S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/19/2019 - 22:17

మట్టిగోడల ఇళ్ళు
కూటికుండ తిళ్ళు
నులక మంచాల పవ్వళ్ళు
ఆటల సంద్రంలో ఈదిన
ఆహ్లాదాల సాయంత్రపు పడవలు
బాధ్యతగా భుజాలకెత్తుకున్న
అనుబంధాల కాశీ కావిళ్లు
లోటన్నది తెలియక గడిచిన
ఘనమైన రోజులు
జోరు వర్షంలో
మంజురు మీదుగా రాలుతున్న
ముత్యపు చినుకుల్ని
అరచేతుల్లోంచి తుళ్లించే
అమాయకపు నవ్వులు
కలల పండగల్ని ఆహ్వానించి

11/19/2019 - 22:17

నిజానికి కొందరికి
దుఃఖం విడిగా రాదు
సుఖాల వెంపర్లాటలో
అదృశ్యంగా వెంటాడుతది

లక్షల కోట్లు వెనకేసుకున్న వాడికి
సుఖమెప్పుడూ ఎండమావే
పరుగెత్తినంతకాలం
జైళ్ళు నోళ్ళు తెరుస్తాయ

బుకాయంపుల వెనక
చిదంబర రహస్యాలేముంటాయ?
తప్పించుకునే యత్నంలో
దింపుడు కల్లం ఆశలే!

11/19/2019 - 22:09

అదిగో
ఆ కటిక శిలను
సజీవ శిల్పంగా చెక్కిందెవరు

ఆ కణుపుల వెదురును
సప్తస్వర మురళిగా
మలిచిందెవరు?

ఆ నూలు పోగుల
సుందర వస్త్రంగా
అల్లిందెవరు?

ఆ కఱ్ఱదుంగను
అందాల బొమ్మగా
రూపమిచ్చిందెవరు?
ఆ బురదమట్టిని
దాహార్తిని తీర్చు పాత్రగా
తీర్చిదిద్దిందెవరు?

ఆ ఇనుమును
మానవ పనిముట్టుగా
మార్చిందెవరు?

11/19/2019 - 22:06

ముక్కు మీది వేలు లేదు
గడియారంలోని ముల్లు లేదు
సర్పాలు తలపాగాల్లా అల్లుకుంటున్నాయ
తెగిపోతున్న వేళ్లు
అరచేతి జాతరలో -
గోడల్లేని ఇంట్లో
తుపాను పాయసం ఆరగింపు!
ఉల్లి పొరల్లా వస్త్రాలు ఊడిపోతున్నాయ
చేపలు పట్టే వలలోనే
చేపల్లా తనువులు హత్యీకరణ
అ, ఆ ల, ఓనమాల గులాబీలు
రక్తం కక్కుతున్నాయ!
గరిక మొలకెత్తని దిబ్బలు లేస్తున్నాయ!

11/19/2019 - 22:00

వివేక చూడామణి (తెలుగు)
మూలం: ఆదిశంకరులు
అనువాదం: శ్యామశాస్ర్తీ
వెల: 300 - పుటలు: 500
ప్రతులకు
యుగాది పబ్లికేషన్స్
304, శ్రీ దుర్గా రాజీవ్ రెసిడెన్సీ
విజయపురి, తార్నాక
హైదరాబాద్ - 500 017
*

11/11/2019 - 22:59

ఇవాళ మనస్సు
అలలు లేని చెరువులా వుంది
ఖాళీ కుండలా
చీకటిగా వుంది

ఎవరైనా మిత్రుడ్ని రమ్మంటేనో
కాని మనస్సుకతడు కావాల్నో వద్దో!
నేనే ఎవరింటికైనా వెళ్లివస్తేనో
ఇదీ కష్టమే.
అక్కడ నా కోసం
అనుకూల పవనాలు వీస్తున్నాయో లేదో!
‘ఆయాయే ఆప్ కీ జరూరత్ హై’ అనే పాట
యూట్యూబ్‌లో మాయమైంది
మళ్లీ వెతికి తియ్యాలి.

11/11/2019 - 22:57

వసంతం వాడిపోయందని
మల్లెలు మాడిపోయాయని
జిల్లేడు డొంకల మధ్య
పిచ్చి కోయలలు విషాద గీతాలు పాడుతున్నాయని
నాకు బాధ లేదు... భయం లేదు
మళ్లీ వసంతం వస్తుందని
మరుమల్లెలు విరుస్తాయని
కొత్త కోయలలు మెత్తగా పాడతాయని
నాకు ధైర్యం.. నాకు నమ్మకం
అందమైన చంద్రుడ్ని మబ్బులు మింగేసినా
నిప్పులు చెరిగే సూర్యుడ్ని
మబ్బులు కమ్మేసినా
అది క్షణికం

11/11/2019 - 22:53

ఎంత దూరం నడిస్తేనేం?
నడిచిన చోటే వుండిపోతాం
పోతూ పోతూ పోయనోళ్లంతా చెప్పిన పాఠాలు
నెమరేసుకున్నట్టే వుంటుంది కాని
మనదాకా వస్తేనే కాని ఏదీ అర్థం కాదు
కవిత్వమైనా, జీవితమైనా,
కాలమైనా, చివరికి ముగింపైనా
శూన్యాన్ని కప్పుకున్న వాళ్లంతా
క్షణం నిద్రపోని మేధోజీవులై పోయనట్టు
ఒక్కోసారి పశులకాపరి వినిపిస్తున్న పాట కూడా

11/11/2019 - 22:51

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్ ప్రేమలు
ఇంట్లో వాళ్ళే కంట్లో నలుసులు

ఫేస్‌బుక్‌లో పెక్కు పరిచయాలు
పక్కింట్లో వాళ్ళు ఎప్పటికీ అపరిచితులు

తెల్లారక ముందే వాట్సప్ పలకరింపులు
తెల్లార్లూ గడిపేవాళ్లతో
మొహం మొటమరింపులు

సైబర్ లోకంలో సూపర్‌స్టార్లు
చుట్టూ సమాజంలో ఒంటరిగాళ్ళు

11/03/2019 - 22:55

వచ్చే బస్సులు వస్తుంటై
పొయ్యే బస్సులు పోతుంటై
అయనా ప్రయాణికులు వుంటుంటరు

పూసవేర్ల బాలరాజు
ఎడమ చేతికి మేదరిబుట్ట తగిలించుకుని
పైత్యానికి ఒకారానికి
అల్లం మురబ్బా అంటూ
బస్సు బస్సు తిరిగి అమ్ముతుంటాడు

ఉడికించిన పచ్చి పల్లికాయ
మక్క ప్యాలాలు
బస్సు ఎక్కుతూ దిగుతూ
నోరూరిస్తూ అమ్ముతుంటరు

Pages