S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/13/2020 - 22:18

కాంతులకే రాజు రవీంద్రుడు
పండుగలకే వనె్న మకర సంక్రాంతి
పర్వదిన ఉషోదయం తెచ్చె
సంబరాల పూలతోటల పరిమళాలు

హరిదాసు కీర్తనల నాద సంగీతాలు
భోగి మంటల భోగభాగ్య తోరణాలు

గంగిరెద్దుల నాట్య విన్యాసాలు
గొబ్బెమ్మల దివ్య దీవెనల మూటలు

01/13/2020 - 22:25

మానవ మేధస్సు ముందు ప్రపంచమే గ్రామంగా మారినవేళ
ఆచారాలకు గ్రహణం పట్టగా, సాంప్రదాయాలకు వనె్న తగ్గిన తరుణంలో
ఆహారం, ఆహార్యం అన్నిటా పల్లెలు పట్టణాలతో పోటీ పడుతుంటే
అనురాగం ఆప్యాయతలు టి.వి. సెల్‌ఫోన్‌లకు పరిమితం కాగా
ఎప్పుడు డబ్బు ఉంటే అపుడే పండుగ
అనే నిర్లిప్తత జనంలో ఆవరించినవేళ
సంక్రాంతి పండగ రోజే మా గ్రామ దేవత జాతర రావటం
ఎక్కడెక్కడో ఉన్న ఆడపడచులు

01/13/2020 - 22:05

అందరి గమ్యం ఒక్కటే
అక్షరంగా మొదలెట్టి
ఇతిహాసంగా ఎదిగిపోవాలని
వాళ్లంతా నీళ్లను, నక్షత్రాలను, నేలను చూపిస్తారు
బిందువు సింధువుగా -విత్తనం మహా వృక్షంగా
మట్టి దేశాలుగా నక్షత్రం గెలాక్సీలుగా మారిన వైనాన్ని వర్ణిస్తారు
అలెగ్జాండర్, అశోకుడు, అక్బర్, అంబానీలను
బ్రిటన్ బిల్ గేట్స్, బిర్లా , బెజోస్ లనూ కీర్తిస్తారు

01/06/2020 - 23:43

ఆకురాలి పడుతున్నది
చిగురై వికసించాలని
ఓటమి పరుగిడుతున్నది
గెలుపై భాసించాలని

ఆవేదనతోటి అవని
గుండె పగిలి పోతుంటే
మబ్బు పరుగు పెడుతున్నది
చినుకై వర్షించాలని

అజ్ఞానం ముసురుకున్న
మనిషి అంతరంగంలో
చీకటి అడుగిడుతున్నది
చిక్కగా విస్తరిద్దామని

01/06/2020 - 23:41

ఎవరికీ చెప్పొద్దు
నువ్వూ నేనూ మనం కాదు
నువ్వూ నేనూ పూర్తిగా నేనే
తనకు మొదటి నుండీ ఇదే ఆలోచన
నా వ్యక్తిత్వంలో కూడ
తన ఇష్టం నడవటం
లేదన్నదే సమస్య

01/06/2020 - 23:48

అంబరాద్భుతం
గ్రహణం పట్టిన రాత్రి
గ్రహణం పట్టిన బతుకు
గ్రహణం వీడిన జీవితం
పట్టిన గ్రహణం వీడదా?
తరలుతూన్న మేఘాల
తెరలు తొలగిపోవా? అనే
బుజ్జగింపు బాసలు.

గ్రహణానికి, గరికకు సంబంధ సంగతేమోగాని,
రాహుకేతువులు మూఢనమ్మకాలనే
వారిమాట లేమోగాని,

01/06/2020 - 23:35

విశ్వ శాంతి గీతం
మంచో చెడో
విషాదమో వికాసమో
ఏమైతేనేమి?
కొన్ని జ్ఞాపకాలనుపేర్చి
సెలవంటూ కాలం తరిలి వెళ్లింది
అడుగిడిన
నూతన వత్సరంలోనైనా
జీవన రీతుల కొత్తపుంతలు తొక్కిద్దాం
చెడు తలు (ల) పులు మూసి
మంచికి స్వాగత తోరణం కడదాం
సంకుచితత్వాన్ని సమాధిచేసి
విశాలభావనకు ఊపిరిపోద్దాం
ఆవేశాలకు అడ్డుకట్టవేసి

01/06/2020 - 23:33

వేన వేల సూర్యకిరణాలతో అల్లుకుపోయిన వెలుతురు
భూమిని ముద్దాడింది మొదలు
మొదలయ్యే జీవనసంపుటి నుంచి
రక్తమాంసాలు నిండిన అక్షరాలు
అదేపనిగా రాలుతూనే ఉన్నాయి

ఏరుకుని కడుపు నింపుకునే పక్షులు
ఏరుదాటి తెప్పతగలేసే రకం కాదు
జీవవైవిధ్యపు పోకడలతో
జీవితాన్ని అనుక్షణం సమీక్షించుకుంటూనే ఉన్నాయి

12/30/2019 - 22:23

హృది పేటికల్లో పదికాలాలపాటు పదిలపరచుకోగలిగేవే కథలు. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నాలే. రచయిత కాల్పనిక దృష్టితో సృజించిన కథలు చదివించేవిగా ఉండొచ్చు. కానీ ఉపయోగ నిరుపయోగ విషయం ఆలోచిస్తే మాత్రం సమాధానం వెంటనే స్ఫురిస్తుంది.

12/30/2019 - 22:21

కౌరవులు ఎవరు
పాండవులు ఎవరు
వంకర టింకర ప్రశ్న

ఇరువైపుల విస్తరించె
శకుని కూటనీతి
ధర్మరాజు వీడలేదు
జూద వ్యసనం
ప్రతి పంచాయతీలో
పాంచాలి అవమానిత

కృష్ణుడు లేకయే
నేడు
మహాభారతం

Pages