S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

08/12/2018 - 22:52

అడుగుజాడ గురజాడ అది భావికిబాట
మనలో వెధవాయిత్వం మరపించేపాట
అడుగుజాడ
ఇవి శ్రీశ్రీ కవితా వాక్యాలు. ఇందులో గురజాడ సాహిత్య సారమంతా ఇమిడి ఉంది. గురజాడ అడుగుజాడని గుర్తించాలంటే ఆయన సాహిత్యాన్నంతా పరిశోధించాలి. అందుకు స్థూలంగా కన్యాశుల్కాన్ని పరిశీలించినా చాలు.
ప్రధానోద్దేశం

08/10/2018 - 19:00

క థా పరిష్కార ఘట్టంలో
సెట్టియొకడు నేను చెకుముకి శాస్ర్తీయు
కాలరుద్రు మూడు కనుల భంగి
మేము ముమ్వురమును మేల్కొని యుందుము
ప్రభువు విశ్రమంబు బడయుగాక’’
అనడం యుగంధరుని వంటి నిరంతర జాగ్రన్మూర్తికి సహజం.
సేనాని విశ్వాసరావు అన్నట్టు
ఆయన గాలిని బేనును తోయముతో నఱకు బొగలతో గోడలిడున్
ఆయన ప్రయోగ మభినవ తోయజ భవ సృష్టి పెఱది దుస్స్వప్నమగున్’’

08/09/2018 - 18:56

ఆయా పాత్రల మధ్య కథను పడుగు పేకగా అమర్చి నాటక కథా సంవిధానానికీ, మనస్తత్వ చిత్రణకీ, రసపోషణకీ త్రివేణీ సంగమంలాగా ఆంధ్రౌన్నత్యానికి అనన్య దర్పణం లాగ వేదం వారు రచించిన ప్రతాపరుద్రీయ నాటకం అసదృశ్యకావ్యం.

08/08/2018 - 19:08

ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ ఆరేనెల్లకు పట్టుకుపోతాన్,
వీరణ్ణి రాగణ్ణి మన్ను చేయిస్తాన్,
గోతిలో పెట్టించి గోరీ కట్టిస్తాన్’’

08/07/2018 - 19:07

సారె చీరెలు నగలును చాలగొనుచు
బుట్టినిండ్లు గుల్ల చేసి పోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగదురు
మగనిపై కూర్మి అధికంబు మగువకెపుడు
అంటాడు సుభద్రతో కృష్ణుడు. తల్లితో
తనయుని కంటె పుత్రికలె తద్దయు తల్లికి గూర్తురందు చే
ననయము నాడు వారలకు అల్లునిపైఅనురాగ మగ్గలం
బని బుధులందు రాపలుకులన్నియు నిక్కములయ్యె నాకతం

08/06/2018 - 19:47

ఈ అంకంలో కరుణ రసాత్మకమైన పద్యాలున్నాయి. అవి ప్రేక్షకుల మనస్సులను కరిగిస్తాయి.
ఖలులనేనియు కావ కంకణము దాల్చు
నలిన నాభుండు భక్తుని నన్ను చంప
ప్రతిన గైకొన రక్షించువా డెవండు
కంచెయే చేను మేసిన కలదె దిక్కు

08/05/2018 - 21:45

తరువాత రామయామాత్యులు మొదలైనవారు పద్యకావ్యాలలో, ధేనువుకొండ తిమ్మయ్య జంగం కథగా వ్రాయటం, కన్నడంలో ఎస్.సి.కేల్‌కర్, తెలుగులో కొండుభట్ల మొదలైనవారు చిలకర్తి వారి కంటే ముందే నాటకీకరించటం ఈ కథలో ఉన్న నాటకీయత యొక్క ఆకర్షణను తెలియజేస్తాయి.

08/03/2018 - 19:32

అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
బంపు మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
నెత్తుకపోయి చెట్లెక్కగలమె
ఇల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
మిసిమి ముద్దలు తెచ్చి మ్రింగగలమె
గొల్లబొట్టెల గూడి కోలచేకొని ఆల
కదుపల నేర్పుతో కాయగలమె
తల్లిదండ్రుల పరులకీ దలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంపగలమె

08/02/2018 - 19:12

ఏక సూత్రత లేకపోవడం ఆధునిక మహాభారతం ఇతిహాస స్థాయిని అందుకోకపోయినా పాఠకుని మనస్సులో కవిత్వపు ముద్రల్ని బలంగా వేస్తుంది.
‘‘బ్రహ్మాండమైన నక్షత్రాల ఊరేగింపులో
వెనె్నల జెండా పుచ్చుకుని చంద్రుడు
ముందు నడుస్తున్నాడు’’
ఇది గొప్ప ఊహ, ఊహ నుంచి సందేశమేదైనా ఉందా అంటే తాళం చెవి దొరకడం కష్టం. కానీ
సముద్రం ఒకడి కాళ్ల ముందు
మొరగదు-
తుపాను గొంతుకు చిత్తం అంట

08/01/2018 - 19:12

‘‘విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం
ఇక్కడే వెయ్యిసార్లు నా లోకాల్ని కోల్పోయా’’
కవికి మానవ నాగరితా పరిణామంలో తాను ప్రజలు- నగరం- ప్రకృతి మధ్య లోపించిన ఆత్మీయ సమతుల్యాన్ని తిరిగి పొందే తీవ్ర వాంఛ వ్యక్తపరుస్తాడు.
‘‘రాళ్ళ కన్నీళ్లు వ్యాపించిన ఈ భూములపైన వేస్తాడు ఒకడు- ఇనుప కండరాల దేహంమీద సుళ్లు తిరిగేము’’-
అని అంటూ

Pages