనశాల’’ వగైరాలు కట్టించుకున్నారు చైనీయులు.
చైనాలో సినుయూఝామ్ నేషనల్ పార్క్ వున్న నగరంలో వున్నది రుూ అంతరిక్షం నుండి వ్రేలాడుతున్న రుూ రెస్టారెంటు. దాని మీదికి వెళ్లడానికి గాజు పలకలతో నిర్మించిన ఉయ్యాల వంతెన వున్నది. మధ్యాహ్నం టీ, కేకులు, పండ్లూ యిస్తారు. రాత్రిపూట ద్రాక్ష సారాయం వగైరా- చైనీస్‌ఫుడ్‌తో కలిపి యిస్తారు. కలేజా వున్నవాళ్లే వెళ్లాలి. ఎటుచూసినా అడవులు, లోయలు, సెలయేళ్లూ- కాలిక్రింద అంతా అద్దమే గనుక, క్రిందికి చూసినా, పైకి చూసినా కళ్లు తిరుగుతాయ్. అయినా జంటలు మహాఉత్సాహంగా- ‘రెడ్ సీ లోతుల్లో ‘కైపు’చూసినట్లే రుూ ఆకాశ హర్మ్యంలో ‘ఊపు’ తెగ అనుభవించేస్తున్నారు.
‘‘పోతేనో?’’అంటారా? ‘‘ఇవాళ ఛస్తే రేపు రెండు కళేబరం క్రింద పడ్డా ఆత్మస్వర్గానికే పోతుంది’’ అంటారు సాహసులు!-

-వీరాజీ veeraji.pkm@gmail.com