Others

ఘనులు! తిరుపతి వేంకట కవులు! నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ ‘బావ! ఎప్పుడు వచ్చితీవ’న్న పద్యాన
మీరె జీవించి యున్నారుగాదె!
‘మనమ! వద్దిక నాదు మాటను వినుమ’న్న
సూక్తిలో మీరొప్పుచుంద్రుగాదె!
‘నేనెవచ్చెదను నేనే వత్తున’ను చమ
త్క్రియ మీకు తప్ప నేరికి వశంబు?
‘గణచతుర్థి దినాన ఫణి చతుర్థి’ సమస్య
చాకచక్యపుఁ బూర్తి మీకె అగును,
ఏ యమావాస్య తెలుగులో నెఱుగనట్టి
సాహితీ కౌముదిని పంచఁజాలు మిమ్ము
మరువ శక్యంబె? ఏ కవీశ్వరునకేని
ప్రకట ‘తిరుపతి వేంకట సుకవులార!’
వందనంబులు - సాహితీ చందనములు

-రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287