S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

07/19/2018 - 18:25

‘‘బాగున్నానండీ! మీరెలా ఉన్నారు?’’ అంటూ పైకి చూశాడు ప్రమోద్. ఫాన్ గిరగిరా తిరుగుతోంది. దీప కూడా ఆ ఫానువైపు, ప్రమోద్ వైపు చూసింది.
‘‘ఓకె! ఫైన్’’ అన్నాడు రమేష్.
‘‘ప్రయాణ బడలికతో ఉన్నారు. ముందు స్నానాలు కానివ్వండి. గీజర్ ఆన్ చేసే ఉంది’’ అంటూ ప్రమోద్‌నూ, దీపను లోపలికి తీసకెళ్లింది లక్ష్మి.

07/18/2018 - 18:26

పొట్టకోసం ఆడా మగా అన్న తేడా లేకుండా పొట్టేళ్ళులా పొద్దునే్న లేస్తూనే ఆఫీసులకు పరుగెత్తడాలూ, ఆపసోపాలతో క్రిక్కిరిసిన బస్సుల్లో, ఉక్కిరిబిక్కిరి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన స్కూటర్లలో, సైడు దొరకని సైకిళ్ళలో, ఫుట్‌పాత్‌లన్నీ చెప్పులు కుట్టేవాళ్ళతో, చిన్న చిన్న అమ్మకాలు చేసుకొనేవాళ్ళతో నిండిపోగా, సైడు కాలవల గట్లమీంచీ, చుట్టుప్రక్కల చూసుకొంటూ ఇళ్ళు చేరేసరికి ఒళ్ళు హూనం అవడం, అందరికీ అలవాటయిపోయింది.

07/17/2018 - 18:33

నేను పెద్దగా సదువుకోకపోయినా, మా అయ్య నాకు సెప్పిన పనిచేసుకుంటూ వస్తూ ఇంటివాడ్నయినా. నాకు తెలవగ అడుగుతాను, ఎవడి పని ఆడు చేసుకుపోతే తప్పేంటి? ఇయ్యాల ఆడిపని ఈడు, ఈడి పని ఆడు చేస్తున్నాడు. అందుకే అంతా గడబిడగా వుంది. ఎవడూ ఎందులోనూ గొప్పోడు కాలేకపోతున్నాడు. అందరూ బాగుండాలంటే, ఎవడి పని ఆడు చూసుకోవాలి. ఇంకోడి జోలికి పోకూడదు. ఈనాడు నాకు చాలా సంబరంగా వుంది’’ అని తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.

07/16/2018 - 18:42

ఇంత గొడవ జరుగుతున్నా ఆనాటి సన్మానం తమకేనన్న ఆనందంలో కవి, పండిత, గాయక, నృత్య ప్రవీణులు మాత్రం ఒకరినొకరు పరమద్వేషంతో చూసుకుంటూ, గ్రుడ్లు మిటకరిస్తూ, గుటకలు మ్రింగుతూ, గుండ్రాళ్ళలా, ఉండ్రాళ్ళకోసం వచ్చిన వినాయకుళ్ళలా కదలక మెదలక కూర్చున్నారు. పోలీసువాళ్ళు వచ్చి గావుకేకలు వేశాక గానీ, వాళ్ళకు ప్రాణభయం కలుగలేదు. ఓ గంట వరకూ నానాగోల జరుగుతూనే వుంది. ఆ తరువాత బాంబులేదని తేలడంతో, బాంబుల నిపుణులు వెళ్ళారు.

07/15/2018 - 22:30

‘లంబోదర లకుమిరా’ అని పాడుకుంటూ వచ్చిన రామశాస్ర్తీ, ఆ ఇంటి గేటు ప్రక్కన గూటిలో వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించి హారతి ఇచ్చి తలుపేయబోతుండగా, ఇంటాయనవచ్చి హారతి కళ్ళకద్దుకొని, తన సూట్‌కేసుతో లోపలికెళ్లాడు.

07/13/2018 - 18:27

మీ అదృష్టం బాగుంది మీకో మంచి పదవి దక్కిందనుకోండి. మీ ద్వారా ఎన్నో పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడల్లా మీకిచ్చే బిరుదుపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయ్. చెక్కగారంటే మీరు బిక్కమొగం పెడ్తారేమో. పోనీ పేకముక్కగారంటే పేలవంగా వుంటుందేమో. ఇలా రకరకాలుగా అనుకుంటున్నా. మీ స్పందన కోసం అందరూ ప్రస్తుతం చెక్కగారని పిలుస్తున్నారు. ఘంనగా, గట్టిగా, స్ట్రాంగ్‌గా వుంటుందేమోననుకొని.

07/12/2018 - 18:10

వీడి సావాసమే మా అబ్బాయికీ అబ్బి, మంత్రినవుతా, మంత్రినవుతా నంటూ ఉబ్బితబ్బిబ్బై వాళ్ళావిడ దగ్గర గంతులేస్తున్నాడు. ఆవిడ అంతకన్నా అపుడే ఆవిడ మంత్రిగారి భార్య అయిపోయినట్టు, మాటా పలుకులేకుండా గాల్లో తేలిపోతోంది. ఈ గర్వాలేమిటో ఈ గోలలేమిటో, నాడు ఏనాడన్నా మేం ఇవన్నీ ఎరుగుదుమా, ఏదో ఇంత తిన్నామా, ఓ మూల పడున్నామా అంతే’’.

07/11/2018 - 18:59

కాలింగ్ బెల్ విని తలుపు తీసింది మహాలక్ష్మి. ఎదురుగా పంగనామాలతో, పంచెకట్టుతో, లాల్చీ ధరించిన వ్యక్తి నిల్చున్నాడు. ఆ కాసేపట్లోనే జేబులోంచి, నశ్యం డబ్బా తీసి నాలుగుసార్లు పీల్చి, అయిదుసార్లు తుమ్మాడు. ఆరోసారి వచ్చే తుమ్మును ఆపుచేసుకుంటూ, తలుపు తీసి వచ్చిన ఆవిడవైపు తేరిపార చూసి తనలో అచ్చు మహాలక్ష్మిలానే వుంది అని లోపల అనుకోబోయి పైకే అనేశాడు, ఆమె విన్నది.

07/10/2018 - 19:12

‘‘జుస్సూ! ఆ సామ్రాజ్యం నిన్నక్కడే దెబ్బకొట్టింది. మాట్లాడకుండా ఆ అయిదువేలు తీసుకొస్తే సరిపోయేది. అందుకే మనవాళ్ళన్నారు దురాశ దుఃఖమునకు చేటని. ఈ రోజుల్లో పెద్దలెవరిక్కావాలి. వాళ్ళ మాటలెవరిక్కావాలి. ఎవరికి వారే పెద్దలు. ఏం చేస్తావులే వారం వారం వెళ్లి పీల్చిరా!’’ అన్నాడు కఫై.
‘‘ఇక నా బ్రతుకు పొగేనా’’ అంది ఏడుపు మొగం పెట్టి జస్సు.

07/09/2018 - 21:55

మున్ముందూ ధరలు బాగా పెరిగిపోతాయని జఫై ఇటుకలు కొనుక్కొని కూడబెట్టుకున్నట్లే తను కూడా పెట్రోలు కొని కూడబెట్టుకోవడం, కారు డ్రైవింగ్ నేర్చుకోవడం, కారు రిపేరైతే ఎలా బాగు చేసుకోవాలో నేర్చుకోవడం లాంటివి చేయాలని ఆఫీసుకొస్తూనే నిర్ణయించుకున్నాడు. తనకొచ్చిన ఈ అపూర్వ ఆలోచనకు సంబరపడిపోయి, ఆఫీసు వదలగానే ఇంటికి వెళ్ళేటప్పుకు ఓ పెట్రోలు డబ్బా కొనుక్కొని వెళ్లాడు.

Pages