Others

అంబరంలో అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబరాద్భుతం
గ్రహణం పట్టిన రాత్రి
గ్రహణం పట్టిన బతుకు
గ్రహణం వీడిన జీవితం
పట్టిన గ్రహణం వీడదా?
తరలుతూన్న మేఘాల
తెరలు తొలగిపోవా? అనే
బుజ్జగింపు బాసలు.

గ్రహణానికి, గరికకు సంబంధ సంగతేమోగాని,
రాహుకేతువులు మూఢనమ్మకాలనే
వారిమాట లేమోగాని,

గర్భిణి గ్రహణం వీక్షిస్తే
గర్భస్ధ శిశువుకు గ్రహణశూల అని
గది నుంచి బయటకు వారించేవారి
సంగతేమోగాని,

అంగవైకల్య నివారణకు
అంగాంగ భూస్ధాపిత వైద్య ప్రక్రియయేమోగాని -

అంబరంలో అద్భుతం కనిన నాకు
ఓజస్తేజుని చూస్తే ఒకింతనిపించింది,
విస్తుపోయే విషయంలో, గ్రహణగతి
విజ్ఞానాన్ని పొందాలని.
నాటి సంపూర్ణ సూర్యగ్రహణం

సాయం సంధ్యాసమయ భ్రమతో
వినువీధిన గృహోన్ముఖ విహంగాలు,
పగలే వెనె్నలన్నట్లు చకితుల్ని చేస్తే,
నేటి పాక్షిక గ్రహణ వీక్షణం
ఇందుమణి చాటున
కంకణాకార
కనువిందు చేసిన
అంబరమణి!

తేలియాడే మేఘమాల
తెరమరుగున సూర్యుడు,
కనికరం లేని కష్టకాల గ్రహణం
కొంతకాలమనే సత్యం.
నేత్రానికి మనసుంటే
ధరణంతా దేదీప్యమానం,
ప్రకృతి ప్రతినెలవూ సుందరం,
సుందరదృశ్యం నిత్యానందకరం,
నిత్యానందకరం సత్యం,
సత్యం శివాత్మకం,
సత్యం, శివం, సుందరం.

- వేదం సూర్యప్రకాశ్ .. 9866142006